గంగిరెద్దు

కవిత

పౌష్యలక్ష్మి ఆగమన వేళ ప్రత్యేక ఆకర్షణ
సస్యలక్ష్మి అనుగ్రహాన తనదైన ముద్ర
నేలతల్లిని నాగలిచే అర్చించిన యాజ్ఞీకుడు
గాదెల గుడిలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించిన అర్చకుడు

మూతికి మూజంబరం
తోలు కుచ్చుల ఫాలభాగం
తగరపు జిలుగుల నడికట్టుతో మురిపించే ముద్దుల బసవడు
గవ్వల హారాలు కాళ్ల గజ్జెలతో ముచ్చట గొలిపే గిబ్బలరేడు
రంగుల వలువలతో సర్వాంగ సుందరుడు
సాక్షాత్తు నందికేశ్వరుడు

మేళతాళాలతో వీనుల విందు గొలిపే సన్నాయి అప్పన్న
తెలుగు నేలకు అరుదెంచిన
యదువంశ ప్రతినిధి
జ్ఞానానందాన్ని పంచే జానపద కళానిధి

     పద్మశ్రీ చెన్నోజ్వల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు

సంక్రాంతి పండుగలో పరమార్థం