జాగృతం

కవిత

రోజువారీ వెతల కథలకు విసిగి
విశ్రాంతి కోరిన కనుదోయి
రెప్పల తలుపులు మూసి
ఊరట దొరికే నెలవుకై వెతుకులాడుతూ వెళ్తున్న
నాకు నడిరేయి దాటినా కానరాని
చిత్త శాంతికై ఆరాటంతో
మబ్బుల వాకిట్లో ఊరట కోసం
పచార్లు చేస్తున్నప్పుడు… కళ్ళముందు కదలాడిన
వాస్తవాన్ని చూసి
నా పెదవులపై అప్రయత్నంగా
ఓ హాసరేఖ…

చంద్రునితో జతకట్టాలని పోటీ పడుతూ తమ
తళుకు బెళుకులతో పోటీ పడుతున్న తారకలెన్నో!

భూమి మాత్రమే గుండ్రంగా ఉంటుందన్న భ్రాంతిని వీడిన
నా కనుగవ ససేమిరా తన రెప్పలు మూయనంటూ మారాం చేస్తుంటే..
నిద్రపుచ్చే ప్రయత్నంలో
బుజ్జగిస్తూ నా మనసు!

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చివరి క్షణం

మాతృ భాషా సేవ