డిజిటల్ వేధింపులు

కవిత

నువ్వెక్కడో చేసిన
ఓ చిలిపి చేష్టో
అకారణంగా చూసిన
చెడువాంఛ దృష్టో
ఆమెనింకా
ఇంకిపోయేలా చేస్తున్నది
నువ్వక్కున తీసుకున్న
ఓ చనువు తీరో
తడబాటుగా చేసుకున్న
అలవాటు రీతో
ఆమెనింకా
అభద్రతలో ముంచేసింది
మనుషులం కదా
మారే మనసుల్ని మెదళ్ళను
శరీరంలో వేసుకుని ఊరేగుతున్నాం..
ప్రశంసలకైతేనేమో
ఆలోచనలు అనే సొగబు
తప్పిదాలకు
సెరెబ్రల్ స్టిమ్యులేషన్స్ అనే వాకబు
అలాంటప్పుడు ఉత్తమాటలు కట్టిపెట్టాలి
ఉత్త నటనల మాస్క్ తీసి
చెప్పుతో కొట్టాలి
మోసపోతే బాధితులు అనే
ఈ సమాజానికి
బాధ్యతాయుతులే
బరితెగిస్తారని తెలియాలి

Written by Sunka Dharani

పేరు: సుంక ధరణి
D/O: సుంక నర్సయ్య
రాసిన పుస్తకాలు:
అరుణిమలు (కవిత్వం),
భూమిని నేను ( దీర్ఘ కవిత్వం)
విద్యార్హతలు: Msc Botany, MA Telugu

"ఇంచుమించుగా నా పద్దెనిమిదవ ఏట సాహిత్యావలోకనం జరిగింది. తెలుగు భాష మీదున్న మక్కువే వివిధ సమాజ స్థితులపై స్పందించేందుకు దోహదపడుతుంది. అలా సమకాలీన విషయాలను అధ్యయనం చేస్తూ కథలు, కవిత్వాలు రాస్తున్నాను. నిలువెత్తు మనిషి ఆకారంలో ఒదిగిన మనసు సంచిలో కాసింత మానవీయతను మూటగట్టుకోవాలని తెలిపేదే నా కలం."

మెయిల్‌: dharanisunka19@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుగు జాతీయాల సొగసు

ఒడిపిళ్ళు- 26 వ భాగం