దశహరా

దశ హర కు మారుపేరు దసరా . పది పాపాలను హరించేది దశహర  . వ సంత , శరదృతువు లు విషపూరిత కోరలని  ,వాటి బారి నుండి మానవాళిని రక్షించేందుకు దుర్గాదేవిని పూజించాలని  ప్రాచీనుల విశ్వాసం .

సంక్రాంతి మూడు రోజుల పండుగ అయితే విజయదశమి తొమ్మిది రాత్రుల పండుగ అంటే పది రోజుల పండుగ .

హోరా అంటే అహోరాత్రం . అంటే  24 గంటల రోజు అని అర్ధం .అలాంటి హోరాలు దశ (పది )కలిపితే  ,అది దశ హోర అయింది  .అం దరి నోళ్ళల్లో పడి కాలక్రమంలో దసరాగా మారిపోయింది . .

ఈ దసరా పండుగ మూలాలు చాలా పాతవి . అంటే మీరు ఊహించలేనంత పాతవి  .సింధూ  నాగరికత కాలం నాటి అమ్మ తల్లి తర్వాతి కాలాల్లో అనేక రూపాల్లో వివిధ పేర్లతోనేటికీ  పూ జిం పబడుతోంది .

ఈ పండుగ ఆశ్వయుజ శుక్లపక్ష దశమి తిధి నాడు జరుపుకుంటారు . ఈనాటి సాయంకాలాన్ని  విజయకాలమంటారు.విజయ దశమి పండుగ రోజు  తిధి  తో బాటు  శ్రవణా నక్షత్ర కూడా కలిసి  ఉండాలని జ్యోతిష్కులు నిర్ణయించారు  .

దసరా పండుగ ప్రధానంగా రాజులకు సంబంధించినది. పూర్వం వర్షాకాలం యుద్ధాలకు ప్రతికూల సమయం  . వర్షాకాలం ముగియగానే యుద్ధ యాత్రలకు బయలుదేరేవారురాజులు .వీటినే జైత్రయాత్రలు అనేవారు .

దసరా పండుగ ల సందర్భంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో అమలులో ఉన్న ఆచారాల్లో కొట్ట వచ్చేటట్లు కనిపించేవి అరవ దేశాల లో ఆడపిల్లల బొమ్మల కొలువు  ,ఆంధ్ర దేశాల లో బడి పిల్లల విల్లంబుల ధారణ చెప్పుకో దగినవి  .బడి పిల్లలు దసరా రోజులలో విల్లంబులు ధరించడం వారి కోసం  కాదు గురువు గారి  కొరకు .

పిల్లలు అలా విల్లంబులు పట్టుకొని  ఊరి లోని వీధులన్నీ తిరుగుతూ  చక్కటి పద్యాలు   ,పాటలు పాడేవారు .వాటిలో  గురువుగారికి గురుదక్షిణ  ఇవ్వమని  , గ్రామ ప్రజలను వేడుకోవడం ముఖ్య అంశం .

1920 ప్రాంతాల్లో మద్రాసు వావిళ్ళ వారు దసరా పద్యాలు అనే పేరుతో , మహర్నవమి పద్యాలు అనే పేరుతో చిన్న చిన్న పుస్తకాలు అచ్చువేశారు  . అంటే అప్పట్నించే మౌఖికంగా ఉన్న ఈ పద్యాలు అచ్చులో కనిపించడం మొదలయ్యింది .

దసరా పాటల మూలకంగా ఆ నాళ్లలో  జయ విజయీభవ దిగ్విజయీభవ అనే కేకలు మిన్ను  ముట్టుకొని విజయ దశమి  అనే పేరును సార్ధకం చేస్తూ ఉండేవి .

అలాంటి పద్యాలలో ఒక ప్రసిద్ధమైన పద్యము

ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి

సెలవియ్యండి మాకు శీఘ్రముగా ను

పట్టు పచ్చడ మి చ్చి పది మాడలిచ్చి

  గట్టి శాలువలిచ్చి   కడియం బులిచ్చి

అయ్యవారికి చాలు ఐదు వరహాలు

 పిల్ల వాం డ్ర కు చాలు పప్పు బెల్లాలు

 కొబ్బరి కురిడీలు  కుండ బెల్లంబు

ఎంత గడుసుగా అడుగుతున్నారో చూడండి

పావలా బేడ అయితే పట్టేది లేదు

అర్ధ రూ కయి తెను అంటే ది లేదు

అచ్చ రూ కయితే ను పుచ్చుకుంటాము

1938 అక్టోబర్ ప్రజా మిత్రలో ఈ  కాలంలో దేశమంతా సింహాసనారూఢ  అయిన చండికా దేవి ఉత్సవాలు జరుగుతాయని రాశారు . ప్రాచీన కాలం నుండి ఈ విజయదశమి పండుగను జరుపుకుంటున్న ట్లు ఆధారాలు ఉన్నాయి ఈ సందర్భంలో విజయయాత్ర సన్నాహాలు మొదలు పెట్టేవారు అగ్ని పూజ ఆయుధ పూజలు ఇందులో ముఖ్యము  .

ఒకప్పుడు దేవాలయాలలో పెద్ద ప్రమిదలో దీపం వెలుగుతూ ఉండేది  .ప్రతి భక్తుడు తమ ఇంటి నుంచి తెచ్చిన నేతిని ఆ ప్రమిదలో వేసే వాడు . అలా ఈ తొమ్మిది రోజులు జ్యోతి అఖండంగా వెలుగుతూనే ఉండేది  .అక్కడి నుంచే అఖండ దీపం ఇళ్లల్లో ఆ తొమ్మిది రోజులు వెలిగించే సంప్రదాయం మొదలైందేమో  .

దసరా రోజు శమీ వృక్ష దర్శనం చేస్తారు  . ఈ వృక్ష పూజకు కారణం పాండవులు అజ్ఞాతవాస ప్రారంభంలో తమ  ఆయుధాల్ని దాచుకుని ఈనాడు వాటిని తిరిగి తిరిగి తీసుకోవడమే .

ధర్మశాస్త్రాల్లో రాజుల  గురించి చెప్పేటప్పుడు యాత్ర శబ్దం సర్వత్ర దేశాలపై వెడలే దండయాత్రకే  ఉపయోగించారు .బహుశా దీని ఆధారంగానే విజయదశమి నాడు సీమోల్లంఘనం అనే ఆ చారం వచ్చినట్లుంది .శ మీ పూజ తర్వాత ప్రతి గ్రామ ప్రజలు తమ గ్రామం పొలిమేర వరకు పోయి తిరిగి వచ్చే సంప్రదాయము ఒకప్పుడు పాటించేవారు  .

భారత పరమైన గాధకు అనుకూలంగా తరువాతి రాజులు ప్రతి సంవత్సరం శత్రువులపై జయాన్ని కోరి  ,పాడ్యమి  నుండి తొమ్మిది రోజులు దేవీ పూజలు చేసి పదవ దినం నాడు సిబ్బంది  ,గుర్రాలు ,ఏనుగులు ఆయుధాలతో ఊరేగింపు చేసి శమీ వృక్ష పూజను చేసేవారు .

మహారాష్ట్ర ప్రాంతాల్లో స్త్రీలు ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ వాయినాలు ఇచ్చుకుంటారు . వాయినా ల్లో ప్రధానంగా అరటిపండు ,కొబ్బరి  కాయలు  ,పువ్వులు  ,పటిక బెల్లం , చాదు  బొట్టు సీసాలు , కుంకుమ చేసుకోవడానికి చిన్న చిన్న భరిణలు , కొత్త రాగి డబ్బులు  ,అత్తరు , పన్నీరు అన్ని కానీ  ,కొన్ని కానీ చేర్చి ఇస్తారు  .

వారు  ఈ రోజును విద్యాభ్యా సా నికి  అనుకూలమైన దినంగా తలుస్తారు . కొందరు ధనికులు ఈ సందర్భంగా పిల్లలకు తలా ఒకపలక  , బలపం  ,సిరాబుడ్డి  ,కలం , కాపీ పుస్తకం ఇచ్చేవారట .

బెంగాల్ ప్రజలు దుర్గా పూజను ఘనంగా నిర్వహిస్తారు . వీరు 9 రోజులు తొమ్మిది రకాలుగా దేవిని పూజిస్తా .దుర్గను తమ ఇంటి ఆడపడుచు గా స్వర్గలోకాలు నుంచి తెచ్చుకున్నామని భావించే బెంగాలీలు నిమజ్జనం ద్వారా దేవిని  తిరిగి ఆమె పుట్టింటికి పంపుతారు .ఈ పూజా సమయాల్లో తమ వల్ల తప్పులు ఏమన్నా జరిగితే క్షమించమని  ,వచ్చే ఏడు తప్పక తిరిగే రమ్మని నదీ జలా ల్లో కలిపే ముందు ప్రార్థిస్తారు .

చతుర్వర్గ చింతామణి అనే  గ్రంధాన్ని అనుసరించి అశ్వయుజ దశమినాటి నక్షత్రోదయ సమయాన్ని విజయకాలంగా భావిస్తారు .  .అందువల్ల  విజయదశమి  .

ఒకప్పుడు ఆంధ్రుల శౌర్య ప్రతాపాలు ప్రతీకగా దసరా పండుగలు నిలిచాయి  .విజయనగర సామ్రాజ్యంలో ఈ పండుగ  ప్రత్యేక విలువలను సంతరించుకున్నది  .చిత్రకారుడు అబ్దుల్ రజాక్ రాతలు ఇం దుకు సాక్ష్యాలు  .ఈనాడు  హంపి శిథిలాలను చూస్తే మహర్నవమి దిబ్బ మనకు గత వైభవాన్ని గుర్తు  చేస్తుంది .ఈ నవరాత్రులలో విశాలమైన మైదానంలో ఏనుగులను అలంకరించి నిలిపేవారట  .9 అంతస్తుల మేడ మీద నవరత్నాలు పొదిగిన సింహాసనము మీద కూర్చుండి కృష్ణదేవరాయలు ఈ మైదానంలో ఆంధ్రుల సంస్కృతికి ప్రతిబింబాలయిన రక రకాల ఆటలు , పాటలు , గారడీ పోటీలు  ,వినోదాలు తిలకించే వాడట

ఈ తొమ్మిది అంతస్తుల మేడ రెండు అంతస్తులకు కూలిపోయి  ,రాళ్ల కుప్పల మధ్య తలెత్తుకొని ఈనాటికీ దర్శనమిస్తోంది . దీనినే ఈనాడు మహానవమి దిబ్బ అంటున్నారు

తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారికి  ,కంచికామాక్షి  అమ్మవారికి   ,కన్యాకుమారి లోను ఈ ఉత్సవములు ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుతారు . బొమ్మల కొలువులు కూడా పెడతారు  .

రాజస్థాన్లో రాజపుత్రులు తాము వివిధ రంగాలలో సాధించిన విజయాలను వెల్లడించు కొనడానికి ఈ దసరా ఉత్సవాలను ఒక వేదికగా ఉపయోగిస్తారు .దుర్గాదేవిని పూజిస్తారు

మైసూరు రాజులు దసరా ఉత్సవములు ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుతుంటారు  .భారతదేశంలో దసరా ఉత్సవాలు అనగానే మైసూరు మనకు జ్ఞప్తికి వస్తుంది . చా ముండేశ్వరి ఆలయంలో ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపబడతాయి .మైసూరు మహారాజా వారు తాను స్వయంగా గజారోహణ చేసి ఊరేగింపు నిర్వహించడం కనులపండువ .

పూర్వం క్షత్రియుల పండుగ అయినా నేడు హిందువులలో అన్ని వర్ణములవారు తమ తమ వృత్తులలో విజయం కలగాలని  ,తమకు అభిమాన మగు వస్తువులను పూజిస్తారు అని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల పండుగలు అనే గ్రంథంలో పేర్కొన్నారు  .

బెంగాల్లో విజయ శబ్దం శాంతికి పర్యాయపదం . బెంగాళీలు  దుర్మార్గంపై దేవుని విజయంగా దుర్గా పూజను జరుపుకుంటారు. విజయదశమి సందర్భంగా బెంగాలీలు తమ తమ పాత పగలును కక్షలను లను మరిచి ,అందరూ ఏకమై నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు . శత్రువులు  ,మిత్రులు పరస్పరం ఆలింగనం చేసుకుని తీపి తినిపించుకుంటారు .

ఋగ్వేదం దశమ మండలంలో దేవి ప్రస్తావన ఉంది  .ఇందులో దేవివా  గ్రూపి ణి  సరస్వతిగా వర్ణించబడింది  .ఆమెయే అగ్ని వర్ణి , మంజుల ,మాతంగ కన్య, శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాకాళి .

సామాన్య ప్రజానీకం ఆదిశక్తిని అనేక విధాలుగా ప్రస్తుతిస్తూ ఉంటారు  .అందులో ముఖ్యంగాఅందరూ చెప్పేది .

 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే

శరణ్యే త్రి యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

దసరా పండుగ హిందువుల దృష్టిలో ఒక అమూల్య ఆధ్యాత్మిక అనుభవం . మన సంస్కృతి సంప్రదాయాలకు అందమైన చిరునామా దసరా పండుగ .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఋషిక సికతా నివావరి

అస్త్రం …శస్త్రం… శాస్త్రం….