నీవులేక

నీవు ఎదురుగా ఉన్నపుడు

వచ్చేవి..

ఆలోచనలు

నీవు కనబడనపుడు

వచ్చేవి..

భావాలు

నీవు కనుమరుగైనపుడు

వచ్చేవి..

శోకాలు

ఆలోచనలు శోకాలయ్యే వరకు

సాగక..

భావ ప్రపంచంలో మురిసిపోతా..

నా కలల ప్రపంచంలో మైమరచిపోతా….

Written by Dr. Geetha Vani

డా.ఎం.గీతావాణి;ఎంఎ.తెలుగు;తెలుగుపండితశిక్షణ;ఎం.ఎ.సంస్కృతం;ఎం.ఎడ్;పిహెచ్.డి.తెలుగు.
తెలుగు వచన కవిత్వంపై ఉత్తమ పరిశోధన, ప్రాచీనఆధునిక సాహిత్యాల బోధనానుభవం, సాహిత్య విమర్శలో అభినివేశం కలిగిన డా.ఎం. గీతావాణి బోధనారంగంలో పదిహేను సంవత్సరాలఅనుభవంతో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం డైరెక్టర్, తెలుగుశాఖకు శాఖాధిపతి, అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో 30 కి పైగా పత్రసమర్పణలు చేసి పరిశోధనారంగంలో కొనసాగుతున్నారు. ప్రచురిత పుస్తకాలు 1. తెలుగువచన కవిత తెలంగాణ ప్రాంతీయ స్పృహ, 2. సునాద నినాదాలు, 3. సాహితీ సౌరభాలు, 4. నీవులేక (స్మృతికావ్యం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పద్మాభివందనము

కవనసుమాలు