కవనసుమాలు

ఊహలు జలపాతాలై మనసు కొలనులో జారీ సవ్వడి చేస్తున్నాయి….

అలల నాట్యం చేస్తూ భావాలు కవనరూపం దాల్చుతున్నాయి…
అక్షరాలు మదికి ఎదకి మధ్య తుషారహోరు పెడుతున్నాయి

ఆ హోరులో తరంగనాదాలు
హాయి గీతాలాలపిస్తూ…
విహంగనాట్యం చేస్తూనే ఉన్నాయి నేను కవిత్వమయ్యే వరకు…

అప్పుడు పుట్టుకొచ్చాయి మధురమైన కవనసుమాలు
భావపరిమళాలను తమ మేనుకద్దుకొని నీహృదిలో సుగంధాలు నింపి…

కవనలోకంలో నిను పయనింపజేసి నీమోముపై నవ్వులవిరులు పూయిస్తూ…
అభినందన పుప్పొడిని నాపై జల్లేలా చేసి నాలో నాకు కొత్తశక్తిని నింపి…

అంతులేని సాహితీవనంలో వాడని కుసుమంగా
వకుళసుమాలను పూయిస్తూనే ఉంటాయి
నా ఆయువు వాయువులో కలిసేవరకు…

Written by vakula vasu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీవులేక

 నీల లోహితం