నీల లోహితం

మనుషుల మధ్య తెలుపు నలుపు రంగుల భేదాలు ఎప్పటినుంచో విశ్వమంతా రాజ్యమేలుతున్నాయి . కానీ ఓ రంగు మాత్రం పూర్తిగా రాచరికపు చిహ్నంగా , రాజధర్పానికి ప్రతీకగా గౌరవాన్ని పొందింది . ఈ రంగు రోమన్ సామ్రాజ్యపు  హంగు  .                                                         అదేంటంటే ఊదా లేదా వైలెట్  .

వంగ మొక్కల పూలు వైలెట్ రంగులో ఉంటాయి  .అందుకని వంగ పువ్వు రంగు అని కూడా అంటారు. నీలం ప్లస్ ఎరుపుల మిశ్రమం ఈ రంగు . ఈ  రంగును గూర్చి మనసులో తలవగానే గుర్తొచ్చేభావాలు  లగ్జరీ అండ్ మిస్టరీ  .మరికొందరికి బోల్డ్ అండ్ కామ్ల  అత్యుత్తమ కలయిక  .

బైబిల్ కూడా ఉదా రంగు సంపద  ,శ్రేయస్సు మరియు విలాసానికి ప్రతీక అని చెప్తుంది  .ఈ రంగు విశ్వాసాన్ని విధేయతను సూచిస్తుంది . యేసు తాను సిలువ వేయడానికి ముందు ఊదా రంగు వస్త్రాన్ని ధరించాడు .

ఈ రంగుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అర్థాలు ఉన్నాయి  .అంతరార్ధాలు ఉన్నాయి  . సంపద , దుబారా  ,సృజనాత్మకత జ్ఞానం , గౌరవం , గొప్పదనం  ,భక్తి  ,శాంతి  ,గర్వం ,రహస్యం అందులో కొన్ని .

ఫర్నిచర్లతయారీలో  అరుదుగా ఉపయోగించే రంగు ఇది . నీలం యొక్క ప్రశాంతతను  ,ఎ రుపు యొక్క శక్తిని ,ఉత్తేజాన్ని మిళితం చేస్తుంది. ఈ రంగును ఇష్టపడని వారు ఉండరు  .ఎంతటి మొండి హృదయానికైనా ఈ రంగు నచ్చుతుంది  .మనసు సేద తీరిన అనుభూతిని ఇస్తుందిఈ  వర్ణమ్ . డ్రాయింగ్రూమ్ కు  కు వేస్తే  ,అలంకరణ అదిరిపోతుంది  .

అనాదిగా అధికారానికి ఐశ్వర్యానికి చిహ్నం  .తరతరాలుగా  రాచరికం ఆధ్యాత్మికతలను  సృజనాత్మకతతో జోడించి  , సంస్కృతిని ప్రభావితం చేసింది  .రాజులూ రాణు లు ఇష్టపడే రంగు  .

ఒకప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం హోదాకు చిహ్నం  .ప్రాచ్య  దేశాలలో  ఈ రంగును కరెన్సీ నోట్లకు వాడేవారు . ఈ రంగుని ఇష్టపడేవారు ధనాపేక్షపరులని అంటారు  .ఫ్లోరిడాలోని జైలు గోడలకు ఈ రంగును వేసి  ,ఖైదీల స్వభావంలో మార్పులపై పరి శోధనలు చేశారు     .అందులో క్రూరుడు కూడా శాంతమూర్తిగా ప్రవర్తించినట్లు ,తాను చేసిన నేరాలను తలుచుకుని బోరున ఏడ్చినట్లు తేలింది .

కంటికి నదురు గా కనిపించే రంగు మాత్రమే కాదు  ,మనసు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది  .దీని లేత రంగై న లావెండర్ మనసును శాంత పరుస్తుంది .రోజువారి ఒత్తిడి నుంచి శాంతినిస్తుంది .    పనిచేసే దగ్గర ఏదో ఒక మూల ఊదా రంగు  వ స్తువు ఉం డేలా చూసుకోండి  .దాంతో హఠాత్తుగా మైండ్ బ్లాంక్ అయ్యే సందర్భాలు తగ్గుతాయి  .

ఈ రంగుకి ఒక్కో సంస్కృతిలో ఒక్కొక్క అర్థం ఉంది  .పాశ్చాత్య దేశాల్లో సంపదకు , రహస్యాలకు  ,సృజనాత్మకతకు చిహ్నం . జపాన్లో బలానికి  ,కులీ నత్వానికి చిహ్నం . థాయిలాండ్లో విషాదానికి గుర్తు  .

మనదేశంలో ఆధ్యాత్మికతకు శాంతికి మరోపేరు  .వాస్తు శాస్త్రం ప్రకారం శాంతి  ,మానసిక స్పష్టత  ,అభివృద్ధికి చిహ్నం ఈ  రంగు .సాధారణంగా దీని లేతవర్ణమును పర్పుల్  కు  ఉదాహరణంగా వ్యవహరిస్తారు  .పర్పుల్ అనగానే గుర్తొచ్చే పదం టైరియన్ పర్పుల్

దీని గురించి మనం తప్పక తెలుసుకోవాలి ఈ సందర్భంలో  .దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది .

పర్పుల్ ఆనాటి రోమన్ సామ్రాజ్యపు రంగు  .నాడు ఇది సమాజంలో బలానికి ,సార్వభౌమత్వానికి ,ధనానికి  చి హ్నం సమాజంలో ఉన్నత వర్గాలు మాత్రమే వినియోగించాలనిఅప్రకటిత నిబంధన ఉండేది.

ఇది ముఖ్యంగా దక్షిణ యూరప్  , ఆ ఫ్రికా  ,పశ్చిమసియాలలో బాగా ఇష్టపడేవారు  .ఉతికినా వెలసిపోని దీని గుణం అందరికీ నచ్చేది  . క్లియోపాత్రకు  ఈ రంగంటే తగని మక్కువ  .ఆమె తన పడవ తెరచాపలకు ఈ రంగును వాడేవారు .

చివరికి సమాధులపై కూడా ఈ రంగును వాడేవారు  .ఒకప్పుడు నత్తగుల్ల  ల పెంకు  నుంచి పర్పుల్ రంగు ను  తయారు చేసేవారు  . చా లా ఖరీదు  .ఒక గ్రాము టైరియన్పర్పుల్ రంగు తయారు చేయాలంటే దాదాపు పదివేల నతగుల్లలు అవసరమయ్యేవి అది కారణం  . ఈ  రంగు తయారీని మొదటి రసాయన పరిశ్రమగా వర్ణిస్తారు  .

ఈ రంగులో లావెండర్ రంగు వస్త్రాలను  తయారు చేయడం ఖర్చు , శ్రమతో కూడిన పని  .అందువల్ల రాజ కుటుంబీకులు , ధనవంతులు మాత్రమే వాడేవారు  .మధ్యయుగాల్లో మత గురువులు ఈ రంగు వస్త్రాలను ధరించేవారు . క్రమంగా ఈ రంగు పూర్తిగా రా జరీకపు చిహ్నంగా  ,రాజహోదాకు  ప్రతీకగా మారింది  .తమకంటే తక్కువ స్థాయి వారు ధరించిన భ రించలేనంత అసూయ నాటి రోమన్ రాజులకు కలిగిందంటే ఊహించండి  .కొందరు రోమన్ సామ్రాట్లు తాము తప్ప ఇతరులు ఎవరైనా ఈ రంగు దుస్తులను ధరిస్తే మరణశిక్ష విధించేవారు

40 b.cలో రోమన్ చక్రవర్తి మౌరిటానియా రాజును చంపమని ఆదేశించాడు  .ఈయన రోమన్లకు స్నేహితుడు  . ఓ గ్లాడియేటర్కార్యక్రమానికి ప ర్పుల్ రంగులో దుస్తులు ధరించి వెళ్ళాడు  .దీన్ని సహించలేని రోమన్ చక్రవర్తిఅలా  ఆదేశం ఇచ్చాడు  .

కేథలిక్ పూజారులు ఈ రంగుతో చేసిన దుస్తులను ధరించేవారు  .తమ మత గ్రంథాలను ఈ  రంగు వస్త్రాలలో భద్రపరిచేవారు  .             దక్షిణ కొరియాలోని ఐలాండ్ అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి  .ఇక్కడ విస్తారంగా లావెండర్ తోటలు ఉన్నాయి  .రోడ్లు కూడా ఉదారంగు లోనే ఉంటాయి. ఈ ఊళ్ళోకి అడుగుపెడితే పర్పల్ ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది  .

మధ్యయుగాల్లో మత గురువులు ఈ రంగు వస్త్రాలను ధరించేవారు  .అప్పట్లో దీన్ని  బంగారం కంటే మూడు రెట్లు విలువైనదిగా భావించే వారని క్రీస్తు శకం 31 నాటి శాసనం చెప్తుంది  .

15వ శతాబ్దం నాటి దీని తయారు నాటికి తయారీ విధానం పూర్తిగా కనుమరుగైంది ఆ విధానంకాలగర్భం లో  కలిసిపోయింది . ఈ రంగుని ఇష్టపడేవారు  , ఆలోచనాత్మక ధోరణిని కలిగి ఉంటారు  .అంతర్ముకులు . తెలివైన వారు  .

ఈ రంగు మనసుకు నరాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది  .ప్రశాంతమైన రంగుగా పరిగణించబడుతుంది  .ఇది కేవలం ఒక రంగు మాత్రమే కాదు ,ఇది చరిత్ర , భావోద్వేగాలు కలిసి ప్రశాంత స్థితికి మనిషిని తీసుకువెళ్లే అపురూప దృశ్య కావ్యం .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కవనసుమాలు