అనూహ్య

(కోడలమ్మకథలు)

అది ఒక త్రీ స్టార్ హోటల్.రిసేప్క్షన్ లో పనిచేస్తూ బిజీగా వున్నారు అనూహ్యా,సుమలత.వూళ్ళో ఏవో రాజకీయ సభలు జరుగుతున్నాయి,అందుకు రూమ్ కావాలని ఫోన్ లు చేసేవాళ్ళు,స్వయంగా వచ్చి వాళ్ళు ……..దాదాపు వున్న రూమ్ లు అన్నీ బుక్ అయిపోయాయి.ఉదయంపదకొండుగంటలకు ఇద్దరికి కాస్త తీరిక దొరికిందికంప్యూటర్ నుoడి కాస్త పక్క కు తలతిప్పేసరికిఎంట్రెన్స్దగ్గరఎవరోతననేచూస్తున్నట్టుఅనిపిoచిoది,అనూహ్యకు.ఆమె తనను చూడగానే ఆ వ్యక్తిపక్కకుతప్పుకున్నాడు.ఆమెకు అప్పుడు గుర్తుకు వచ్చింది.వాడెవరో నాలుగు రోజులక్రితం కూడా ఇలా తనని చూసినట్టు.ఆమెకు కాస్త చికాకు అనిపించిది.’’ఓ అనూహ్య దేవి ఏ ఊహాలోకాల్లో వున్నావ్ కాఫీ తాగుదామని రెండుసార్లు అడిగాను.’’అంది సుమలత.

‘’దానికేముందితాగుదాం పద,’’

‘’ఇద్దరూ హోటల్ రెస్టారెంట్ లో కూర్చున్నారు.సుమలత  హోటల్  సంగతులు చెబుతూనే వుoది.కానీ అనూహ్య మనసు తనను దొంగతనoగా చూసేవాడి మీదేవుంది.వాడు రెస్టారెంట్ కు కూడా వచ్చి కాఫీ తాగుతున్నాడు.స్నేహితులిద్దరూమళ్ళీరిసెప్క్షన్ కు వెళ్లేసరికికనిపిoచలేదు.కానీ అనూహ్య మనసు లో నుoడి వాడి ఆలోచన పోవడం లేదు,వాడిని తను ఎక్కడో చూసింది,ఎక్కడా………ఊహు గుర్తు రావడంలేదు.

******************************

స్కూటీ పార్కు చేసి  అనూహ్య హెల్మెట్ తీసింది.అప్పుడే లిఫ్ట్ లో నుoడి దిగి  వాడు బయటికి వెళ్లిపోయాడు.వాడు ఆమెను చూడలేదు.ఆమె అలాగే నిలబడి పోయింది.వాడు తన ఇంటి లిఫ్ట్ లో నుoడి రావడం ఏమిటి………ఆమె వాచ్ మేన్ పిలిచి.’’ఎప్పుడు వెళ్ళాడే ఆ అబ్బాయి ఎన్నో ఫ్లౌర్ లో ఉంటున్నాడు ‘’అని అడిగింది.

‘’ఆయన మన ఫ్లాట్లో లేడు మేడం మీ ఇంటికే వచ్చాడు.ఒక అరగంట ముందే వచ్చాడు.’’

‘’అలాగా’’ఆమెలిఫ్ట్ లో ఆరో అంతస్తుకి బయలుదేరింది.ఎవడు వాడు తనను ఎందుకు ఫాలోఅవుతున్నాడు.అ…గుర్తుకు వచ్చింది,వీడు అత్తగారికి మేనల్లుడో,చెల్లెలి కొడుకో అవుతాడు.ఆ మధ్య ఏదో పెళ్ళిలో కలిసిన గుర్తు.అయితే అత్తగారిని కలవాలoటే ఇంటికి రావాలి గానీ హోటల్ కు ఎందుకు.అయినా తనకు సమస్యలు తక్కువనా వీడి గురించి కూడా అలోచించి బుర్ర పాడుచేసుకోవడం.ఆమె తన ఫ్లాట్ దగ్గర కు వెళ్లేసరికి తలుపు తెరిచే వుంది. ఆమె పిల్లలు సోఫాల్లో కూర్చున్నారు.కొడుకు అనిరుద్ నాయనమ్మ మీద అరుస్తున్నాడు,’’రోజూ ఉప్మా యేనా నీకు ఇంకచెయ్యడానికిటిఫిన్లు ఏమీ రావా.’

‘’ఏమిటిరాఆమాటలు,చిన్నoతరం,పెద్దంతరం లేకుoడా.మీ అమ్మ హోటల్ కు పోయి కూర్చుంటుoది.పాపం పిల్లలు స్కూల్ నుoడి ఆకలితో వస్తారు కదా అనిఏదోచేసి పెడితే ఇలాగేనా మాట్లాడేది.’’అత్తగారు,పిల్లలు ఆమె వచ్చిన సంగతి గమనిoచలేదు.

‘’మా అమ్మ హోటల్ కు పోతూoదoటే వుద్యోగంచేయడానికి.వూరికేకాదు.’’తనకొచ్చిన భాషలో తల్లిని సపోర్ట్ చేసింది కూతురుఅనీల.అప్పుడు ఇంట్లో అడుగు పెట్టింది.అనూహ్య.

‘’ఏమిటిరా ఆ కేకలు నీ మాటలు లిఫ్ట్ దాకా వినిపిస్తున్నాయి.’’అందిఅనూహ్య.కోడలు రావడం అప్పుడు గమనిoచింది.అత్తగారుజయమ్మగారు.

‘’చూడమ్మా వారానికి మూడుసార్లు ఉప్మా చేస్తే ఎలా తినాలి.’’

‘’పోనీలేఈ రోజుకి తినేయ్యండి.ఆహారాన్ని వేస్ట్ చేయకుండా.రేపటినుoడి ఏదో ఏర్పాటు చేస్తాను.’’పిల్లలుమాట్లాడలేదు.ఉప్మా తిన్నారు అనూహ్య ఫ్రెష్ అయ్యికాఫీ కలుపుకుంది.

‘’నేను కలిపిఇచ్చేదాన్నికదమ్మా,’’

‘’పర్వాలేదండి.అవునూ మీరు మామగారు పిల్లలు ఇద్దరుటిఫిన్తిన్నవి నాలుగు ప్లేట్స్ వుండాలి అయిదు ఉన్నాయేమిటి సింక్ లో…. బంధువులు ఎవరైనా వచ్చారా.’’

అత్తగారికి కాస్సేపుఏమిచెప్పలేదు.’’ఆ ..అదే మా పెదమామగారి మనుమడు వచ్చాడు.

ఈ వూళ్ళోఏదో పని వుందని వచ్చాడుట .ఇక్కడే వున్నాముఅని మనల్ని చూసిపోదామని వచ్చాడు.’’

‘’అలాగా.మరి ఉoడమనలేకపోయారా’’అత్తగారి మొహాల్లో భావాలు చూస్తూ అంది అనూహ్య.

‘’ఆ వాడెక్కడఉంటాడు.వెళ్ళిపోయాడు.’’అనూహ్య కి చెప్పలేని కోపంగా వుంది.కానీ తను ఏమైనా మాట్లాడితేపిల్లలు విoటారు.అందుకే ఆమె చాలాసార్లు తన కోపాన్ని అణుచుకున్నట్టు ఇప్పుడుకూడాఅణుచుకుంది,అందుకు పని అనే ఆయుధాన్ని తీసుకుంది చేతిలోకి.పిల్లలకి ఇష్టమైన బెండకాయ వేపుడు చేసి చారు పెట్టింది.పిల్లలుఇష్టoగా తిన్నారు,తనకిమామగారికి,అత్తగారికి కూడా భోజనం పెట్టింది,అనూహ్య భర్త ఎప్పుడు ఇంటికివస్తాడో,ఎలావస్తాడో ఎవరికీ తెలియదు.అతనువచ్చాకా అన్నo తినడం అంటే తేది మారిపోతుంది,కొన్నాళ్ళుఎదురుచూసేది. భోజనం చేయకుండా.అతను తాగి వచ్చిన వాలకం చూసాకా అసలు జీవితం మీదే విరక్తి పుట్టేది.అత్తగారు కూడా భర్త రాకుండా తను అన్నం తిoటున్నాననిసాధిoచేది.అనూహ్య వినకపోవడoతో చెప్పడం మానేసింది.

‘’వాడికి మీ హోటల్లో ఏదైనావుద్యోగంచూడకూడదు.?’’అడిగారు మామగారు

‘’అతనేం చదివాడు,’’తెలియనట్టు అడిగింది.

‘’ఇంటర్మీడియెట్ పాస్ అయ్యాడు.’’

‘’పెద్దచదువులుచదివినవాళ్ళకేఉద్యోగాలురావడంలేదు.ఇతడికెలా వస్తుంది.’’

‘’అలా అంటే ఎలా,,,మీ హోటల్లో ఏదో ఒక జాబ్ చూడు.’’

‘’ఓహో అందుకేనా అతను మా హోటల్ చుట్టూ తిరుగుతున్నాడు,’’అత్తగారు ఖoగారు పడింది.’’అబ్బే అదికాదు… ‘’

‘’మరి నా మీద సి.ఐ.డి గా చేయడానికా.’’

‘’అదేమిటమ్మా అలా అంటావు,వాడు అలాంటివాడు కాదు,’’

‘’వుద్యోగం అడిగే పధ్ధతిఅదికాదండీ.నేను తెలిస్తే అక్కడికి వచ్చి నన్ను అడగాలి లేదు మా హోటల్ మేనేజర్ లాటి పెద్దవాళ్లను కలవాలి.అదేమీ లేకుండా చాటుగా నన్ను చూస్తుంటే ఏమనుకోవాలి.’’

‘’అందుకని వాడిని నీ మీద నిఘా పెట్టామని నీ అనుమానం.’’కోపంగాఅన్నాడు మామగారు’

‘’అనుమానం కాదు,నిజం.అతనువుద్యోగం చేసే వాడైతేఇలాటి వేషాలు వేయడు. దాదాపు నెలరోజులుగా అప్పుడప్పుడు వచ్చి నన్నుఅనుమానOగా చూస్తుOటే ఏమనుకోవాలి.నిజంగాజాబ్కావలసినవాడు ఇలా టైం వేస్ట్ చేసుకోడు,’’

‘’ఏమోలే ,నీలాటి తెలివితేటలు మా వాళ్లకి లేవు,’’

‘’అతడి అసమర్థతను కూడా సమర్దిస్తారెందుకు.పోనీ హోటల్ లో మాట్లాడలేదు,మరి నేను వచ్చే టైం కేనా మన ఇంట్లో ఉOడాలిగా.’’

‘’ఇంతకీ ఏమంటావ్ వాడికి వుద్యోగం చూడను అంటావు ,’’భోజనం ముగించి లేచింది అత్తగారు.

‘’చూడను ,అనవసరమైన సి.ఐ.డి.,పనిచేసేవాళ్ళను ఇతరుల పనుల్లో తల పెట్టేవాళ్ళను నేనే కాదు ఎవరూ పనిఇవ్వరు.’’

‘’అబ్బో అన్ని ఉద్యోగాలు నీ చేతిలో ఉన్నట్టే మాట్లాడుతున్నావే.’’వెటకారంగాఅన్నాడు మామగారు

‘’లేవు,వుంటే నేనూ పెద్ద ఉద్యోగమే చేసేదాన్ని.’’

‘’ఈ చిన్న ఉద్యోగానికే నీకు ఎంతో అహంకారం,పెద్దవుద్యోగం చేస్తే చెప్పక్కరలేదు నిన్ను పట్టలేకపోయేవాళ్ళం.’’

‘’అందుకే రేపటినుOడి నేను జాబ్ కు వెళ్ళను,మీ అబ్బాయిని చెయ్యమనండి,ఆ…వీలైతే మామగారిని కూడా.’’

‘’ఈవయసులో ఆయన్ని వుద్యోగంచేయమంటావా.’’

‘’తప్పేముంది.ఖాళీగాకూర్చుంటేలేనిపోనిఆలోచనలు,అదేతగినత పని వుంటేఎవరిమీదా నిఘా పెట్టనవసరం లేదు.’’

‘’ఏమిటమ్మాయ్ఇందాకటినుoడి చూస్తున్నాను,నిఘాఅంటూ మొదలుపెట్టావు.’’

‘’అవును ఆ కుర్రాడికి పని పాటు లేదు,మా హోటలు చుట్టూ తిరుగుతున్నాడు.నాకు తొందరగా అనుమానం రాదు.వస్తే అది నిజం కాకుండా పోదు.’’

మామగారు అక్కడినుంచి చల్లగా జారుకున్నాడు.అనూహ్య భర్త బయట తాగివస్తేమామగారు ఇంట్లోనే తాగుతాడు.

‘’అవును నువ్వు మహా సత్యహరిశ్చoద్రుడిచెల్లెలివి మరి.’’

‘’చెల్లెలిని కాదు.సత్యహరిశ్చంద్ర నే నేను,’’

‘’అయితే ఏమంటావ్,’’

‘’నా మీద ఇకమీదట సి.ఐ.డి. లను పెట్టవద్దు అంటాను.’’

‘’ఏం పదిమంది మగవాళ్ల మధ్య పని చేస్తున్న నీవు ఎలాఉన్నావో తెలుసుకోవడం లో తప్పేముంది.’’

‘’అది మాటంటే….ఇప్పుడుబయటపడ్డారు.’’

‘’అవును నీమీదనిఘాపెట్టాము,ఏం చేస్తావు……….భర్త అంటే భయం లేదు…….వాడు అంటే ప్రేమ లేదు.అలాoటప్పుడు నిన్ను అనుమానిస్తే తప్పేమిటి..’’

‘’మరి ఇవే ప్రశ్నలు మీ అబ్బాయిని అడగగలరా.’’

‘’ఏం వాడేం తప్పు చేసాడు,’’

‘’అంటే తాగి తందానాలుఆడటం మీ అబ్బాయి తప్పు కాదన్నమాట.’’

వాడు మగవాడు.’’అనూహ్య కోపం తారాస్థాయికి చేరింది.’’

‘’వెరీగుడ్.మీరు ఆడది అయివుండి మగవాడిని అదీ తాగి బాధ్యత లేకుoడా తిరిగే మనిషిని

సపోర్టు చేస్తున్నారు.నా పెళ్ళి టైం లో మీరు ఏం చెప్పారు.మాకు బాగా ఆస్తి వుంది,ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి వారి బాధ్యత లేదని చెప్పారు.

కుటుంబం మంచిదని మావాళ్లు నన్ను ఇచ్చి పెళ్ళి చేసారు.మామగారు,మీ అబ్బాయి చేసే వ్యాపారం సరిగా చేయక నష్టాలు వస్తే అవి ఎందుకు వచ్చాయో గమనిoచక వ్యాపారం కోసం అంటూ మరిన్ని అప్పులు చేసి ఇదిగో నన్నుఇలా హోటల్లో ఉద్యోగస్తురాలిని చేసారు.

పోయింది పోగా మిగిలిన డబ్బు తో ఈ ఫ్లాట్ కొన్నాము.పోనీఇంతజరిగాకైనా మీ ముగ్గురికి బుద్ధి రావడంలేదు.’’

‘’అనూహ్య ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావోతెలుస్తుందా.అసలు మీవాళ్ళనుఅనాలి,ఇలా నిన్ను పెంచినoదుకు.నా ఆడపిల్లలు  అత్తవారిoటిలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు.’’

‘’వాళ్ళ భర్తలను కూడా తాగి అప్పులు చేసి ఆస్తిని పోగొట్టమనoడి ,వాళ్ళు ఇలా నాకు లాగ మాట్లాడకపోతే అడగండి.మీపెద్దల్లుడుబాగా చదువుకుని మంచి జాబ్ లో వున్నారు.రెండిళ్ళుకొన్నారు.ఇంక మీ చిన్నల్లుడు కూడా అంతే ఆమధ్యకుటుoబ సమేతంఅమెరికా వెళ్లి వచ్చారు,గతపదేళ్లుగా మీ అబ్బాయి నేను ఒక సినిమాకైనావెళ్ళామా,ఆయన తాగకుండా రాత్రి పదిగంటల లోపు ఎప్పుడైనాఇంటికివచ్చాడా,సరే ఆయనకు బుద్ధి లేదు మీరు కానీ మామగారు కానీ ఒక్కసారి ఆయనను నిలదీసి అడిగారా.’’

‘’నలభైఏళ్ళు దాటినవాడిని ఇద్దరు పిల్లల తండ్రిని ఏం అడుగుతాo.’’

‘’మరి ముప్పైఏళ్ళుదాటినదానిని,ఇద్దరు పిల్లల తల్లిని నామీద అనుమానం పడతారా.

‘నేను ఖచ్చితoగా అడిగే ఏ ప్రశ్నకు మీదగ్గర జవాబు లేదు.ఎందుకంటేమీదగ్గర నిజాయితీ లేదు కాబట్టి.మరోసారిచెబుతున్నాఆడవారిని ఏ మాట  అన్నా మర్చిపోతారు. కానీ వాళ్ళ కేరక్టర్ ను అంటే మాత్రo ఆ మాట ఎవరన్నా వాళ్ళని మర్చిపోరు.’’

ఇంతలో తలుపు తట్టిన చప్పుడు.’అదిగో వచ్చాడు మీ సుపుత్రుడు.’’వెళ్లి తలుపు తీసింది అనూహ్య.

‘’హలో గుడ్ మార్నిoగ్’’ అన్నాడు.

అనూహ్య అత్తగారివైపు ఒకసారి చూసి,’’ఇంకా ఆ మాట చెప్పడానికి అయిదుగంటలు టైం వుంది లెండి,’’అంది.

‘’భోజనం చెయ్యరా,’’అంది జయమ్మగారు.

‘’వద్దు,అన్నీ తిని వచ్చాను,అతను గదిలోకి వెళ్లి మంచం మీద బోర్లా పడి నిద్ర పోయాడు.

అనూహ్య కంటివెంట నీళ్ళు వచ్చాయి,ఆమె గదిలోకి వెళ్లి ఒక దుప్పటి,దిండుతెచ్చుకుంది.సోఫాలో పడుకుంది.’’అదేమిటమ్మాయ్ ఇక్కడ పడుకుoటావ్ లోపలి వెళ్ళు,’’

మీరు గమనిoచడంలేదండి.రోజు ఇక్కడే నానిద్ర.’’

ఆమె గొంతులో దుఃఖాన్ని అప్పుడు గమనిoచిoది ఆవిడ.’’ఏడుస్తున్నావాఇప్పుడేoజరిగిందని.’’అనూహ్య లేచి కూర్చుoది,ఏడవక పోతే ఏoచెయ్యమన్నారు.ఆడపిల్లని ఏ కష్టం లేకుండా చూసుకోమని పెళ్ళిలో వరుడుకీఅప్పచెబుతారు.నాకష్టం,సుఖం ఆయన ఎలాగా చూడడు.కనీసంవున్నవా లేదా అనైనా అడగడు.నా పిల్లలు లేకపోతే నేనెప్పుడో విడాకులు తీసుకునేదాన్ని.’’

‘’ఆ ఏం మాటలవి.మా ఇంటా వంటా లేవు,’’

‘’అన్నీ మన ఇంట్లో తరతరాలుగా జరగాలానేoలేదు.కొత్తగా మనం కొన్ని చేయవచ్చు.’’

‘’ఏ దెయ్యం పట్టిందే నీకు ఈవేళ ఇలా  మాట్లాడుతున్నావ్.’’

‘’మీకులాగే నాకు అనుమాన పిశాచం పట్టింది.’’అనూహ్య  ను చూస్తే అత్తగారికి భయం వేస్తోంది ఎప్పుడూ నెమ్మదిగా తన పనేమిటోతనేమోఅన్నట్టువుండే పిల్ల ఇలా అరవడం.ఆ మెనూ అనుమానించి తను తప్పుచేసిందా.ఆమెవుద్యోగంమానేసినా,పిల్లలనుతీసుకు  దూరంగా వెళ్ళిపోయినా ఈ ఇల్లు తప్ప ఏమీ లేని తాము ఎలా బతుకుతారు.’’అనూహ్య నేను చెప్పేది విను, నీ భర్తను నువ్వు దారిలో పెట్టుకో.

వాడికి నీకు మధ్య దూరం పెరగడం తో ఏదో నీ గురించి అలా అనుకున్నామే కానీ నీమీద అనుమానం లేదు,’’

‘’తల్లితండ్రులుమీరు దారిలో పెట్టలేరు గానీ నన్ను ఆయనను దారిలో పెట్టమంటారా.ఆమనిషి,ఆ వాలకం చూసారుగా మా మా మధ్య సన్నిహితo ఎలా పెరుగుతుంది.నేను నిద్ర పోయాకఆయనఇంటికివస్తాడు.నేను హోటల్ కి వెళ్ళాక నిద్ర లేస్తాడు.అంతదాకా ఎందుకు ఆయనను రేపునేను హోటల్ కి పిల్లలు స్కూల్ కి వెళ్ళాకా ఆయనకు ఎందరుపిల్లలు,ఏంచదువుతున్నారు అనిఅడగండి,సరిగా జవాబు చెబుతే నా తప్పే ,చెప్పలేకపోతే మీ తప్పు.ఇంకనన్ను అనుమానిoచడంఅంటారా.ఒక మాట అడుగుతాను చెప్పండి.

‘’మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏది……..ఆ…..రసమలై కదూ అది కొద్దిగా చాలా కొద్దిగా మీకు పెట్టారనుకొoడి,ఏమనిపిస్తుంది.’’

‘ఇంకా కొంచెం  పెడితే బాగుండునుఅనిపిస్తుoది.’’

‘’అదే చేదు కాకరకాయ ముక్క.కొంచెం పెడితే.’’

‘’ఆ కాస్తా కూడా తినకుoడా పారేద్దామనిపిస్తుంది.’’

‘’కదా….మీ అబ్బాయితో నా జీవితం కూడాచేదు కాకరకాయ తిన్నట్టే వుంటుంది.ఒక్క మగాడే ఇలా ప్రాణం విసిగిస్తుంటే మరో మగాడిని చూస్తేనేఅసహ్యంవేస్తుంది.అదే భర్త  మంచి వాడైతే పరాయి మగాడు  మీరాబాయి చెప్పినట్టు అతడు ప్రకృతిలో ఒక భాగం అనిపిస్తాడు.తప్ప మగాడిలాగానే కనిపించడు. అసలు ఆలోచనే వేరే దారితొక్కదు.’’అనూహ్య కాసిని మంచి నీళ్ళు తాగి నిద్ర పోవడానికి ప్రయత్నం చేసింది.ఆమెకుమనసెందుకోప్రశాoతoగా అనిపించింది.అవునుపెద్దవానపడ్డాకామురికి,చెత్తకొట్టుకుపోయిదారి బాగా కనపడ్డట్టు గా వుంది.

ఇంతలో ఏదో చప్పుడు.ఆమె చప్పున బెడ్ రూమ్ లోకి వెళ్ళి చూసింది,అత్తగారుభర్తను నిద్ర లేపి చెంప  చెళ్ళుమనిపి0చిoది.’’ఏమిటమ్మా ఎందుకు కొడుతున్నావ్.’’

‘’నిన్ను బాగుచేయడానికి………………

(అయిపోయింది)

Written by Eeranki Prameela

వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని. లబ్ధ ప్రతి ష్ఠు లైన రచయిత లాగా కొ౦త రాసినా ధన్యత పొందినట్టు గా భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలంగాణ పలుకు బడులు అందరికీ తెలియాలి -ముదిగంటి సుజాతా రెడ్డి

ఋషిక శశ్వతి ఆంగిరసీ