సుస్వర విరించి

గానంతో
శ్రోతల తలల్ని
సర్పాలను చేసి ఆడించే
విద్వన్మణి !

గొంతులో
కోకిలమ్మను ఇముడ్చుకున్న
వశీకరణ వేత్త !

స్వరపేటికను
సరాగాలతో మెలికలు త్రిప్పే
గాంధర్వ సాధ్వి !

అణువణువునా
వేణు నాదం పలికించే
మధుర గాయని !

ఆబాల గోపాలాన్ని
అమృత గానంతో
‌ఓలలాడించే
మహతీ నాదం !

గళంతో
పరకాయ ప్రవేశం చేసి
పసిపాప కేరింతలా
అలరించే
మంత్ర స్వరూపిణి

గాయని జానకి
గాన సామ్రాజ్యంలో
మహా రాజ్ఞి !
సుస్వర విన్యాసంలో
సింహాసనేశ్వరి!

ఎస్.జానకీ అమర్ రహే
ఉత్తమ నేపథ్య గాయనీ
అమర్ రహే !

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఋషిక శశ్వతి ఆంగిరసీ

వేట నా ఆట కాదు