మన మహిళామణులు – డా . కొఠారి వాణీ చలపతి రావు

నా పేరు రచయిత్రిగా …. డా . శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు
అధికార నామం .. డా . శివరాజు వాణీ కుమారి
పుట్టినతేది ..22 .10 .1951
Qualification… MA, MPhil, phD
మెకంజీ కైఫీయతులు పరిశోధనాంశం ( published )
రాతిరథాలు . రెక్కలగుర్రాలు ( నవల )
గుండెగుండెకో కథ ( కథల సంపుటి )
కథా వాణి ( కథల సంపుటి )
దాదాపు 1000 కి పైగా కథలు రాసాను .. ఇంకా రాస్తున్నాను .
ముంతాజ్ డిగ్రీ కాలేజీ లో 25 ఇయర్స్ పని చేసి రిటైర్ అయ్యాను
నా యూట్యూబ్ ఛానల్ పేరు .. కథా వాణి ..
నేను రాసిన కథలు నా స్వరంతో నే వినిపిస్తున్నాను
ఇది క్లుప్తంగా నా పరిచయం
ఇంకా మూడు నవలలు రాసాను కానీ పబ్లిష్ కాలేదు
కొన్ని వందల వ్యాసాలు పబ్లిష్ అయ్యాయి
ఫోన్ నెంబర్9849212448
మా నాన్నగారు శివరాజు నరసింహా రావు గారు .. అమ్మ శ్యామలమ్మ .
మాది ఖమ్మం జిల్లాలోని మడుపల్లి గ్రామం .. నా బాల్యం ప్రేమరీ స్కూలింగ్ అక్కడే .. మాది ప్రకృతి అందాలతో విలసిల్లే అందమైన వూరు కాకపోయినా మా ఊరంటే నాకు ఇష్టం . మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఖమ్మం town లో చిన్నక్వార్టర్స్ లో మేము ఉండేవాళ్ళం .8th నుంచి puc వరకు అక్కడే . నాన్న అంటే చిన్నప్పటినుంచీ చాలా భయం ఉండేది .. అమ్మతో కూడా మరీ అంత చనువుగా ఈ కాలం పిల్లల్లా ఉండేదాన్ని కాదు .. ఆ రోజుల్లో వాళ్ళూ అలాగే వుండేవాళ్ళనుకోండి గంభీరంగా.


దాంతో నాకు ముభావం , మితభాషిత్వం అలవడ్డాయి . ఎవరితోనూ చొరవగా ఉండేదాన్ని కాదు . నలుగురిలోకి చొచ్చుకపోయే స్వభావం అలవడలేదు . ఇప్పటికీ చాలా పరిమిత స్నేహితులు నాకు . అందరితో ఇమడలేను .
సాహిత్యవాతావరణం కూడా మా ఇంట్లోవుండేది కాదు .మా వంశం లో రైటర్స్ ఎవ్వరూ లేరు .
1969 నుంచి వివాహం అయినతరువాత హైద్రాబాద్ వచ్చేసాను .. డిగ్రీ ప్రయివేట్ గా చదివి .. M A తెలుగు నిజాం కాలేజీ లో (night college ) చేసాను .. లాస్ట్ సెమిస్టర్ లో ఉండగానే ముంతాజ్ కాలేజ్ లో పార్ట్ టైమ్ లెక్చరర్ గా జాబ్ లో చేరాను .. ఆ తర్వాత అక్కడే డైరెక్ట్ U G C , permenent అయింది .. జాబ్ చేస్తూనే రీసెర్చ్ చేసాను
మావారు చలపతి రావు గారి ప్రోత్సాహం సహాయసహకారాలతోనే చదువుకొని , జాబ్ చేస్తూ , రైటర్ గా స్థిరపడగలిగాను .
ఆఫీస్ లో టేబుల్ వర్క్ కన్నా ఓ కాలేజీ లో టీచింగ్ వృత్తిలో వున్నందుకు నేను చాలా గర్వపడేదాన్ని .. పిల్లలు చాలా ఇష్టపడేవారు .. వాళ్లకు క్లాస్ లో సందర్భం వచ్చినప్పుడల్లా మంచిమాటలు , వ్యక్తిత్వం వికసించటానికి పనికొచ్చే సూక్తులు చెప్పేదాన్ని .. మనిషి ఎలావుండాలో ఎలా వుండకూడదో ఇలా ..!ఒకసారి శీలావీర్రాజుగారింట్లో ఒక ఓల్డ్ స్టూడెంట్ కలిసి పలకరించి మీ మాటల ప్రభావం నా మీద చాలా వుంది మేడమ్ అనటం చాలా తృప్తిని కలిగించింది .. ఇప్పటికీ ఆ మాటను మర్చిపోలేదు నేను . టీచింగ్ లో ఉన్న హాయిని చాలా ఎంజాయ్ చేసేదాన్ని .


ఇక రీసెర్చ్ విషయంలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది . ఎందుకంటే ఓ కావ్యం మీదనో , ఒక కవి మీదనో కాదు నేను పరిశోధన చేసింది .. మెకంజీ khaifiyathula మీద .. అన్ని రైటింగ్ అర్ధం కానీ మాన్యుస్క్రిప్ట్స్ .. భాష కూడా కొంత అర్ధం కానట్టే ఉంటుంది .. మెటీరియల్ లేదు .. మా ప్రొఫసర్ గోపాలకృష్ణారావు గారు సజెస్ట్ చేసారు ఆ సబ్జెక్టు ని .. పైగా ఎంఫిల్.. పీహెచ్డీ రెండింటిలో
అదే సబ్జెక్ట్ .. అయినా కష్టానికి ఫలితం లభించి అందరి మన్ననలూ అందుకుంది
చాలా మంది ప్రశంసించారు .
రచన మాసపత్రికలో రెండు కథలకు కథాపీఠం అవార్డ్ వచ్చింది .. ఒక కథకు బహుమతి
స్వాతిలో రెండు కథలకు 10000 + 5000 నగదు బహుమతి వచ్చింది
మాకు ముగ్గురు ఆడపిల్లలు
వాళ్ళను నేను కూర్చోబెట్టి చదివించింది తక్కువే గానీ
మంచి చెడులు చెపుతూ పద్దతిగానే పెంచాను .. బాగా చదువుకున్నారు .. ఉద్యోగాలు చేసారు . .. ఒకమ్మాయి housewife .ఒకమ్మాయి కి ఓన్ బిజినెస్ వుంది .. చిన్నమ్మాయి అమెరికా లో వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పరివర్తన

అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)- 4వ భాగం