శ్రీకళాంజలి _ అంజలి

కవిత

ప్రవాస వంగీయబ్రాహ్మణ వంశానపుట్టి
అఘోరనాథ వరదసుందరులకు
మొదటి పట్టి
జాతీయ చిహ్నమనగా సరోజిని యను పేరుపెట్టి
ఆంగ్లభాషా భ్యసనంపై మనసుపెట్టి
చదువుసంధ్యల ఆరితేరినట్టి
ద్వాదశవర్షప్రాయాన ప్రతిభచూపినట్టి
ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనట్టి
త్రయోదశవర్షాన అన్నివందల పంక్తుల కవిత కట్టి
అమోఘశక్తితో అబ్బురపర్చినట్టి
నౌకపై విదేశంలో అడుగుపెట్టి
ఆంగ్లగురువుల మనసుకొల్లగొట్టి
ప్రాచ్య సంస్కృతికి పీఠం పెట్టి
భరతఖండ స్వాతంత్య్రంకై బల్లకొట్టి, స్వదేశీ ఉద్యమానికై నడుం కట్టి
గాంధీజీ శిష్యురాలై అడుగు పెట్టి
గోవిందరాజులనాయుడు చేయిపట్టి
ముత్యాలవారింట మెట్టెల కుడికాలు పెట్టి
కాపురానికై చక్కని ఇల్లు కట్టి
బంగారువాకిలి అని పేరుబెట్టి
ముగ్గురు సంతానానికి ఊయల కట్టి
భారత దేశ తొలి మహిళా గవర్నర్ పదవి చేపట్టి
పలురంగాల్లో తొలిమహిళ
అనిపించు కున్నట్టి
నీజన్మదినం మహిళాదినంగా
గుర్తింపు కల్గినట్టి సుదినాన మా మహిళా కళాంజలి
అంజలి పట్టె

Written by GangaRaju Padmaja

గంగరాజుపద్మజ హిందీ ఎం.ఎ
తెలుగు ఎం.ఎ
రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ .ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు,స్త్రీ శక్తి పురస్కారం,ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్,అక్షరయాన్ వారి సన్మానాలు పొందారు.మలక్పేట పేట అంథబాలలకి చదువుతో పాటు స్క్రైబర్గా సోషల్ వర్క్ చేశారు.వార్త ఆంధ్రప్రభ లో ఈమెను గూర్చిన ఆర్టికల్స్ వచ్చాయి.గాయని,వయోలిన్ కథక్ డాన్స్ నేర్చుకున్నారు.పిల్లలు స్త్రీలచేత రేడియో ప్రోగ్రాంలు చేయించారు.బాబా ఆమ్టే ని కలవటం,అమ్మ నాన్నలతో దేశ మంతా పర్యటించిన ఆనందం వర్ణనాతీతం అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*పసిదనంతో ప్రయాణం” (కాలమ్)

ప్రేమికుల రోజు