సాంఘిక సంక్షేమ

కవిత

సాంఘిక సంక్షేమ సంస్కృతి
మనం నేర్చుకునే మంచి కృతి
గురుకుల నివాసములో ఉండే ప్రకృతి
పరిసరాలుంటాయి మంచి ఆకృతి
మనమందరం ఒకటే అని నేర్పే సంస్కృతి

ఆటపాటల చదువుల్లో మనకు మనమే సాటి
మనకు ఎవ్వరూ సాటిలేరు మనం ఎవ్వరు దాటి పోరు
కలిసిమెలిసి ఉంటాం కళాశాల విద్యార్థులం
ఇంటికి దూరంగా ఉంటాం ప్రేమలు పంచుకుంటాం
గొప్ప స్నేహితులమని
గొప్ప భావకులమని
వినయంగా ఉంటాం
నిరూపించుకుంటాం
_**__
గురుకులం
__
ఇది మన ఆలయం
సాంఘిక సంక్షేమ విద్యాలయం
ఇది గురుకులం… ఇదే గురుకులం
అనుక్షణం అభ్యసన
గురువుల పర్యవేక్షణ
ఆదర్శమైన శిక్షణ
పిల్లలం మేం పిల్లలం
గురుకుల విద్యాలయ విద్యార్థులం
క్రమశిక్షణకు మారుపేరు గల పిల్లలం
నిరంతరం విద్యనభ్యసించే పిల్లలం
సాంఘిక సంక్షేమ విద్యార్థులం

Manasa BA 2

Written by Manasa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ మనసు

ఆడపిల్లలం