Paintings అయినా కవితలు అయినా కథలు పాటలు ఇటువంటి కళలు ఏవైనా మనసును ఉల్లాసపరుస్తాయి ఎటువంటి బాధల్లో ఉన్న వాళ్ళనైనా ఈ కళలకు ఆకర్షితులై వారి బాధలు మరిచిపోతారు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ wall paintings వాల్ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. కానీ మెక్సికో దేశానికి ఈ పెయింటింగ్స్ విషయంలో కొంచెం మార్కులు ఎక్కువే వేయవచ్చు. మెక్సికో సిటీలో wall paintings అంటే భిత్తి చిత్రాలు చాలా ఎక్కువే కనిపిస్తుంటాయి ముదురు రంగులు కొంచెం ఎక్కువనే వాడుతుంటారు ఈ oil paintings అంటే తైలవర్ణ చిత్రాలు దాదాపు 100 ఏళ్ల చరిత్ర ను కలిగి ఉన్నాయి ఇందులో భాగంగానే ఈరోజు “ఫిద కల్హో” చిత్రకళ చర్చలోకి వచ్చి ఆమె వేసిన oil paintings మళ్లీ ఒకసారి కొత్త ఊపిరిలు అందుకున్నాయి.

ఫిద కల్హో 1907 July 06 న మెక్సికో లో జన్మించారు. 1954 July 13 న మరణించారు. చాలా తక్కువ సంవత్సరాలు జీవించారు. అయినా వంద సంవత్సరాల కీర్తిని గడించారు.
ఫ్రిద కల్హో ఆయిల్ పెయింటింగ్స్ ప్రఖ్యాతి పొందాయి. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. పక్షులను, జంతువులను ఇష్టపడ్డారు . ఆమె వాడిన రంగులు చాలా ప్రసిద్ధినొందాయి.
ఫ్రిద కల్హో జీవితం నల్లేరు మీద నడక కాదు. పోలియో బారిన పడ్డారు. 18 చాలా భయంకరమైన ప్రమాదానికి గురై చాలా సంవత్సరాలు బెడ్ మీదనే ఉన్నారు. అయినా అధైర్యం పడలేదు . మహిళల ప్రగతికోసం ప్రయత్నించారు. ఒక కల్చరల్ ఐకాన్ గా పేరుపొందారు
ఫ్రిద కల్హో self – potraits మాత్రమే కాకుండా folk Artist గా కూడా ఈమె చిత్రాలు ఖ్యాతినొందాయి.
- 1940 లో ఆమె వేసిన self – portrait మెడలో ” Thorn Necklace”
ధరించారు. ఈ పెయింటింగ్ లో హమ్మింగ్ బర్డ్ (hummingbird )
కూడా కనిపిస్తుంది. ఒక visual artist గా ఆమె లోని బాధ ఈ పెయింటింగ్ లో ప్రస్ఫుటిస్తుంది.
2 . 1946 చిత్రం The Wounded Deer చిత్రం. ఈ పెయింటింగ్ లో

ముఖం ఆమెదే చిత్రించారు శరీరం మొత్తం జింక బొమ్మను వేశారు వేటగాని ఎన్నో బాణాలు జింకను బాధించాయి. అవి ఆమె ముఖంలో చాలా క్లియర్ గా చూడవచ్చు.
3 . ఫిదా కల్హో వేసిన పెయింటింగ్స్ ” Roots” చిత్రం. ఆమెలోని చిత్రకారిణికి ఒక మచ్చుతునక. ఆమెకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆమె తలను ఒక దిండు పైన పెట్టుకొని కుడి ప్రక్కన తిరిగి పడుకుని ఉంటుంది. ఆమె హృదయంలో నుండి వచ్చిన “Roots” కిందికి ప్రాకినేలను తాకుతాయి. ఆకులు Vine ఆకులను పోలివున్నాయి. ఆమె ఒక విజువల్ ఆర్టిస్ట్ అనేది ఈ చిత్రంలో ప్రస్ఫుటించింది . స్త్రీ ఒక ప్రాణికి జన్మనిచ్చి భూమిపైకి తెచ్చేది ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఆమె విజువల్ ఆర్టిస్ట్ అనడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి?
- The Two Frida అనే చిత్రంలో ఇద్దరు ఫ్రీగా ప్రక్క ప్రక్కనే కూర్చున్నట్టుగా చిత్రీకరించారు. ఈ చిత్రం ఆమె చిత్ర కళా నైపుణ్యం తెలుస్తుంది. ఆమె దించిన వేళ్ళు చిత్రం తీరుతోనే ఆమె ఎంతటి గొప్ప చిత్రకారిణో తెలిసిపోతుంది.
- 1938 లో ఆమె చిత్రం self portrait with the Monkey మరో గొప్ప చిత్రం. ఇది జంతువులంటే ఆమెకున్న మక్కువను తెలియచెప్పేందుకు ఓ ఉదాహరణ.
ఇలా చెప్పుకుంటే ఫిదా కల్హో చిత్రించిన ఎన్నో ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అద్భుతమైన వర్ణ చిత్రాలు మనసును అలరిస్తాయి.
