మహిళామణులు – శ్రీమతి సత్యవీణ

తెలుగు కి చేయూత! వంటల్లో సిద్ధహస్తురాలు

సాహిత్యం సమాజ హితం… ఎందరో సాహితీకారులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినారు… తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచారు… తెలుగు అంటే వెలుగు.. తెలుగు వారికి వెలుగునిచ్చే భాష.. వేద వేదంగాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు పుట్టిన భరతభూమి లో జన్మించడం ఎంతో గర్వకారణం… నేను సత్య వీణ మొండ్రేటి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నగరంలో శ్రీ చిన్నం వెంకట్రావు శ్రీమతి సుబ్బాయమ్మ గార్లు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు…
ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా M. A. పబ్లిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివి వివాహం తర్వాత గుజరాత్ మహారాష్ట్రలలో నివసించాం…. అక్కడే లెక్చరర్ పాలిటిక్స్ లెక్చరర్ గా కొన్నాళ్ళు పని చేశాను….. అక్కడ నుండే నా తెలుగు భాషాభిమానం ఎంతగానో పెరిగింది… తెలుగు అసోసియేషన్ ద్వారా తెలుగు పండగలు తెలుగు భాష గురించిన అవగాహన అక్కడ నివసిస్తున్న తెలుగువారికి తెలియజేసే దాన్ని… తెలుగు భాష ఊపిరిగా మారింది తెలుగు తల్లికి దూరమయ్యాక ఆమె విలువ తెలిసింది….. తర్వాత హైదరాబాద్ కి వచ్చాం పిల్లలు స్టడీస్ గురించి జాబు వదిలేసాను… సాహితీ రచనను గురించి చెబితే టెన్త్ క్లాస్ నుండి కూడా ఏదో ఒకటి రాస్తూనే ఉండేదాన్ని చందమామకు బాలమిత్రుకు… అలా మొదలైన నా సాహిత్యం
సంసార జీవితంలో మరుగున పడింది…. బాధ్యతల బంధనాలతో పిల్లల చదువులతో నిమగ్నం అయ్యాను… హైదరాబాద్ నా సాహితి వేదిక… ఇక్కడకు వచ్చాక ఈనాడు పేపర్ కి ఆర్టికల్స్ రెసిపీస్ రాసేదాన్ని
ప్రజా డైరీ కి కథలు రాసేదాన్ని… సభలకు సన్మానాలకు మాత్రం వెళ్లే దాన్ని కాదు…. పిల్లలు లైఫ్లో సెటిల్ అయ్యాక.. వాట్సాప్ సమూహంలో కొందరి పరిచయం చేశారు… నా సాహిత్య మరింత వృద్ధి చెందింది సమూహాల ద్వారా…

            సత్యవీణ

తెలుగు భాష శ్వాసగా తెలుగు అభివృద్ధి పరచాలన్న ఆశగా సమాజంలోని సంకుచితత్వాన్ని అజ్ఞానపు ఆలోచనల్ని సాహిత్యం ద్వారా రూపుమాపటానికి ” సాహితీ వీణా కుసుమాలు ” వాట్సాప్ సమూహాన్ని 8/1/2022 లో స్థాపించి సత్యవాక్కులు బుక్ ఆవిష్కరణతో పాటు గా సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించాం….. మా సమూహ ప్రత్యేకత ఏమిటంటే సమూహ ప్రారంభమనాడు ఎవరైతే ఉన్నారో సభ్యులుగా ఇప్పటికీ వారే ఉన్నారు… ఎప్పుడూ 200 కి పైనే సభ్యులు ఉంటారు.
ప్రతిరోజు ఒక అంశాన్ని ఇచ్చి
కవితలు రాయిస్తాం….
సోమవారం :బాలసాహిత్యం
మంగళవారం: వచన కవిత్వం
బుధవారం: మినీ కథ
గురువారం: ఆధ్యాత్మిక వేదిక
శుక్రవారం: సమస్య పరిష్కార వేదిక
శనివారం: పద్యము r చిత్ర కవిత….
ఈ అంశాలన్నిటిలో ప్రతిరోజు కూడా 10 నుండి 30 వరకు కవులు తమ కవిత గానం రచిస్తారు…..
బాలలకు సంబంధించిన అక్షర మాల, కా నుండి క్ష వరకు గుణింత కవితలు… బాలల మేధాశక్తికి సరిపడి రీతిగా గేయాలు వ్యాకరణం పరిచయం చేస్తున్నాం…

అలాగే వచన కవితలు సమాజానికి సంబంధించిన అంశాలు ఇస్తున్నాం…

మినీ కవితలు కొన్ని వాక్యాలు ఇచ్చి వాటిని ఉపయోగించి కథ రాయిస్తున్నాం… ఆ వాక్యాలు కూడా సమాజానికి వ్యక్తికి సంబంధించి విశాల భావాలతో కూడినవి

ఆధ్యాత్మిక వేదికలో ఎందరో ఋషి పొంగవలు ఆధ్యాత్మిక తత్వవేత్తలు గురూజీలు సుకన్య అనసూయ లాంటి పతివ్రత శిరోమణుల కథలు
ఆధ్యాత్మిక క్షేత్రాలు వాటి ప్రత్యేకతలు మరుగుపడిన ఎందరో ఆధ్యాత్మిక కవయి త్రులు కవులు వెలికి తీసి ప్రజలకు అందిస్తున్నాం..

సమస్య పరిష్కార వేదిక సమూహానికే హైలెట్… నిజ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారం మార్గం కవుల ద్వారా వినిపిస్తున్నాం..
గనులు పర్వతాలు నదులు ప్రభుత్వ కార్యక్రమాలలో లోపాలు ఇండియన్ రైల్స్ విమానాలు ఇంచుమించుగా 300 సమస్యలకు పరిష్కార మార్గాలని వివరించాము…

ఇంకా శనివారం ఒక వారం పద్యమైతే ఒక వారం చిత్ర కవిత ఇస్తున్నాం.. పద్యాన్ని కన్నా చిత్ర కవితకు స్పందన ఎక్కువగా ఉంటుంది…
నాకు సహాయ సలహాదారులుగా నా కవి మిత్రులు మొదటి నుండి

మధు మురళి గుడ్ల గారు
పొర్ల వేణుగోపాల్ రావు గారు
రామ శేషు నంద గిరి గారు
నాయకంటి నరసింహ శర్మ గారు
వరలక్ష్మి యనమండ్ర గారు
యామిని కొల్లూరు గారు
నాగమణి రావులపాటి
గారు మా సమూహ అడ్మిన్స్…
అందరం సమిష్టిగా పనిచేస్తూ భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నాం……
24 3 /3/2024 lo
మా ట్రస్ట్ M. V. V. T. Ashish international cultural organisation..

ఆశి ష్ సాహిత్య సమాజ సేవా సంస్థ

సాహితీ వీణా కుసుమాలు…
రిజిస్టర్ అయ్యాయి….. ప్రతి సంవత్సరం సాహితీ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం..
అమెరికాలో కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం సభలు జరిపాము….
విజయవాడ ప్రపంచ మహాసభలలో సాహితీ సమూహాలను సత్కరించారు రెండు రాష్ట్రాల నుండి 30 సమూహాల అధినేతలను ఆహ్వానించారు… అందులో ఒకటి.. పెద్దలందరూ తెలుగు భాషా ప్రక్రియలు అన్నిటినీ సమూహం ద్వారా పరిచయం చేస్తున్నందుకు అభినందించారు….. త్యాగరాయ గాన సభలో జరిగిన” తెలుగు భాషకు పట్టాభిషేకం ” ఉత్సవ కార్యక్రమంలో ను మా సమూహాన్ని ఆహ్వానించి సన్మానించారు…
సమూహం ద్వారా ఎన్నో సమాజ కార్యక్రమాలు నిర్వహించాను… పేదలకు బట్టలు పంపిణీ చేశాను.. సమూహంలో కవులకు పోటీలు పెట్టి క్యాష్ ప్రైస్ ఇచ్చాను.. ప్రతిరోజు కాంపిటీషన్లో ప్రశంసా పత్రాలు ఇస్తాము… వికలాంగులకు రోగులకు మాకు తోచినట్లుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం సమాజసేవ బాధ తప్త హృదయాలను ఆదుకోవడం దానధర్మాలు
చేస్తూనే తెలుగు భాషాభివృద్దిలో పాల్పించుకుంటున్న కవులను సన్మానిస్తున్నాం… ఉడత భక్తి సహాయ సహకారాలు అందిస్తున్న…. భవిష్యత్తులో మరింతగా భాషాభివృద్ధికి తోడ్పడి తెలుగు భాష అవునొచ్చాను ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా తాపత్రయం…… ఆత్మీయ కలయికలు నిర్వహిస్తాం
రవీంద్ర భారతి లోను భారత్ వికాస్ పరిషత్తులోనూ వరంగల్లోనూ విజయవాడలోను యుఎస్ లో అట్లాంటా లోను సభలు సన్మానాలు నిర్వహించాం….. భాషా ప్రాముఖ్యతను వివరించాము..
కార్పొరేట్ స్కూలుకి వెళ్లి అక్కడి విద్యార్థులకు తెలుగు భాషా క్విజ్లు తెలుగు పొడుపు కథలు తెలుగుని గురించిన అన్ని ప్రక్రియలు వాళ్ళకి వివరించి తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పోటీలు నిర్వహిస్తున్న….
నా జీవితాంతం తెలుగు తల్లికి సేవ చేస్తూ తెలుగు భాషా పరిరక్షణకు పాటుపడాలన్నదే నా ఆశ ఆశయం….

విద్యార్థిగా నేను తెలుగు మీడియం స్కూల్లోనే చదివాను.. కాకినాడ నగరంలో శ్రీరామనగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదివాను… చదువు అంటే చిన్నప్పటినుండి కూడా నాకు ప్రాణం… ప్రతి క్లాసులో క్లాస్ ఫస్ట్ నేనే ఉండేదాన్ని… సిక్స్త్ క్లాస్ నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించిన మున్సిపల్ హై స్కూల్.. సాలిపేట కాకినాడలో చదివాను… ఇంటర్ డిగ్రీ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ లో చదివాను.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే చేశాను.. ఆంధ్ర యూనివర్సిటీ ఆపిలేటెడ్…. ఫైనల్ ఇయర్ లో ఉండగా పెళ్లయింది . ఎగ్జామ్స్ రాసి గుజరాత్ కి వెళ్ళిపోయాను. పెళ్లయిన కొన్నాళ్లు గుజరాత్లో ఉపాసన కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో
పాలిటికల్ లెక్చరర్ గా వర్క్ చేశాను….. పాప పుట్టగానే
జాబ్ మానేసాను… కుటుంబము పిల్లలు పైనే
దృష్టి పెట్టాను… నా ఫ్యూచర్ కంటే కూడా నా పిల్లల ఫ్యూచర్ ముఖ్యం అనుకుని అహర్నిశలు వారి గురించి వారి చదువు గురించి పని చేశాను… పిల్లల్ని ట్యూషన్లకి పంపించకుండా చదువు బాధ్యత నేనే తీసుకునే దాన్ని
ఒక తల్లిగా ఏ తల్లి కూడా చేయలేని త్యాగాలతో పిల్లలను పెంచి పెద్ద చేశాను..
జీవితంలో స్థిరపడేటట్టుగా పెద్ద చదువులు చదివించాము..
నా ప్రతి అడుగులో కూడా నా భర్త సహకారం ఉంది.. అందుకే లైఫ్ లో ఒక భార్యగా ఒక తల్లిగా సక్సెస్ అయ్యాను అని అనుకుంటున్నాను… పాప డెంటిస్ట్.. పెళ్లి చేసాం. తనకి ఒక పాప. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది… బాబుని అమెరికా పంపి M. S. చదివించాం. అక్కడే జాబ్లో స్థిరపడ్డాడు. పెళ్లి చేసాం
నా కుటుంబ బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత మళ్లీ నా వ్యావృత్తిని కొనసాగించాను… గుజరాత్ నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా టీవీ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాను.. ఈనాడు పేపర్ కి రెసిపీలు, ఆర్టికల్స్ త్రీ ఇయర్స్ రాసాను… సమాజ సేవలో నా వంతుగా చాలా కృషి చేశాను. ఎవరైనా సాయం అడిగితే నాకు తోచిన విధంగా నేను చేయగలిగినంత ఆర్థికంga, వ్యక్తిగతంగా సహకారం అందించాను. నాకు పరోక్ష సేవలో సంతృప్తి ఉండేది.. ఎప్పుడూ పబ్లిసిటీకి పాకులాడలేదు…. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో సమాజానికి నా వంతు సహాయాన్ని అందిస్తున్నాను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లోకాభిరామాయణం … 2

అద్భుత చిత్రకారిణి ఫ్రిద కల్హో – Frida Kalho