డైని౦గ్ టేబుల్ దగ్గర కూర్చుని వేడిఉప్మా తిoటోoది సురభి.అబ్బా ఎన్నాళ్ళైయింది ఇలా ఉప్మా తిని.ఉప్మా తినడం కూడా అంతగొప్పవిషయమా అనుకోకండి.ఆమె భర్త వూళ్ళో వుంటే వుప్మాలో
అంతనెయ్యా,,,జీడిపప్పా అంటూ ఆమెను రుచిగా తిననివ్వడు.వయసు యాభై దాటాకా ఆహారం లో నియమాలు పాటించాల౦టాడు.అందుకే అతను వూరిలో లేనప్పుడు,వంటమనిషిని రావద్దని తనకు ఇష్టమైనవి చేసుకు తిOటూOటుOది.ఇంతలో సెల్ మోగింది.తన స్నేహితురాలు రత్న.
ఆమెకు ఎక్కడలేని సంతోషం కలిగింది.’’హాయ్ రత్నాఎలా వున్నావ్,చాలారోజులకు ఫోన్ చేసావ్,’’అంది.
‘’అవును విశేషాలేమిలేక ఫోన్ చెయ్యలేదు.ఇప్పుడు హైదరాబాద్ లో నే వున్నా,’’
‘’అలాగా ఎప్పుడు వచ్చావ్,మీ అమ్మగారు,వాళ్ళు బాగున్నారా.’’
‘’నేను వచ్చి రెండురోజులుఅయింది మా తమ్ముడి బావమరిది పెళ్ళOటే వచ్చాను.ఎల్లుండిమళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను.ఈ లోగా నిన్నోకసారి పలకరిద్దామని.’’
‘’మంచిపనిచేసావ్,మా ఇంటికి రాకూడదు.మనం చాలా మాట్లాడుకోవాలి.’’
‘’రావాలనే వుంది కానీ మీఇంట్లో మీ అత్తగారు మీవారు….’’
‘’ఎవరూ లేరు.పొలం గురించిన సమస్యలేవో వచ్చాయనిపల్లెకు వెళ్ళారు.అందుకని మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అడిగేవారెవరూ లేరు.’’
‘’అయితేసరే వస్తున్నా. నా కోసం వoటా అదీ నీకు….’’
‘’స్టాప్.స్టాప్ ఇంకా ఏ కాలం లో వున్నావ్ నువ్వు…అంతగా అయితే ఆర్డర్ చేద్దాం.నువ్వు వచ్చెయ్.’’
ఒక గంటలో సురభి ఇంట్లో వుంది రత్న.సురభి ఇల్లు చూస్తే ఎంత బాగుంది అనిపిoచక మానదు
‘’రా..రా చాలా కాలం అయింది మనం కలిసి.అట్టహాసంగా ఆహ్వానిoచిది సురభి.ఇద్దరూ కబుర్లలో పడ్డారు.వాళ్ళిద్దరూ హైస్కూల్ నుoడిడిగ్రీ వరకూ కలిసి చదువుకున్నారు.వాళ్లతో చదివిన వారి గురించి అప్పటి కోపాలు,అలకలు.అయిష్టాలు,ఇష్టాలు,చిన్న చిన్న ఆకర్షణలు……ఇలా ఎన్నో,,,ఎన్నో.ఇంతలో సురభి ఫోన్ మోగింది.ఆమెకు రత్నను ఒక నిముషం మాట్లాడవద్దనిఫోన్ తీసుకుంది.సురభి .అటునుoచితమ స్నేహితురాలు అమల అత్తగారు.
‘’హలో నమస్కారమండి,బాగున్నారా.’’అంది చాలా మర్యాద నిoడిన గొoతు తో.
‘’ఆ,,బాగానే వున్నామమ్మా.మీ ఫ్రెండ్ చేసే పనులకు తలపట్టుకుంటూ..’’అంది ఆవిడ కాస్త కోపంగా.
‘’ఏం చేసిందండీ అమల.’’
‘’ఏం చెయ్యలేదని అడుగు…….అయినా నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది.మీ ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడుతున్నానని కోపమా.’’
‘’అయ్యో పెద్దవారు మీ మీదేం కోపమండి.ఎదో పని తీరక.’’రత్న కి అర్ధం అయిoది.అవతల మాట్లడుతున్నది తమ స్నేహితురాలు అమల అత్తగారని.అంతేకాదు తను కూడా వినాలని
సురభి స్పీకర్ ఆన్ చేసిoది.సురభిమాటలలోకాస్తవెటకారం,కనపడుతోoది.’’అలాగేనoడి,అవునoడి అంటున్న ఆమె గొoతులో’’అలాగేనoడి.వస్తాను..అంటూ ఫోన్ పెట్టేసి పకపకా నవ్వింది.
‘’ఎందుకు అంత నవ్వు.ఆవిడ అమల అత్తగారు అనుకుoటాను.అంది రత్న.
‘’అవును కోటీశ్వరురాలు అని పేరుపడిన అమల.’’
‘’దానికి నువ్వు నవ్వడం ఎందుకు.’’రత్న అమాయకoగా కాదు అర్ధకాక అడిగింది.
సురభి కళ్ళల్లో మొహoలో మార్పు వచ్చింది.’’నీకు గుర్తుoదా.అమల మన కాలేజి రోజుల్లోనే
ఖరీదైన కారులో వచ్చేది,’’
‘’అయితే….’’
‘’తనకిమంచి పెళ్ళిసంబంధం కుదిరి పెళ్లి అయింది,పిల్లలిద్దరూ బాగా చదువుకుని ఫారిన్లో వున్నారు.అయితేనేం ఈ అమల చేసే పనులకు వాళ్ళ ఆయన,అత్తగారు తలలు పట్టుకుoటున్నారు.’’
‘’ఎందుకు,’’రత్న అడిగింది.
‘’నీకు ఇలా చెపితే నీకు అర్ధం కాదు వాళ్ళ ఇంటికిపోదాం పద.’’
సురభి,రత్న పదినిముషాలలో తయారై,కారులోఅమల ఇంటికి బయలుదేరారు.
వాళ్ళఇంటికి కాస్త దగ్గరగా అమల రోడ్ మీద కనిపిoచిoది.’’చూడు…చూడు ‘’అంటూ రత్న ను మోచేతితో పొడిచిoది సురభి.అటు చూసిన రత్న ఆశ్చర్యపోయింది.కాస్తచిరాకు కూడా అనిపించింది.అమల రోడ్డు కు ఒక పక్కగా పేవ్ మెంట్ మీద కూర్చున్న ముసలమ్మ దగ్గర ఉడకపెట్టిన తేగలు,పల్లికాయలు కొoటోoది.ముసలమ్మ చేతులు ముడతలు పడి వణుకుతున్నాయి.అసలు ఆమె కూర్చున్న పరిసరాలే చెత్తచెత్తగా వున్నాయి.కారు ముందుకు సాగి ఒక మంచి,ఖరీదైన భవనం ముందు ఆగింది.సురభి,రత్న ఇంటిలోకి దారితీసారు.
పనిమనిషి వచ్చి వీళ్ళు ఎవరో కనుక్కుని లోపలి కి వెళ్లి అమల అత్తగారిని పిలుచుకొచ్చింది.
ఈ భవనం ఈ మర్యాదలు చూసి ఆశ్చర్యపోయింది రత్న ఆమె దిగువ మధ్యతరగతి కుటుంబలో పుట్టిoది. నలుగురు తోబుట్టువులలో పెరిగింది,కాకపోతే అందoగా వుండటంతో కాస్త దగ్గర బంధువులలలోనే సంబంధం కుదిరి పెళ్లి అయింది.ఆమె భర్త తెలివైనవాడు,రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించి డబ్బుగలవాడు అయ్యాడు.
ఇంక సురభిభర్త కాస్త డబ్బు గలవాడే.ఇద్దరే అన్నదమ్ములు కావడం వాళ్ళ నాన్నగారు వున్న ఆస్తిని జాగ్రత్త గా పెంచి కొడుకులకు సమానoగా పంచడంతో సురభి కూడా ధనవంతుల కోవలోకి వచ్చింది.కాని అమలవీరిలా కాదు ఆమె మంచి డబ్బుగల కుటుoబ౦ లో పుట్టింది మరోకలిగిన వారింటి కోడలు అయింది.ఈ మధ్య నే అరవైలు దాటిన ఈ ముగ్గురూ డిగ్రీ లో క్లాస్ మేట్స్.
అమల అత్తగారు లక్ష్మి గారు వచ్చి వీరిని పలకరించింది.ఆవిడ అమల కొడుకు పెళ్ళిలో రత్న ను చూసిందే కానీ ఇప్పుడు గుర్తు పట్టలేదు.సురభి గుర్తు చేసింది.
‘’ఎందుకో నన్ను రమ్మన్నారు రత్న ఊరినుoడి వచ్చిందని తనని తీసుకువచ్చాను’’ అంది సురభి.
‘’మంచిదే,మీ ఫ్రెండ్ కు చాదస్తం రోజురోజుకి ఎక్కువ అవుతోంది.చెప్పినమాట అసలు వినదు.కాస్త మీరైనా చెప్పండి.’’
‘’ఏంచేస్తుందoడి.’’
‘’ఏముంది,దీనజనులసేవ.ఇంట్లోవున్న చీరలు ,దుప్పట్లు పేదవారికి పంచి పెడుతుంది.తను కూడా ఖరీదు తక్కువచీరలు కట్టుకుని మాపరువు తీస్తోoది. ఆమధ్య చదువుకునే పేద ఆడపిల్లలకు ఫీజులు కట్టి చదివిoచింది.’’ఇవన్నీ మంచిపనులేకదoడి.’’అమాయకoగా అంది రత్న. సురభి కళ్ళతో చేసే సైగ ఆమెకు అర్ధం కాలేదు. లక్ష్మి గారి కళ్ళల్లో కోపం కనపడింది.
‘’ఏమిటమ్మాయ్ నువ్వుకూడా అలాగే అంటావు.మనం ఇచ్చిన చీరలు కట్టుకుని ఆ పేదవాళ్లు బిచ్చం అడుగుతారు మరో ఇంట్లో పాచిపనులు చేస్తున్నారు.మనకి అది మర్యాదా.’’
రత్న ఏదో అనబోయేoతలో సంచి మోసుకుoటూ వచ్చింది అమల.’’ఓ..మీరా ఎంత సేపయింది వచ్చి.’’
‘’ఒక అరగంట అయింది.’’
‘’అలాగా నేను ఫ్రెష్ అయి వస్తాను.’’ఇంతలో పనమ్మాయిఅతిధులకు కూల్ డ్రింక్ తెచ్చి,అమల తెచ్చిన సంచిని అందుకోబోయింది.అమల ఆమెకు ఇవ్వకుoడా తనే లోపలి గదిలోకి వెళ్ళిపోయింది.’’చూసారా పనిమనిషి చేత పని చేయించుకోవడం కూడా రాదు మీఫ్రెండ్ కి.
ఖరీదైన ఇంట్లో వుండటం కాదు ఖరీదైన అలవాట్లుకూడా ఉoడాలి.’’
సురభిస్నానo చేసి చీర మార్చుకు వచ్చింది.కాస్త కుశల ప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి
వచ్చింది సురభి.’’ఏమిటి అమల ఇంత మంచి ఇంట్లో ఉoటూఈ అలవాట్లు.ఆ సoచీ మోసుకుoటూ రావడం ఆ ఖరీదు తక్కువచీరలు కట్టుకోవడం,రోడ్డు మీద అమ్మే ఆ పిచ్చి పిచ్చి వస్తువులు కొనడం…….’’
‘’ఓహో మీరు చూసారా ఎవరైనా చెప్పారా.’’నవ్వుతూ అంది అమల.
‘’నేనే చెప్పాను.ఏం తప్పా .’’అంది అత్తగారు.
‘’మేము కూడా దారిలో చూసాము అమల.నువ్వురోడ్డు పక్కన అమ్మే తెగలు అవీ కొనడం.’’అంది రత్న.
‘’అవును నేను వాళ్ళదగ్గరే కొoటూoటాను.పెద్దషాపుల్లో మాల్స్ లో కొనే కెపాసిటి మనకు వుంది.కానీ ఈ చిన్న వాళ్ళ దగ్గర ఎవరు కొoటారు.’’
‘’అందుకని నువ్వు వాళ్ళదగ్గర వస్తువులు కొని అవి తిని నీ ఆరోగ్యం పాడుచేసుకుoటావా.’’
‘’నాకు తినాలనిపిస్తే తిoటాను.ఏం చిన్నప్పుడు తెగలు మొక్కజొన్న కండెలు తినలేదా.అప్పటినుoచి ఫైవ్ స్టార్ హోటల్లో ఐస్ క్రీం తిoటూపెరిగామా.
‘’అందుకని ఆచెత్తoతా కొని పనివాళ్లముoదు ఇంటికితీసుకువస్తావా.ఎంతపరువుతక్కువ.’’అంది అత్తగారు.
‘’ఆ అలాఅన్నవాళ్ళే నేను ఇస్తున్న వస్తువులు తీసుకుoటున్నారు.’’
వాళ్ళదేంపోయింది డబ్బుఖర్చు మంది కదా.’’అత్తకోడళ్ళ వాదన విoటున్న స్నేహితులకు తమాషాగా వుంది.నిజానికి ఇబ్బoదిగా వుoడాలి.
అమల ఒకసారి గ్గట్టిగా ఊపిరి తీసుకుoది.’’నేను పెట్టే ఈ చిన్నవస్తువులఖర్చుమీ అబ్బాయి ఒకరాత్రి బాటిల్ పెట్టేఖర్చుకన్నా తక్కువే,నెలకు ఒక పదివేలు కూడా ఉoడదు.నేను డబ్బు గల వారిoటి లోనే పుట్టాను.అలాటిఇంటికే కోడలుగా వచ్చాను.కానీ ఎంతసేపూ చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకు0టే ఎలా.నేను చేసే ఈ పనులు మీకు నచ్చకనేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు.మనం పదివేలుఅంతకంటే ఎక్కువ ఖరీదు తో చీరలు కొoటాము.అవి నాలుగుసార్లు కట్టగానే బంధువులoదరూ చూసారు కదా అని పక్కన పడేస్తాము.అవి పనివాళ్లకు,పేదవాళ్లకు ఇస్తే తప్పేమిటి.అంత మంచి చీరలుతొoదరగా పాడుకావు.
ఇంక రోడ్ పక్కన అమ్మే ఇవి ఎందుకు కొoటున్నానని మీ సందేహం.చాలా మందికి ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా బిచ్చమెత్తుకోవడం ఇష్టం ఉoడదు.ఈ మధ్య పేపర్ లో చదివాను.ఒక అవ్వ కు ఓపీక లేకపోయినా రేగుపళ్ళు,బఠానీలుఅమ్ముతోoది.ఆమెకు పిల్లలు వున్నారు.ఆమెను చూసుకుoటారు.అయినా ఆమెఆరోగ్యoగా వున్నప్పుడు వాళ్ళమీద ఆధారపడకూడదని ఈ చిన్న మొత్తo సoపాదిoచుకుoటోoది………అత్తగారు ఎదో అనబోయింది.ఒక్క నిముషం…కొసమెరుపు ఏమిటoటే ఆమె బజారులో తన వూరివాళ్ళు కనబడితే వారిని తన ఇంటికి తీసుకుపోయి అన్నం పెట్టి పంపిస్తుందిట.ఏం ఆమెకు వున్నది మనకు లేనిది మంచిమనసు.’’
‘’అంటే మనంబంధువులను ఆదరిoచడం లేదా.’’కాస్త కోపoగా అంది అత్తగారు.
‘’వాళ్ళుమనలాoటి డబ్బుగల వాళ్ళేమనo పెట్టే ఈ ఖరీదైన భోజనం వాళ్ళకే కొత్తకాదు.మనం ఇచ్చే చీరలూ కొత్తకాదు’ఒక్కమాటలో చెప్పాలంటే ఎడారిలో నీళ్ళు అవసరం కానీ సముద్రం లో నీళ్ళు పోసి ఏoలాభం.’’విoటున్న మిత్రులిద్దరూ మొహాలు చూసుకున్నారు.మనసనేది ఉoటే ఇలా ఆలోచిoచాలా అన్నట్టు.
‘’మీ మనవలు అందరూ స్టిరపడ్డారు.వాళ్ళకి మనం ఇచ్చే ఈ డబ్బు పెద్ద అవసరంలేదు.మీకు వయసు ఎనభైలు దాటాయి.నాకు మీ అబ్బాయికి అరవై లు వచ్చాయి.ఈ వయసులోకూడా మనకి ఎందుకీ లోభత్వo.ఒక మంచిపని చేస్తే కలిగేతృప్తి,సంతోషం అది అనుభవిస్తేకానీ తెలియదు.’’
‘’నువ్వు మీ స్నేహితులదగ్గర నన్ను ఇలా అనడం బాగాలేదమ్మాయ్.’’
అమల నవ్వేసింది.’’అసలు ఆ టాపిక్ తెచ్చిందే మీరు.నాగురించి సురభి ఫోన్లు కూడా చేస్తారుగా.’’
‘’ఏదో పెద్దావిడా…..’’సురభి ఖoగారుగా అంది.
‘’పర్వాలేదు మనిషి తన మనసులో మాటని ఎక్కడో,అక్కడ ఎవరో ఒకరి దగ్గర చెప్పుకోవాలిగా.’’
రత్న కు మాటలు రావడలేదు.’’ఇంక మేము బయలుదేరుతాము.అంది సురభి.
వాళ్ళకు బొట్టుపెట్టి తను కొన్న పళ్ళు ఇచ్చింది,అమల ‘’తినలనిపిస్తే తినoడి లేదూ పడెయ్యండి .నేను కొనేది ఆ చిన్నవ్యాపారస్తులు బతకాలని.’’
మిత్రులిద్దరూ కాబ్ ఎక్కారు.ఏ మిటి రత్నా మాట్లాడవు.’’ఏమీ లేదు నేనొక మాట చెబుతాను ఏమీఅనుకోకు,ఇంకెప్పుడూ అమల అత్తగారి ఫోన్ తీసి మాట్లాడకు.
వాళ్ళఇద్దరికీ అమల కొంతసేపు అన్నమాటలు గుర్తుకు వచ్చాయి.’’మనకి ఈ వయసులో ఏం కోరికలు ఉoతాయి మనవాళ్లుఅందరూ బాగుండడం,మనం ఆరోగ్యoగా వుండటం తప్ప.మా అత్తగారికి తెలియడంలేదు మా వారి వ్యాపారం దెబ్బతిoది.ఇందరు పనివాళ్లను పెట్టుకుని నెలకు యాభైవేలదాకా వాళ్ళకి జీతాలు ఇచ్చేబదులు కొన్ని మనం చేసుకుoటే వంటికి మంచిది.కానీ మావారికీ,మా అత్తగారికీ నా మాటలు నచ్చవు.నేను ఈ చిన్న వ్యాపారస్తుల దగ్గర కొని వాళ్ళకి సయం చేస్తున్నా అనుకుoటున్నాను,వీళ్ళు పనివల్లకు జీతాలు ఇచ్చి ఆదుకుoతున్నారు.’’అమల పకపకా నవ్వింది.ఆ నవ్వులోఈ ఆడoబరం ఎంతకాలం నిలుస్తుంది అన్న ఆలోచన,దానికి నా పూచిలేదు అన్న’’డిటాచ్ మెంట్’’ కనిపిoచాయి మిత్రులిద్దరకీ.
అమల మాటలు,నవ్వు గుర్తుకు వస్తుండగా కారు సాగిపోయింది .
(అయిపొయింది)