
అమ్మ బాగుంటేనే
ఇల్లు బాగుంటుంది
అమ్మ బాగాలేకపోతే
ఇల్లు ముఖం మాడ్చుకుంటుంది
వాకిలి దూపతో ఏడుస్తుంది
పొయ్యి రాజసాన్ని కోల్పోతుంది
దీపాంతల్లో దుమ్ము నిండుకుంటుంది
ఇల్లు కళదప్పుతుంది
ఎంతైనా అమ్మ అమ్మే
తను అనారోగ్యంతో ఉన్నా
నా పిల్లలు ఎలా తింటారోనని బాధపడి
తనకు కష్టమైనా వండిపెడుతుంది
అమ్మ బాగున్న ఇల్లు
ఆనందాల హరివిల్లు