ఆకాశానివవ్వు….

కవిత

ఎప్పుడు ఎరుగని బాధ
కొన్నింటిని చూసినపుడు
వాటి గురించి ఇంకా పదేపదే విన్నప్పుడు….
చర్చగా మారుతున్న స్త్రీ దుస్తుల మీద
సిగ్గు కోల్పోతున్నాను….
అస్థిత్వం ఏర్పరుచుకుంటున్నానో
పోగొట్టుకుంటున్నానో తెలియడం లేదు…
స్వేచ్ఛ కావాలి కానీ….
నీ మీద నియంత్రణ కోల్పోతున్న
మనిషిని ప్రశ్నించడం , సంస్కారం చెప్పడం బాధ్యత
విస్మరిస్తావో, వినమ్రిస్తావో
అంతా ఒప్పుకోవడంలోనే ఉంది
తిరస్కరణకు గురికాకుండా
అడ్డుగా అండగా నిండుతనంతో
భారతమాత గా
కొంగుతో చేరదీసే కన్నతల్లి హృదయం
పర, తమ, మగ, ఆడ అని భేదాలు లేని
వారసులమవుదాం….
మమేకంగా అడుగులు వేసే
శక్తిని కలిగివున్న….
చీపురుపుల్లతో గొడవపడి చులకనవడం
ట్రోల్సగా చక్కెర కొడుతున్న వార్తలపై స్పందించడం లాంటిది…
పరిధిని దాటి ఆలోచించు…
పైరుపంటగా సస్యశ్యామలంగా
అవధిని ముద్దాడే ఆకాశానివవ్వు

Written by Bhanuja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుగు జాతీయాల సొగసు

‘ప్రేమికుల రోజు ‘ కాదు ఇది ‘ప్రేమ రోజు’