అనంత శూన్యాన్ని
పరిశోధిస్తుంటే
చిదంబరుడై
దర్శనమిచ్చే
నిరాకారుడు!
హిమాలయాల్ని
పరిశీలిస్తుంటే
మంచు లింగమై
ప్రత్యక్షమయ్యే !
అమరనాథుడు
అరుణాచలం చుట్టూ
ప్రదక్షిణ చేస్తుంటే
అగ్ని లింగమై
జ్వలించే
రుద్రమూర్తి
శ్రీకాళహస్తిలో
అంజలి ఘటిస్తే
వాయు లింగమై
అలరించే !
దేవదేవుడు
మట్టిని గుట్టగా చేసి
మోకరిల్లితే
రామేశ్వరుడై
దీవించే
కరుణానిధి!
శివ శివ రూపం
పంచభూతాత్మికం
సదాశివా నామ స్మరణం
సర్వ సిద్ధి ప్రదాయకం !
ఓం నమశ్శివాయ!