కనిపించే దైవాలు

చిట్టి కథ

ఒకరోజు ఒక తండ్రి తన కూతురితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటటానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ తండ్రి కూతురుతో ఈ విధంగా చెప్పాడు. అమ్మ నా చెయ్యిని జాగ్రత్తగా పట్టుకో వదలకు అని .అప్పుడు ఆ కూతురు కాదు నాన్న మీరే నా చేతిని గట్టిగా పట్టుకోండి అని అన్నదట. అప్పుడు ఆ తండ్రి నేను అదే చెప్తున్నాను కదా!!! అమ్మ నువ్వు నా చేయి పట్టుకున్న నేను నీ చేయి పట్టుకున్నా రెండు ఒకటే కదా!!! ఇందులో తేడా ఏముంది?? అని అడిగాడట. అప్పుడు ఆ కూతురు తండ్రితో లేదు నాన్న రెండింటికి చాలా తేడా ఉంది. నేను మీ చెయ్యి పట్టుకుంటే ఏ కారణం చేతైనా ఏ క్షణంలోనైనా వదిలేయవచ్చు. అదే మీరు నా చేయి పట్టుకుంటే ఎంత కష్టమైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఏ కారణం చేతనైనా మీరు నా చేతిని వదలరు. అది రెండింటికి ఉన్న తేడా. మీరే నా చేయి పట్టుకోండి నాన్న అప్పుడు నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పిందట ఆ కూతురు. బాగా చెప్పావమ్మా నేను అంత దూరం ఆలోచించలేకపోయాను. నువ్వు నా ప్రాణం తల్లి .నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా వదలను అని కూతురు చేతిని గట్టిగా పట్టుకొని ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటాడట ఆ తండ్రి. అది కదా కన్న ప్రేమ. తల్లి నవ మాసాలు మోస్తే తండ్రి పిల్లలను జీవితకాలం మోస్తాడు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తన జీవితాన్ని కూడా తాకట్టుపెట్టే ఏకైక వ్యక్తి తండ్రి.. మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిని, జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రిని ఎప్పుడూ మర్చిపోకుండా… వారు పెద్దవాళ్ళు అయినప్పుడు వారు మనల్ని చూసినంతగా కాకపోయినా ఎంతో కొంత మానవత్వంతో వారిని ఆదరించినట్లయితే ఆప్యాయంగా పలకరించినట్లయితే వారి చివరి రోజులు ప్రశాంతంగా వెళ్లదీస్తారు. బంధం ఏదైనా కానీ నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తే ఆ బంధం బలపడుతుంది. ఆ ఆప్యాయమైన పలకరింపు బంధానికి జీవం పోస్తుంది.. అవునంటారా?? కాదంటారా??

*మాతృదేవోభవ
పితృదేవోభవ *

సామాజిక మాధ్యమం నుండి సేకరణ ఒక చిన్న రీల్ నా కలాన్ని కదిలించింది.

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు బండారం వాగ్దేవి

మన మహిళామణులు భాగ్య…