జీవితం విలువ

జ్యోతిర్మయి రామకృష్ణ పాముల

కాలం చేయిని పట్టుకున్న కలలతీరంలా
కష్టపడ్డ వారికే తెలుస్తుంది జీవితం విలువ.

జీవనపోరాటంలో అలుపెరుగని ఓ శ్రమజీవిలా
కష్టపడి,చెమటోడ్చి సంపాదించేవారికే తెలుస్తుంది డబ్బు విలువ.

ఆకాశంలో కలిసికట్టుగా పయనించే పక్షుల్లా
బంధాలను గౌరవించేవారికే తెలుస్తుంది అనుబంధాల విలువ.
కష్టపడకుండా అన్నీ దొరికితే తెలియదు మనిషికి వాటి విలువ.

మంచిచెడులకు స్పందించని హృదయంతో,
ప్రేమాభిమానాలకు కరగని శిలలా
మానవ విలువలకు తిలోదకాలిచ్ఛేవారికేం తెలుస్తుంది జీవితం విలువ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిరుప్రాయం

మార్గశిర శిరం – మార్గ సాధనం