
హేమంతపు చలిగాలిలో..
మంచు ముసుగులో
ప్రకృతి సోయగాలు..
మార్గశిర మాసారంభం.
విష్ణుచిత్తునికి
లభించిన పసిబాల.. మురిపాల పుత్తడి బొమ్మ “గోదా”
రంగనాథుని వరించిన
రాగవల్లి.. విరచించినపాశురాలు.
అంధకారాన్ని మేల్కొల్పిన భక్తి జ్ఞాన వైరాగ్యాలు..
సులభ భక్తి మార్గాలు..
ధనుర్మాస ప్రారంభం..
ప్రతి ఉదయంసుందరం.. మేలుకొలుపులవందనం..
ఆలయాలన్నీ
పండుగ శోభల కాంతులు
శ్రీవారికి మాసోత్సవాలు..
మార్గాళి స్నానాలు..
పూజలు జపాలు..
విష్ణువ్రతానికి శ్రీకారం
పులగం పాయసం దద్దోజనం ప్రసాదాలు.. ఆరోగ్యం ఆనందం..
పెళ్లీడు పిల్లలపూజలు..
కోరిన వరునితో కళ్యాణమట..
ఉభయసంద్యల
దీపారాధనలు
మహాలక్ష్మి దేవి అనుగ్రహమట
బ్రహ్మదేవుడే నారదునికి వినిపించిన
వ్రత కథ..
ఉపనిషత్తుల
సారమే తిరుప్పావై.. గోదాదేవి విష్ణు వ్రతం
బోగికాంతులతో ముగింపు.. రంగనాథునితోకళ్యాణం
కమనీయంరమణీయం
ధనుర్మాసపుముగింపు
రవి మకర సంక్రమణం సంక్రాంతికి స్వాగతం