నేను ఓడిపోలేదు

కథ

,, రాత్రి పది గంటలు అయింది. టీవీ కట్టేసి పడుకోవడానికి లేచింది ప్రమీల. ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్లిన చిన్న కొడుకు సురేష్ ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు. ఉదయం నుంచి ఎడమ కన్నా అదురుతున్నది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నది ప్రమీల. ఇలా అనుకున్నదో లేదో వెంటనే ఫోన్ మోగింది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. మీ పెద్దబ్బాయి గోపాలంకి యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే చనిపోయాడని వార్త చెప్పారు.

,, ఫోన్ చేతిలో నుంచి జారిపోయింది. ప్రమీల కూడా అక్కడే కుప్పకూలిపోయింది. ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. ఏవి చెవికి ఎక్కడం లేదు. మనసు మెదడు ముద్దుగారిపోతున్నాయి. అప్పుడే తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చాడు చిన్న కొడుకు సురేష్.

,, ఆ పరిస్థితులు తల్లిని చూసి పైకి లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించాడు. జరిగింది చెప్పింది ప్రమీల. వెంటనే ఇద్దరు హాస్పిటల్ కి చేరుకున్నారు.

,, తలకి బాగా దెబ్బలు తగలడంతో వెంటనే ప్రాణం పోయిందని డాక్టర్ చెప్పారు. పోలీసులు రావటం కేసులు రాసుకోవడం జరిగింది. పోస్టుమార్టం జరిపించి తెల్లవారాక డెడ్ బాడీని పంపించారు.

,, ఆ ఇల్లంతా శోకసముద్రంలో మారిపోయింది. ప్రమీల తల్లి తండ్రి బంధువులంతా వచ్చారు. భర్త ఎక్కడున్నాడో పిలిపించండి. కొడుకుని చివరిసారిగా చూస్తాడన్నారు.

,, ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం లేదు. జైల్లో ఉన్నాడని కొందరు, ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశాక దూరంగా వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు.

,, ప్రమీలకు ఇవేమీ పట్టినట్టు లేదు. నడుస్తున్న శవంలాగా ఉంది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా జరగాల్సినవి జరిగిపోతున్నాయి.

,, తండ్రికి తల పరువు పెట్టాల్సిన పెద్ద కొడుకు తమ్ముడు చేత తలకొరివి పెట్టించుకున్నాడు. కోడలు భర్తను పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది. అభం శుభం తెలియని పిల్లలు ఇద్దరు నానమ్మని పట్టుకొని నాన్న ఇక లేరా మాకు అంటూ ఏడుస్తున్నారు.

,, ఆ పిల్లల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. ఏమిటి కర్మ. ప్రమీల భర్త భాస్కర్ ఉద్యోగంలో అవకతవకలు చేశాడని నిర్ధారణ అయింది. అందరి దగ్గర లంచాలు తీసుకునేవాడు. వచ్చిన డబ్బంతా జల్సాలకు ఖర్చు అయ్యేది. అక్కర్లేని ఖర్చులు పెట్టి అప్పులు చేయడం, వాటిని తీర్చడం కోసం అవినీతికి పాల్పడటం. ఇలాంటి పనులు చేశాడని సస్పెండ్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఇంటికే రాలేదు. పై అధికారులు ఎవరూ మాకు తెలియదు అన్నారు. ప్రమీల భర్తను విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. జైలు నుంచి విడుదలయ్యాడని మాత్రం తెలిసింది కానీ ఎక్కడికి వెళ్లాడు ఎలా ఉన్నాడో మాత్రం తెలియలేదు. భార్యా పిల్లలు ఎలా ఉన్నారని ఆలోచించలేదు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లినట్లు. అందరినీ ఆశ్చర్యలో ముంచెత్తింది.

,, చివరికి తెలిసిందేమిటంటే మళ్ళీ పెళ్లి చేసుకొని ఎక్కడో దూరంగా ఉన్నాడని గాలికబురు మాత్రం తెలిసింది.

,, గోరుచుట్టు మీద రోకటి పోతుల ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. దుఃఖ సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్లు ఉంది. నావా వడ్డుకు చేరే దేలా!

,, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని ఇద్దరు పిల్లలతో ఎలా బ్రతుకుతుందోనని ఒక ప్రక్క కోడలు గురించి దిగులు మొదలైంది. కోడలు తరుపు పుట్టింటి వాళ్లంతా వచ్చారు. ఆశలేమి మిగల్లేదు. అప్పులు చేశాడు భాస్కర్. అప్పుల వాలంతా ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తున్నారు. చివరికి విసుగు పుట్టి ఏం చేస్తారో చేసుకోండి మీ ఇష్టం అన్నది ప్రమీల.

,, నాలుగు రోజులుగా ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కళ్ళు నీళ్లు ఇంకిపోయిన గుంటలుగా తయారయ్యాయి. ఏ పని చేయబుద్ది కావడం లేదు. ఎవరు తింటున్నారో, ఎవరు తినడం లేదు ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి.

,, రాత్రి బాగా పొద్దుపోయింది. ఎక్కడి వాళ్ళ అక్కడ పడుకున్నారు. చిన్న పిల్లలిద్దరూ తల్లిని వదలటం లేదు. తల్లిని అంటిపెట్టుకొని పడుకున్నారు. ప్రమీలకి కంటిమీదకి కునుకు రావడం లేదు. ఊరంతా నిద్రపోయింది. తనతో పాటు తన ఆలోచనలు మేల్కొన్నాయి.

,, ప్రమీల భాస్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పే చేసింది. ఇప్పుడు అగ్నిగుండంలోకి దూకినట్లయింది.

,, భాస్కర్ అందగాడు. మంచి పర్సనాలిటీ. ఆడపిల్లలంటా భాస్కర్ చుట్టూ చేరుతారు. భాస్కర్ చూపులన్నీ ప్రమీల మీదనే. డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమలోకి దింపింది.

,, డిగ్రీ పూర్తికాగానే ప్రమీలకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. ఒకరోజు భాస్కర్ ని ఇంటికి తీసుకొచ్చింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లంటూ చేసుకుంటే భాస్కర్ ని మాత్రమే చేసుకుంటాను అన్నది.

,, ప్రేమనేది ఒక వ్యామోహం. దాని నుంచి బయటపడ్డాక అసలు రంగు బయట పడుతుంది. ప్రేమ పెళ్లిళ్లు మన ఇంట వంటా లేవు. అతను ఎలాంటి వాడో. తెలియకుండా పెళ్లి చేసి నీ గొంతు కోయలేము. మా మాట విని మేము చూసిన సంబంధం చేసుకోమన్నారు తల్లిదండ్రులు.

ఎంత చెప్పినా వినిపించుకోలేదు ప్రమీల.

ఆనాడు తల్లిదండ్రుల మాట విని ఉంటే ఇప్పుడు ఈ జీవితం ఇలా ఉండేది కాదు. ఈ గతి పట్టేది కాదు. మన కులం కాదన్నారు. ప్రేమ వివాహాలు విడాకులకు దారితీస్తాయని చిలక్కి చెప్పినట్టు చెప్పారు.

,, భాస్కర్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. హీరోగా ప్రమీల ఒకపక్కల చదువుతూ కాలేజీకి ఎంబీఏ కట్టింది.

,, ఇంట్లో వాళ్ల సంబంధాలు చూస్తూనే ఉన్నారు. భాస్కర్ కు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని నచ్చ చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉన్నది. సంవత్సరం గిర్రని తిరిగి పోయింది.

,, ప్రమీల తండ్రి రంగనాథం కి ఆరోగ్యం దెబ్బతినడంతో కూతురి పెళ్లి చేసి కన్నుమూయాలనుకున్నాడు. రెండో కూతురు సౌజన్య డిగ్రీలో చేరింది. ఆ పిల్ల పెళ్ళికి ఇప్పుడే తొందర లేదు.

,, ఈ పెళ్లి చేసుకుంటే సుఖపడలేవని చివరిసారిగా చెప్పి చూశారు. నుదుటున ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.

, భాస్కర్ తో ప్రమీల వివాహం జరిగిపోయింది.

,, మొదటిరోజు పాలగ్లాసుతో గదిలోకి అడుగు పెట్టింది ప్రమీల. అప్పుడు మందు గ్లాసు పట్టుకుని తాగుతున్నాడు భాస్కర్. అది చూసి నిర్ధాంత పోయింది.

,, ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు. నేటి కల్చర్లో ఇది ఒక భాగం. మగవాడు అన్నాక మందు తాగాలి. సొసైటీలో ఉంటూ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళకపోతే హేళన చేస్తారు.

,, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నా భర్త నలుగురిలోనూ గుర్తింపు పొందాలి.

,, అవన్నీ పాతకాలం పురాణాలు. వాటితో టైం వేస్ట్ చేయడం దేనికంటూ చేతిలో పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేసి లైట్ ఆర్పేసి ప్రమీలను దగ్గరకు తీసుకున్నాడు.

,, కోరిక తీర్చుకొని మత్తుగా పడుకుండిపోయాడు భాస్కర్. నిద్ర పట్టగా ఒంటరిగా కూర్చుని ప్రమీల ఆలోచించు సాగింది. భాస్కర్ తో పెళ్లి తను ఆశించిన విధంగా లేదు. ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడాలి.

,,, రెండవ రోజు రాత్రి బాంబు లాంటి వార్త చెప్పాడు. నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడప్పుడు వచ్చి పోతుంటాను. మూడు నిద్రలు కాగానే భాస్కర్ వెళ్లిపోయాడు.

,, తిరిగి నెలకు వచ్చాడు. అప్పుడు చూచాయిగా తెలిసింది తనకంటే ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.

,, భర్తను నిలదీసింది. ఏడ్చింది. కాపురం చేయనంది. కలిసి ఉండలేనంది.

,, నీ ఇష్టం. మీ ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పించావు. వాళ్లు వద్దన్నా వినకుండా చేసుకున్నావు. నీ కర్మ అనుభవించమంటారు. నాకు తెలుసు. నువ్వు నన్ను వదిలి ఉండలేవని. చెప్పు! నన్ను వదిలి ఉండగలవా?

,, ప్రమీల పరిస్థితి దారుణంగా మారిపోయింది. భాస్కర్ కి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువనే తెలిసింది. ఇటు ఆఫీసులోనూ పాత ఫ్రెండ్స్ ని ఎవరిని వదిలిపెట్టడు. వాళ్లని మాటలతో మాయ చేసి తన వలలో పడేసుకుంటాడు. తన జలసాల కోసం డబ్బులు అప్పు చేస్తాడు. వాటిని తీర్చడానికి ఉన్న ఆస్తినంతా హారతి కర్పూరంలా హరించివేశాడు.

,, ప్రమీల జీవచ్ఛవంలా బ్రతుకుతున్నది. చెప్పలేక చెప్పలేక తల్లిదండ్రులకు తన గోడు వెళ్ళబోసుకుంది. తిరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఇప్పుడేం చేసే పరిస్థితి లేదు.

, వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పుడేనా భాస్కర్ ని వదిలించుకోవాలనుకుంది. అతని మీద పెంచుకున్న ప్రేమ ఆ పని చేయనివ్వలేదు. అర్ధరాత్రి ఎప్పుడు రావడం కోరిక తీర్చుకొని వెళ్ళిపోవడం. పిల్లల పెరిగిన మారుతాడు అనుకుంది

ఎదురు చూసినంత కాలం వేదించుకు తింటూనే ఉన్నాడు. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్లలేవు. ఇద్దరు పిల్లలు పుట్టారు ఒంటరిగా బతకగలవా. పిల్లల్ని నన్ను వదిలి వెళ్ళగలవా

మీ ఆడవాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది. నన్ను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు దూరం చేసుకోమన్నా చేసుకోలేవు అంటూ ప్రమీల బలహీనత మీద దెబ్బ కొట్టాడు.

,, నిజంగానే ప్రమీల భర్త అలాంటివాడైన వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఇంతకాలం సర్దుకుపోతూనే వచ్చింది. కాలం గడిచే కొద్దీ కష్టాలు బాధలు ఎక్కువవుతున్నాయి. నలుగురిలోన అవమాన పాలు పడుతున్నది.

, కాలంతో పాటు ఎదురు చూస్తున్నది. కళ్ళముందే పెద్ద కొడుకు చనిపోయాడు. చిన్న కొడుకు చదువు పూర్తి కాగానే చెడులు వాటికి బానిసైపోయి ఉద్యోగం పేరుతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు.

,, ఇప్పుడు వంటరిది అయిపోయింది ప్రమీల. ఎవరి కోసం తన ఎదురు చూడాలి. ప్రేమించిన భర్త కన్న బిడ్డలు దూరమయ్యారు. భర్తని జైలు నుంచి విడిపించడానికి లాయర్ల కాళ్లు పట్టుకుంది. ఉన్న బంగారం అంత అమ్మి ఖర్చు పెట్టింది. పాట అలవాట్లకు బానిసైనా భాస్కర్ ప్రమీల దగ్గరకు రావడం లేదు.

,, ఈ భావ బంధాలను పట్టుకుని వేలాడడం కన్నా తను నేర్చుకున్న విద్య ఉపయోగపడితే బాగుంటుందనుకొని నల్లకోటి బయటకు తీసింది. అన్యాయమైపోతున్న ఆడపిల్లలకు రక్షణగా నిలబడాలనుకుంది. ఆడదంటే అబల కాదు సభల అని నిరూపించుకోవాలి. అవసరమైతే ఆదిశక్తి రూపం దాల్చాలి. మగవాడి చేతి కింద పడి ఉండాల్సిన కర్మ లేదు. ఎన్ని బాధలు పెట్టినా ఎంత హింసించిన వదిలి ఉండలేరని అనుకుంటారు. స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. అన్ని రంగాలలో ముందంజ వేస్తున్నది స్త్రీ.

,, పెళ్లి పేరుతో మూడు ముళ్ళు వేసి, బిడ్డల్ని కన్నాక ఇంకెక్కడికి పోతుందిలే అనే ధీమాతో భార్యని అడగదొక్కి వేయాలని చూస్తున్నారు. ఎక్కడ తిరిగినా ఎవరితో తిరిగినా చివరి రోజుల్లో భార్య చూడకపోతుందా అనే అహంకారం.

,, ఓటు అనేది కొంతవరకే. చేతిలో డబ్బు లేకపోయినా ఎవరు దగ్గరికి చేరనివ్వరు. జైలు నుండి విడుదలైన భాస్కర్ ని ఎవరు చేరదీయలేదు. ఒంటరి వాడే దిక్కుతో తన స్థితిలో గుర్తుకొచ్చింది ప్రమీల.

, ఇద్దరు కోడళ్ళు వచ్చిన ప్రమీల భాస్కర్ తో విడాకులకు సిద్ధంగా ఉంది. వైవాహిక జీవితంలో ఓడిపోయిన జీవితంలో ఓడిపోదలుచుకోలేదు.

,, నా ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలకు న్యాయంగా తీర్పునిస్తూ వాళ్ల జీవితాలను నిలబెడుతున్నది. తన అవసరం సమాజానికి ఎంత ఉంది. జగమంతా కుటుంబం నాది. నేను ఓడిపోలేదు. గర్వంగా తలెత్తుకొని బ్రతుకుతానని, బ్రతకాలని స్థిర నిశ్చయానికి వచ్చింది ప్రమీల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -37

కాగితం పడవ – భాగం 8