పచ్చని ఆకులు

తళ తళ మెరుస్తాయి
మరి ఎండుటాకులు
గలగల అరుస్తాయి.

నా భావాలన్నీ
మౌనంగా డైరీలు అయ్యాయి
నన్ను ఖైదీని
చేశాయి

ఎదుటి మనిషి ఆనందంగా
ఉన్నాడు అనుకుంటున్నావు
అతను నోరు విప్పితే
నీ గుండె చె రువుఅవుతుంది

పేరు ప్రతిష్టలు
ఎన్నో త్యాగాల ఫలాలు
ఎంత అప్రతిష్ట
ఒక్క మాట వల్ల

కోపాన్ని
క్షణం ఆపు
మార్పునిలో
ఎంతో గమనించు

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు

దగాపడిన బాలికలు, యువతులకు వెలుగుదివ్వె ఆమె!