“పిల్లలు – ఆర్థికపరిస్థితులు”

నేటి భారతయం

“నేటి భారతీయమ్ ” అనే శీర్షికతో డాక్టర్ మజ్జి భారతి గారు తరుణి పత్రిక పాఠకుల కోసం ప్రతి వారం ఒక చక్కని కాలమ్ ను అందించే బోతున్నారు. డాక్టర్ మజ్జి భారతి గారు MBBS , MD పూర్తి చేసారు.
మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తీసుకుని రచయిత్రి డాక్టర్ గా , సమాజ పరిశీలకులుగా వారి అమూల్యమైన అభిప్రాయాలను, అనుభవాలను ఈ ” నేటి భారతీయం ” కాలమ్ ద్వారా తరుణి పాఠకులకు అందించనున్నారు.
– సంపాదకులు .

డాక్టర్ మజ్జి భారతి

పిల్లలకుచిన్నప్పటినుండిపొదుపుయొక్కఆవశ్యకతతెలియచెప్తూఉండాలి. దానికిముందు, మనముచేసిందేపిల్లలకుచెప్పాలి. పిల్లలకుచెప్పినదేచెయ్యాలి. అలాచేసినప్పుడుపిల్లలకుమనమీదగౌరవంపెరుగుతుంది. మాఅమ్మానాన్నవాళ్లుచేసిందేనాకుచెప్తారుఅనిమనమీదఆరాధ్యభావంపెరుగుతుంది. మనముచెయ్యనిదివాళ్లకుచెప్పితే, వాళ్లకుమనమీదగౌరవంసన్నగిల్లుతుంది. అప్పుడుపిల్లలుమాటవినకపోవడమేకాకుండా, ఎదురుతిరిగేఅవకాశంఎక్కువగావుంటుంది.

పిల్లలదగ్గరనిజాలనుయెప్పుడూదాయకూడదు. ముఖ్యంగాఆర్థికస్తోమతగురించి. కానివాటినిచెప్పేటప్పుడు, వాళ్లానిజాన్నిఅంగీకరించేలా, సున్నితంగాచెప్పగలగాలి. పిల్లలెప్పుడూయెదుటివారితోతమనిపోల్చిచూసుకుంటారు. అలాపోల్చిచూసుకోవడంతప్పని, చదువులోమాత్రమేయెదుటివాళ్ళతోపోల్చిచూసుకొని, బాగాచదవాలనేవిషయాన్ని, చిన్నప్పటినుండివాళ్లకిమనంసరిగ్గాచెప్పగలిగితే, వాళ్లభవిష్యత్తునుగురించినదిగులుమనకుండదు.

మనఆర్థికపరిస్థితిదృష్ట్యాపిల్లలకుమనంఏదైనాకొనివ్వలేకపోయినప్పుడు, ‘ఆవస్తువుమనదగ్గరలేదనిచిన్నతనముగాభావించకూడదు. నువ్వుబాగాచదువుకొనిమంచిఉద్యోగంతెచ్చుకొని, ఆవస్తువుకొనుక్కుందువని’ పిల్లలకునచ్చచెప్పగలగాలి. అప్పుడురెండుఉద్దేశాలునెరవేరుతాయి. ఒకటిపిల్లవాడుఆవస్తువుగురించిమారాముచెయ్యడంఆపడమేకాకుండా, ఆవస్తువుతనేసంపాదించుకోవాలనేకోరికతోపట్టుదలగాచదువుకుంటాడు. లేకపోవడమనేదినేరంకాదు. కానీఎదుటివాళ్ళతోపోల్చిచూసుకోవడమనేదిఒకరకంగాతప్పేనని, వాళ్లచిన్నిమనసుఅంగీకరించేటట్టుచెప్పాలి. మనకులేనిదానినిసాధించడానికిప్రయత్నంచెయ్యాలనేవిషయంకూడావాళ్లకుఅవగతమయ్యేటట్టుచూడాలి. మనకులేదనేభావాన్నిఅధిగమించాలనిపిల్లలకుఅర్థమయ్యేటట్లుచెప్పాలి.

అలాగే, యింకొకరితోసరిపోల్చుకోకుండా, మనకున్నదాంతోనేసంతృప్తిచెందడమనేది, విజ్ఞలకుండవలసినబలమైనలక్షణమని, అటువంటివిజ్ఞతనుమనముసంపాదించుకోవాలని, పిల్లలమనసుల్లోబలముగానాటేటట్లుమనప్రవర్తనవుండాలి.పెద్దవాళ్ళు, వాళ్ళబాధ్యతలెలానిర్వర్తిస్తున్నారో… అంటేయింటికికావలసినవస్తువులుసమకూర్చడంనుండి, పిల్లలచదువులు, మిగిలినవిషయాలుయెలాపట్టించుకుంటారో, అలాగేపిల్లలుకూడావాళ్ళబాధ్యతలు… అంటేచదువుకోవడం, తల్లిదండ్రులుచెప్పినదివినడం, యితరులనుయిబ్బందిపెట్టకుండానడుచుకోవడంమొదలైనవనినెరవేర్చాలని, వాళ్లకుఊహవచ్చినప్పటినుండీచెప్తూవుంటే, పెద్దయ్యాకపిల్లలుమాటవినడంలేదనేసమస్య, చాలావరకుకనిపించదు.

పెద్దవాళ్లుగుర్తుపెట్టుకోవాల్సినముఖ్యవిషయమేమిటంటే, పిల్లలదగ్గరఎప్పుడూమనఆర్థికపరిస్థితిదాయకూడదు. అబద్ధాలుచెప్పకూడదు. లేనిపోనిగొప్పలుచెప్పకూడదు. మీకోసంయేమైనాచేస్తామనేతప్పుడుసంకేతాలనుపిల్లలకుయివ్వకూడదు. మనస్తోమతనుదాటియెప్పుడూఖర్చుపెట్టకూడదు. అలాచేసినప్పుడేపిల్లలువాస్తవాన్నిగ్రహించుకొని, దానికితగినట్టువాళ్లనివాళ్లుసరిదిద్దుకుంటారు. పెద్దయ్యాకతల్లిదండ్రులకుమంచిపేరుతీసుకువస్తారు.

సర్వేజనాసుఖినోభవంతు.

Written by Dr. Majji Bharathi

ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డా. మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. ఐదు కథలకు బహుమతులు, ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఎడారి కొలను