

చిత్ర కవిత
___
ఎడారి దీపాలు
సంతోషపు తెర మూయక
తూర్పు తలుపు తీసి
వెలుగు పరుగు
శుభాలు ఎన్నో మోసుకొని
కమనీయ దృశ్యకావ్యమై
ఈ ఉషోదయం
నడినెత్తికొచ్చిన కిరణ సమూహ సందడంతా
విచక్షణ విలక్షణత
గొడుగు పట్టి
ఇంటింటి కథ ల సప్తవర్ణ కావ్యమై
ఒంటరి పయనపు
బహు దూరపు బాటసారి
ఆకాశమూ నేల
కలవని తీరాలు
ఏ కలల దారి నడిచి వచ్చేనో
ఏ గమ్యాన్ని అందుకొనునో
ఒకానొక భావ సరళి
పగటి నీడై వెంటవచ్చునట!
రచన : డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు.