భాస్కరుడు

కవిత

సుష్మా శ్రీనివాస్

తొలి సూర్య కిరణంలా ప్రకాశించు…
తిమిరాన్ని తరిమే ఙ్ఞానకాంతివై!!
నడినెత్తి రవిలా భగభగ రగులు…
లక్ష్య సాధనలో మమేకమై!!
సాయం సంధ్యాలాగా సంతసాన్నందించు…
ప్రశాంత భావ మనస్కుడవై!!
అస్తమించే భాస్కరుడే భరోసా…
రేపంటూ మరో ఉదయం ఉంటుందని!!!

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అన్నాచాందీ

మన మహిళామణులు