మన ఆరోగ్యా సూత్రాలు

తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.

 

పచ్చిమిర్చి లో పోషకాలు మెండు.జీరో కాలరీలు కావటంతో శరీరం మెటబాలిజం రక్తం ప్రసరణ శరీరం తాపాన్ని తగ్గిస్తుంది.దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.రక్తంలో చక్కెర ని నియంత్రణలో ఉంచుతుంది.ఇందులోని విటమిన్ సి బీటా కెరోటిన్ కళ్ళు చర్మానికి మంచి ది.పచ్చిమిర్చిని చల్లని చీకటి ప్రాంతంలో నిల్వ చేయాలి.కాంతి తగిలితే ఇందులోని విటమిన్లు పోతాయి.

(16 ఏప్రిల్ 2002 తరుణి అంతర్జాల వారపత్రిక)

Written by K Gayatri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉన్నదా అనుభూతి?

త్యాగరాజ గానసభ టూ బ్రిటిష్ పార్లమెంట్ నాట్యకళావారధి రాగసుధ వింజమూరి