మన మహిళామణులు

శ్రీమతి అరుణ చామర్తి ముటుకూరి

అరుణ చామర్తి ముటుకూరి ఎం ఏ

భర్త పేరు చామర్తి రాజు విజయ ఫణిందర్ (ఏ.సి.పి) ఎల్ ఎల్ ఎం

నాన్న పేరు: శ్రీ ఎం హెచ్ వి సుబ్బారావు గారు. బి ఈ ఎం ఏ(కలం పేరు నిశాపతి)

అమ్మ శ్రీమతి వసుంధర. బి ఏ

నాన్నగారు నిజాయితీపరులైన ఆఫీసర్ అవడంతో తరచుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. అలా కర్నూల్ లోని వివిధ ప్రాంతాల్లో రెండవ క్లాస్ వరకు చదువుకున్నాను తర్వాత ఆలూరులో (బళ్లారి దగ్గర) మూడవ క్లాసు, నెల్లూరు దగ్గర గూడూరులో నాలుగు, రాజమండ్రిలో ఐదు, ఆరు ఏడు గుంటూరు.. 8 10 మా సొంత ఊరులో మా తాతయ్య గారు కట్టించిన స్కూల్లో.. తొమ్మిది కూడా గుంటూరు. ఇంటర్ ఫస్టియర్ నరసరావుపేట సెకండ్ ఇయర్ నిర్మల్ డిగ్రీ మూడేళ్లు కూడా నిర్మల్. బీడీ కర్నూల్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. బీడీ తర్వాత ఏవో కంప్యూటర్ డిప్లమా కోర్సులు బ్యాంక్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ,వీణ, ఇలా ఖాళీ ఉండకుండా ఏవో నేర్చుకున్నాను.
‌‌ చిన్నప్పటినుండే స్కూలులో ఏ కాంపిటీషన్ జరిగినా ధైర్యంగా స్టేజ్ ఫియర్ లేకుండా పార్టిసిపేట్ చేయడం అలవాటు నేను పోటీకి వస్తున్నాను అంటే ఎస్సే రైటింగ్ అయినా, ఎలక్యూషన్ అయినా ప్రథమ బహుమతి మీద ఆశ వదులుకోవాల్సిందే అనేవారు నా స్నేహితులు తోటి పోటీదారులు .కబడ్డీ, బ్యాడ్మింటన్ క్యారమ్స్ టేబుల్ టెన్నిస్ ఇలాంటి కొన్ని ఆటల్లో కూడా బహుమతులు గెలుచుకున్నాను. ఏడవ తరగతిలో ఒక చిన్న కథ రాయడంతో నా సాహిత్య ప్రస్థానం మొదలైంది. అడపాదడపా డిగ్రీ వరకు చిన్న చిన్నగా రాస్తూ ఉండేదాన్ని. 9వ తరగతిలో నిరుద్యోగ నిర్మూలనపై వ్యాసరచనలు రాష్ట్రస్థాయిలో ప్రధమ బహుమతి పొంది అప్పటి విద్యా శాఖ మంత్రి ఇంద్రా రెడ్డి గారితో బహుమతి స్వీకరణ.

చిన్ననాటి నుంచి ఇంట్లో సాహితీ పరిచయం ఉంది. నాన్నగారి అభిరుచి వల్ల వృత్తి సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సాహిత్య రంగంలో అనేక విజయాలు సాధించారు. అలా కొద్దిగా పూలమాలని కట్టిన పొట్లానికి, దారానికి ఆ వాసన అబ్బినట్టు నాన్నగారి వారసత్వంగా నేను కూడా కథలు కవితలు వ్యాసాలు (100 పైగా, జానపద ఆధ్యాత్మిక ఆరోగ్య విశ్లేషణ వ్యాసాలు) కనుమరుగవుతున్న లేఖ సాహిత్యం (వెయ్యికి పైగా లేఖలు) రాయడం జరిగింది.

తొలి వ్యాస సంపుటి :లహరి

మలి వ్యాస సంపుటి: జానపద సు /సం దర్శనం

మూడవ వ్యాస సంపుటి: ఆధ్యాత్మిక ఆరోగ్య విషయ విశ్లేషణ వ్యాసాలు

తొలి కథా సంపుటి మరకత మంజూష
బాలల కథా సంపుటి: కథ కంచికి

మినీ కథాకదంబం మినీ కథల సంపుటి

“నిన్నే నిన్నే కోరి” భావ కవిత సంపుటి

“అరుణ కిరణాలు” సామాజిక కవితల సంపుటి

ఇంగ్లీష్ అనువాదం చేస్తున్న జీకే ప్రశ్న జవాబుల పుస్తకం మరొకరితో కలిసి సంయుక్తంగా త్వరలో రానుంది.

ఐదు ఏళ్ల క్రితం మేక రవీంద్ర గారిని ఇంజనీర్ గారు వాట్సాప్ సమూహాల్లో చేర్చడం వల్ల దరిదాపు 5వేలకు పైగా కవితలు రాయడం అనేక బహుమానాలు పొందడం జరిగింది. అక్కడే వ్యాసాలకి “సహస్ర శత వ్యాసవాజ్ఞ్మ ణి” అనే బిరుదు పొందాను.

ప్రతిలిపి వారి కవితల పోటీలో “అమ్మ” అన్న కవితకి ప్రథమ బహుమతి
“రేపటి దారి “అన్న కవితకు ద్వితీయ బహుమతి.
కవి ప్రవీణ అన్న బిరుదు కూడా వీరు ఇచ్చారు

గురజాడ సాంస్కృతిక సంస్థ ద్వారా రాష్ట్ర జాతీయ అవార్డులు పొందాను

“కాటికాపరి” అన్న కవితకి మానస ఆర్ట్స్ విజయవాడ వారి నుండి ప్రధమ బహుమతి.

నెలవంక నెమలికలో కథల పోటీలో “ఆదరణలయం” ప్రథమ బహుమతి

నవ తెలుగు తేజం ఉగాది కథల పోటీలో “ఆపన్న హస్తం” ప్రథమ బహుమతి

నిజామాబాదులో చలంస్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి” పోపు గింజలు” కథ

సృజన సాహితీ పత్రిక వారి కథల పోటీలో ప్రత్యేక జూరీ బహుమతి “తల్లి నిన్ను దలంచి” కధ

సహరి ఆన్లైన్ పత్రికలో “కుక్క కాటుకు చెప్పు దెబ్బ “కథకు బహుమతి.

అనేక కథలు వ్యాసాలు ప్రసార భారతిలో చదివిన అనుభవం.
ప్రస్తుతం యూట్యూబ్లో కూడా కొన్ని కథలు ప్రసారమయ్యాయి.
అనేక పత్రికలలో వ్యాసాలకి కూడా పారితోషికాలందుకోవడం జరిగింది.
తెలంగాణ బతుకమ్మ పురస్కారం రెండుసార్లు.

30 పైగా అనేక కవితా సంకలనాల్లో కవితలు చోటు చేసుకున్నాయి.

మానసవీణ అనే గొలుసు కట్టు నవల లో నేను ఒక భాగం

“ఆది నుండి అనంతం.”. అనే రికార్డ్ కవిత సంకలనం లో నా కవిత కూడా ఉంది.
ఇది సూక్ష్మంగా నా పరిచయం

వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో బడి లో బహుమతులు పొందిన ఆమె ఆటల్లో కూడా ప్రైజులు పొందారు.9వక్లాస్ లో ఉండగా వ్యాసరచన లో రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతి ఆనాటి విద్యా శాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారి ద్వారా అందుకోవడం మరపురాని అనుభూతి అంటున్నారు శ్రీమతి అరుణ చామర్తి ముటుకూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గుణత్రయాంబిక

బ్రతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ