
అనువాదరచనల్లో ఆరితేరిన డా.వసంత హిందీ,తెలుగు,ఇంగ్లీషు,మరాఠీ భాషల్లో పుస్తకాలు విపరీతంగా చదివి మంచి రచయిత్రి అనువాదరాలకుగా పేరు గాంచారు.హైదరాబాదులో పుట్టిన ఈమె 12వక్లాస్ దాకా చదివారు.పెళ్లి శ్రీతంగిరాల కామేశ్వరసోమయాజితో జరగటం,ఆపై పుత్రజననం తో సంసారం ఈదుతూనే 20వ ఏట బి.ఎ.ఎం.ఎ.ప్రైవేట్‌గా ఉస్మానియా యూనివర్శిటీనుంచి పాసైనారు.దక్షిణ భారత హిందీప్రచారసభలో ప్రవీణ్ ప్రచారక్ ఆపై సాహిత్యరత్న పాసైనారు.భర్త సాహిత్య ప్రియులు ఎస్.బి.హెచ్.లో ఆఫీసర్ కావటంతో ఇన్ని భాషల్లో ఆమెకు పరిచయం ఏర్పడింది.మహారాష్ట్రలో ముఖ్యంగా ఔరంగాబాద్ లో చాలా ఏళ్లు గడిపారు.1986లో అంబేడ్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీ నుంచి పి.హెచ్.డి.పట్టాపొందారు. ఆపరేషన్ సిందూర్ ని కేంద్ర బిందువుగా చేసుకుని హిందీ తెలుగులో దీర్ఘ కవిత రాశారు వసంత! అదిమరాఠీ బెంగాలీలోకి అనువదింపబడింది.చలం*మైదానం*లో రాజేశ్వరిని అమృతాప్రీతం తో కంపేర్ చేస్తూ రాసింది జనామోదం పొందింది.అమ్మ నాన్నలు అనసూయమ్మ చింతలపాటి అప్పారావుగారు.చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి గుడంటే బాల్యం నుంచీ ఇష్టం.అక్కడ జరిగే హరికథలు, బుర్రకథ పురాణాలు సాహిత్యంపై అభిరుచిని పెంచాయి.మామగారు డా.నారాయణశాస్త్రిగారు తెలుగు ప్రొఫెసర్ కావటంతో ఇల్లు ఓ లైబ్రరీ లా ఉండేది.రమణీ సే రమణాశ్రమ్ తక్ చలంజీవితంపై వ్యాసాలు మంచిపేరు తెచ్చాయితనకు అంటారు వసంత. సైన్స్ ఫిక్షన్ నవల కూడా రాశారు.మహారాష్ట్రలో భూకంపసమయంలో ఆప్రాంతాలకి వెళ్లారు.అక్కడి పరిస్థితులను తన రచనల్లో చొప్పించారు.తాపీధర్మారావు జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్ అకాడమీకోసం రాస్తున్నారు.
శ్రీమతి వసంత ఎన్నో అవార్డులు పొందారు. అనువాద పురస్కార్ మరాఠీ యూనివర్సిటీ నుంచి, ఔరంగాబాద్ హిందీ పరిషత్, ఆచార్య ఆనంద ఋషి సాహిత్య పురస్కార్ ,ఆచార్య భీమ్సేన్ నిర్మల్ రాష్ట్రీయ పురస్కార్, సుగుణ స్మృతి పురస్కార్ ,జబల్పూర్ కేశవ్ ప్రసాద్ పాఠక్ సమాన్ ,యుపి హిందీ సంస్థాన్ పురస్కారాలు పొందారు .సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పురస్కారాన్ని పొందిన డాక్టర్ వసంత ప్రస్తుతం అనేక అనువాదాలు స్వీయ రచనలు చేస్తూ ప్రశాంతంగా సాహిత్య సేవ చేస్తున్నారు .ఆమెకి ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావాలని ఆశిద్దాం.
9848624542