మరోపార్శ్వం

రాధికాసూరి

బలగం ఓ బలోపేతమైన బంధం అనుబంధాల లోగిళ్ళ ఆనందపు హరివిల్లు
మధురానుభూతుల మనోహర ప్రియదర్శిని
అంతా సవ్యంగా సుందరకావ్యంలా సాగినప్పుడు …
జీవితం తలకిందులైందా!

అదే ,

బలగపు మనోవికారపు చేష్టలై అచ్చెరువొందిస్తాయి …
మంచితనానికి మరకలు రుద్ది
అసమర్థతగా అవహేలన చేస్తుంది అణకువలోని

మార్దవాన్ని అతివినయమంటూ దండోరా వేస్తుంది
చలాకీతనానికి మసిపూసి
విశృంఖలత్వంగా విపరీతార్థం తీస్తుంది
పరోపకారానికి రంగులద్ది పనికిమాలిన చర్యగా ప్రచారం చేస్తుంది.
ఆత్మవిశ్వాసపు గాంభీర్యానికి అహంకారపు ముద్ర వేస్తుంది

ఎదగడంమొదలెట్టావా!..
అనునిత్యం అసూయతో రగిలే ఆ మది అశాంతిలో జ్వలిస్తూనే ఉంటుంది

‘విజయకేతనం’ఎగురవేసావా!…
అయిష్టంగానే సమాజంతో జత కలిసి కరతాళధ్వనులు చేస్తుంది ఆపై..

పొగడ్తలతో బ్రహ్మరథం పడుతుంది
మనకు తెలియని మరో వైపు
అంతుచిక్కని అభిప్రాయ వేదికౌతుంది బలగం!

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇర్రోడి లగ్గం

మన మహిళామణులు