‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణ దేవరాయల చేత కీర్తింపబడిన ఆదిమ ద్రావిడ భాషైన తెలుగు నేడు ఆధునిక సమాజంలో మబ్బులు కమ్మటానికి అనేక కారణాలున్నాయి. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వలస పోతుండడం వలన యువత ఎక్కువగా ఆంగ్ల భాషపై మోజు పెంచుకుంటాన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీషు మీడియంలో పాఠాలు బోధించడంతో పాటు తెలుగు మీడియం ను కనీసం ప్రాధమిక స్థాయిలో కూడా లేకుండా లేదా తక్కువ చేయడం వలన కొన్ని రోజులకు తెలుగు మృత భాషగా మారనున్నదని తెలుగు భాషీయులు ఆందోళన పడటంలో వింత ఏమి లేదు.
వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగువారు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తెలుగు భాష విశిష్టత, తెలుగు ప్రాచీనత, తెలుగు భాష గొప్పదనం గురించి ఎన్నో చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు భాషను కాపాడుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలకు ఎలా నేర్పించాలి ? పిల్లలతో ఎలా సంభాషించాలి. వంటి అంశాలపై ఎందరో విన్నో సలహాలు ఇస్తుంటారు. మాతృ దినోత్సవం తర్వాతి రోజే మర్చిపోతుంటారు.
సలహాలు ఇవ్వడం కాదు ఆచరణలో చూపించాలని కంకణం కట్టుకుని సృజన్ పిల్లల ఆసుపత్రిలో గోడల నిండా తెలుగు కవితలు, పొడుపుకథలు అతికించుకున్నారు. ప్రతిరోజూ వచ్చే వందలాది చిన్నారులకు కాలక్షేపంగా పొడుపు కథల్ని గోడలకు అతికించారు. ఆ పొడుపు కథలకు పిల్లలతో పాటు పెద్దలు అమితాసక్తి చూపుతుండటంతో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, బాల సాహితీవేత్త అయిన డా॥ కందేషి రాణీప్రసాద్ దాదాపు నూట యాభై జంతువులకు పొడుపు కథల్ని రాశారు. అంతేకాదు మానవ శరీర అవయవాలకు, ఆసుపత్రి పరికరాలకు, వైద్య పరీక్షలకు పొడుపు కథల్ని రాసి చిన్నారుల కోసం పుస్తకాలుగా రూపొందించారు. పిల్లల మేధోవికాసాన్ని పెంపొందించే పొడుపు కథల ప్రక్రియను ఆసుపత్రి పరీక్షలకు, వ్యవహారాలకు అనుగుణంగా రూపొందిస్తువుందుకు రానీప్రసాద్ ను అభినందించాల్సిందే.
రాణీ ప్రసాద్ కు వంశపారంపర్యంగా సాహిత్యంపై మక్కువ ఏర్పడటంతో ఇంగ్లీషుకే పరిమితమైన మెడికల్ నాలెడ్జి, టెర్మినాలజీ లు తెలుగు భాషలో ప్రత్యక్షం అవుతున్నాయి. అనేక జబ్బుల లక్షణాలను, చికిత్సా విధానాన్ని కథల రూపంలో రాణీప్రసాద్ ఆవిష్కరించారు. సైన్స్ కు ఆలవాలమైన మెడికల్ సెంటర్లను తెలుగు భాషా నిలయాలుగా మార్చారు.
ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు వర్ణమాలకు లేసులు అల్లారు. తెలుగు వర్ణమాలలోని అచ్చులు, హల్లులకు సన్నని గీతలతో డిజైన్లు గీసి కొత్త తరహాలో ఆవిష్కరించారు. ఆ మహా సభలలో వాటిని ఆవిష్కరించారు. అంతే కాక ప్లాస్టిక్ రిసైక్లింగ్ లో భాగంగా తమ ఆసుపత్రి వ్యర్థాలతో అ ఆ ఇ ఈ అంటూ అక్షరాలను రూపొందించి పలువురి ప్రశంసలకు పాత్రులైనారు. అక్షరాల లేసుల్చి, ప్లాస్టిక్ వర్ణాలను ఆసుపత్రిలో ఉన్న “మిల్కీ మ్యూజియం” లో ఉంచి ప్రజలకు మాతృ భాష గొప్పదనాన్ని అనునిత్యం గుర్తు చేస్తున్నారు.
ఆసుపత్రి అంతా బొమ్మలతొనూ, కథలతోనూ కవితలతోనూ . పొడుపు కథలతోనూ అలరారుతూ కృష్ణదేవరాయుల సభా ప్రాంగణాన్ని తలపిస్తుంది. స్పిరిట్, ఫినాయిల్, రక్తం వాసనలతో వికారం కలిగించాల్సిన ఆసుపత్రిని తెలుగు భాష గుబాళింపులతో సువాసనలు వెదజల్లుతున్నారు. సూది మందు వేస్తారనే భయంతో ఆసుపత్రికి రానని భయపడే చిన్నారులను బొమ్మలు, చిత్రాలతో ఆకర్షించి వారిరి తెలియకుండానే సూది వేసి చికిత్స చేయడం సృజన్ పిల్లల ఆసుపత్రి ప్రత్యేకతగా మారింది. ఇలా ఆసుపత్రిలో స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ, మిల్కీ మ్యూజియంలు ఉండటాన్ని ఎక్కడైనా గమనించారా?
“ఒక రచయిత్రిగా, బాలసాహితి వేత్తగా డా॥ కందేపి రాణీప్రసాద్ ఆసుపత్రిని గ్రంధాలయంగా మార్చటంలో వింతేమీ లేదు కానీ ఆసుపత్రి చైర్మన్ డా|| కందేపి ప్రసాదరావు పిల్లలకు మందులు రాసే మందుల చీటీపై బాలగేయాన్ని ఉంచడం చాలా విశేషం. రోగ గ్రస్థులకు మందులు సూచించే మందుల చిట్టీపైన ఒక బాలల గేయం, చిత్రం పెట్టడం పట్ల ప్రపంచ రికార్డులు లభించాయి. ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి కొత్త గేయం కాత బొమ్మను పెడుతుంటారు. బొమ్మలు, గేయాలు రాణీప్రసాద్ రాస్తే వాటిని తన మందుల చీటిపై పెట్టుకోవడం డా॥ ప్రసాదరావు గారి కున్న మాతృ భాషాభిమానం వెల్లడవుతుంది.
ప్రతిరోజూ పసి పిల్లలు సంచరించే చోట తెలుగు పాటలు, తెలుగు పొడుపు కథలు, తెలుగు పుస్తకాలు ఉంచడం వల్ల తెలుగు భాషకు పునరుజ్జీవం పోసినట్లే. ఇక్కడ చిన్నారుల ప్రాణాలే కాదు తెలుగు భాషకూ ఊపిరితాదుచున్నారు. చిదరి దశలో ఉన్న మాతృభాషను వెంటిలేటర్ చికిత్స అందించైనా ప్రాణాలు నిలచెట్టాలని డా॥ కందేపి ప్రసాదరావు. డా|| కందేపి రాణీప్రసాద్ దంపతులు చేస్తున్న భాషా సేవ వెలకట్టలేనిది. అహరహం పిల్లల ఆరోగ్యం కోసం, మాతృభాష కోసం చేస్తున్న సేవ పదిమందికీ ఆదర్శం కావాలని ఆశిస్తున్నారు.