కాయకష్టం చేయునట్టీ మనుషులుంటే మురిసిపోతా
సోమరితనమే వీడునట్టీ మనుషులుంటే మురిసిపోతా
కుడిఎడమలగు కుంటిసాకులు చెప్పకుండా బతకవోయీ
తరువువోలే బతుకుతున్నా మనుషులుంటే మురిసిపోతా
చేయిచాచీ అడుక్కుతినే ఆనందాన్ని మరువవోయీ
చేతనైనా పనులుచేసే మనుషులుంటే మురిసిపోతా
స్వార్థమెరుగని జీవితాలను తలుచుకుంటూ నడవవోయీ
ప్రకృతమ్మలా పలుకరించే మనుషులుంటే మురిసిపోతా
కాలుష్యాన్ని నివారించే అడుగులేస్తూ సాగవోయీ
తోడునీడగ నడిచివచ్చే మనుషులుంటే మురిసిపోతా