వర్షపు ధార

కవిత

ఈ వేళ నే ఇలా
గదిలో కూర్చున్నాను
ఇంతలోనే ఒక శబ్ధం
అటుగా చూడగానే కిటికిలోంచి
వర్షపు ధారలు కారుతూ
నన్ను కవ్వింపజేశాయి.

అంతలోనే ఇటు వైపు గా
వస్తున్న చల్లటి పవనం
నా ఒంటికి తాకుతూ
నా తనువును పులకరింపజేసింది.

లేత గులాబీ వర్ణం కల్గిన పూలు
ఆ వర్షపు నీటికి తన తనువును
తడుపుకుంటూ తాహ తాహలాడుతున్నాయి.

ఆ వానకి సన్నటి ఇసుక రేణువులు
కిందికి జారుతూ
కొత్త ప్రదేశానికి ప్రయాణమవుతున్నాయి.

ఆ మట్టి పరిమళం
నా మనసుని దాని వైపు గా
పరుగులు తీయమంటున్నది.

ఎదురుగా మర్రి చెట్టు
మరీ మరీ చూసే దృశ్యమిది
ఎందుకు అంటే
ఆ మర్రి చెట్టు ఊడలు
వాన తాకిడికి ఉయ్యాలలు
ఊగుతున్నాయి.

ఇదంతా జరిగేది
సంధ్యా వేళన
ఇంకా
నల్లని మబ్బులు ముసురుకుంటున్నాయి
ఇంతలోనే వీధి దీపం
ఇప్పుడే వెలగాలి వెలగాలి అంటూ
వెలిగింది.
ఈ వీధి దీపాల వెలుగులోనా
వర్షపు ధారలు చూస్తుంటే
తెలియని ఆనందం నన్ను అల్లుకుంది.

నేను వాటిని చూస్తూ
ఆశ్వాదిస్తు ఉంటే
అది నన్ను చూసి
నా అందాన్ని వర్ణించడానికి
నీ కలాన్ని కదిలించు
అంటూ నన్ను తొందర పెట్టడంతో
ఈ సిరా చుక్కలతో
రకరకాల రంగులతో
వాటి దృశ్యాలను రంగరించుకుంది.

Written by Thummala Ankita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“వైట్ డిస్చార్జ్ – స్త్రీలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య”

లోకాభిరామాయణం 2/1