మన మహిళామణులు-నన్నపురాజు విజయశ్రీ

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు నన్నపురాజు విజయశ్రీ ప్రపంచ దేశాలలోనే మొట్టమొదటి సామ్రాజ్యం కాకలు తీరిన ఎందరో మహావీరుల జన్మస్థలి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప రాజసానికే వన్నె తెచ్చిన రాణీ రుద్రమ నడయాడిన నేల కాకతీయుల రాజధాని ఓరుగల్లు జిల్లాలో తొర్రూర్ మండలం గుర్తూర్ గ్రామంలో 01.02. 1958 సంవత్సరంలో జన్మించింది. అమాయకత్వపు అంచులలో పయనిస్తూ చిరుప్రాయం నుండే మేధా సంపత్తికి నిధి అయిన సంప్రదాయపు ఆచారాలు సంస్కృతి కట్టుబాట్లతో ఎదుగుతూ బాల్యం గుర్తూర్ లో పాఠశాల విద్య పల్లె గాలిలో పుట్టి పట్టుదలతో వెలుగొందిన ఒక వ్యక్తిత్వం సాధన యాత్రలో కాంతి దీపం ఎప్పుడూ ఆరలేదు విద్యపై ఉన్న ఆసక్తి ఒక విశేషమైన ధృడ సంకల్పంగా మారింది.

జీవితంలో తొలినాళ్ల నుంచే ఎదుర్కోన్న ప్రతీ అనుభవం ఆమెలోని ఒక శక్తిని నింపింది. ఇబ్బందులు వచ్చినప్పుడల్లా వెనక్కి తగ్గకుండా వాటిని ఒక పాఠంగా స్వీకరించడం సహజ స్వభావం ప్రాధమికొన్నత విద్యను మహాబూబాబాద్, పెదవంగర, గుర్తూర్, నల్గొండ, నల్గొండలోనే ఉన్నత విద్యను, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి ఖమ్మంలో ఇంటర్ రెండవ సంవత్సరం పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ పొంది తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.బి యెడ్.ఎమ్. ఎ తెలుగు ఎమ్. ఎ చరిత్ర, M, Ed, పూర్తి చేసి పాఠశాల మెట్లను ఖమ్మంలోనే తాకించి చిరుప్రాయంలోనే రాం చెందర్ రాజు గారితో వైవాహిక జీవితంలో అడుగిడి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయికి తల్లి యై పిల్లలను ఆప్యాయతానురాగాలతో పెంచుతూ తన విద్యను తన విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ గురువుల, తన తల్లిదండ్రుల ప్రేరణతో M. A, M. Ed, వరకు విద్యను అభ్యసించడం తండ్రి నన్నపురాజు హరిహరరాజు తల్లి మధురా దేవి తండ్రి లెక్చరర్ కావడంతో తనతో పాటుగా గుర్తూర్, పెదవంగర, మహాబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ లో విద్యా ప్రస్తానం కొనసాగింది. విద్యార్థులకు విద్య నేర్పించే గురువుగా రంగారెడ్డి జిల్లాలో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాలని పల్లెటూరి నుండి వచ్చిన విద్యార్థులకు పేద విద్యార్థులకు సానుభూతితోసహాయం చేస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ విజయాన్ని గమ్యంగా తన విజయాన్ని ఒక సాధనంగా భావించారు. చదువు ఆమెకు ఉద్యోగం కోసం కాదు జ్ఞాణం కోసం జ్ఞాణం ఆమెకు పేరు కోసం కాదు విద్యార్థులకు ఉపయోగపడే మార్గం ఈ దృక్పధమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. గురువుగా ఆమె పాత్ర మరింత గొప్పది పాఠం చెప్పడం మాత్రమే కాకుండా జీవితాన్ని ఎలా చూడాలో సమస్యలను ఏలా ఏదుర్కోవాలో విలువలను ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు నేర్పించారు. ఆమె తరగతి గది ఒక పాఠశాల మాత్రమే కాదు అది ఒక వ్యక్తిత్వ వికాస నిర్మాణ కేంద్రం. ఆమె మాటల్లో సరళత, ఆలోచన 1ల్లో లోతు, ప్రవర్తనలో వినయం ఈ మూడు లక్షణాలు ఆమె వ్యక్తిత్వాన్ని సూచించే ముద్రలు. ఎక్కడ వున్నా ఎవరితో మాట్లాడినా తనలోని మానవత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదే ఆమె గొప్పతనం విజీవితాన్ని చూసే ఆమె దృక్పథం ఎంతో ప్రత్యేకం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, విజయాలు వచ్చినప్పుడు అహంకారం కలుగకుండా ప్రతీ పరిస్థితిలోనూ సమానంగా స్వీకరించడం ఆమె జీవన విధానం ఇదే నిజమైన తత్వం అని నిరూపించిన వ్యక్తి ఆమె ఆలోచనలు రచనలు, బోధనలు, సేవలు, ఇంకా ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంటాయి. కాలం మారిన విలువలు మారవు జ్ఞానం వినయం సేవ ఈ మూడు ఉంటే మనిషి ఎంత ఉన్నత స్థాయికి ఎదగగలదో ఆమె ఉదాహరణగా నిలిచారు.


పేద విద్యార్థులను, మరికి వాడ విద్యార్థులను ఆదరించి వారికోసం పాఠశాల ప్రభుత్వ అధికారులను మెప్పించి ఒప్పించి గ్రామపెద్దలను, రాజకీయ నాయకులను, ధనవంతులను, గ్రామస్తులను, ఇతరులను సహాయ సహకారం ఆర్జించి పాఠశాల గదుల నిర్మాణం. పునర్ నిర్మాణం విద్యార్థులను చేర్చుకోవడం, విద్యార్ధులకు కనీస వసతి సౌకర్యం ఏర్పాట్లు మౌళిక వసతుల ఏర్పాట్లు. కనీస విద్యా అవసరాలు బ్యాగులు, పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, కంపాక్స్ బాక్స్, పరీక్ష వ్రాసే అట్టలు, వ్రాత వ్రాసే నోట్ బుక్స్ ఏర్పాట్లు చేసి వారి వారి ఆర్థిక స్థాయి నిబట్టి స్కాలర్ షిప్ ఉపకార వేతనాలకై కార్యాలయం చుట్టు తిరిగి సాధించి ఇప్పించడం జరిగిందన్నారు. అక్షరాలను అల్లుతూ ఉపాధ్యాయురాలుగా జ్ఞానాన్ని పంచుతూ విద్యార్థుల్లో సాహిత్యాన్ని వేదికలుగా వ్యాసం, ఉపన్యాసం, కధలు, పాటలు, గేయాలు, పద్యాలు, శ్లోకాల పోటీలలో అనేక బహుమతులు సాధించే విద్యార్థుల బృందాన్ని నిర్మిస్తూ సహనం ఆమెకు ఒక ఆభరణం అయితే కారుణ్యం ఆమెకు ఒక ఆత్మీయ గుణం పెదవిద్యార్థులకు ఆర్థికసహాయాలు వారిని ఆదరించి శిక్షణ ఇచ్చినవోదయ,s.w.R.S, A.P.R.S, B.Cw.R.S,సైనిక్ పాఠశాల,స్పాట్స్ పాఠశాల, మాడల్ పాఠశాల, బ్రిడ్జి పాఠశాల, పరీక్షలు వ్రాయించి ఉత్తీర్లులను చేర్పించి పర్యవేక్షించడం చేసేవారు. బడి మానేసిన వారికి ఓపెన్ పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీ.జీ. పరీక్షలకు ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఎదుటివారి మాటను ఓపికగా వినడం వారి భావాలను అర్ధం చేసుకోవడం అవసరమైనపుడు అండగా నిలువడం ఒక ప్రోత్సాహాకరమైన మాట, ఒక మంచిసూచన, అక్షరానికి గౌరవం ఇవ్వడం సాహిత్యాన్ని సమాజంతో అనుసంధానం చేయడం కవయిత్రిగా సృజన, ఉపాద్యాయులుగా విద్యార్థులను సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో అనేక సామాజిక అంశాలతో ముడిపడే, కథలు, నాటకాలు, గేయాలు, పాటలు, ఏక పాత్రాభినయాలు, బుర్రకథ, ఒగ్గు కథ, నాట్యం, ప్రదర్శింపచేసి సమాజం మెప్పుపొందడం, దిన పత్రికలలో చిన్న చిన్న కథలు, హాయ్ బుజ్జిలో అంశాలు వ్రాయించడం, ఆకాశవాణి కార్యక్రమాలలో ఉషారాణి wlo సుధామ గారి సమక్షంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్థులకు వినిపించడం చేసేవారు. సాంస్కృతిక కార్యాక్రమాలలో రాజకీయ నాయకులు దేవేందర్ గౌడ్, p.v.రంగారావు, నంది ఎల్లయ్య చూసి ఆనందించిన సంఘటనలు, తీగెల రాంరెడ్డి, తీగెల కృష్ణారెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి, D.E O భారతి మామిడిపల్లి సర్పంజ్ శంకర్ అభినందించారన్నారు.


అక్షరాన్ని ఆయుధంగా కాకుండా ఆత్మీయంగా మలచి సాహిత్య సేవలో మహాన్నత ప్రయాణం అక్షరం అనేది కేవలం లిపిలోని ఒక గుర్తుకాదు అది యుగాల అనుభవాన్ని మోసుకేల్లే జ్ఞాపకం అది ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం అది మనిషి అంతరంగానికి స్వరం, అలాంటి అక్షరాన్ని ఆరాధనగా భావించి సాహిత్యాన్ని సమాజ నిర్మాణానికి సాధనంగా మలుచుకొన్న అరుదైన సాహిత్య వ్యక్తిత్వంలో ఆమె స్పజన, విమర్శకుని వివేచన, వక్త వాగ్ధాటి సాహిత్యాన్ని సమాజానికి మరింత చేరువ చేయాలన్న తపనతో రచయితకు కలం ఎంత ముఖ్యమో ఒక రచన పాఠకుని హృదయంలో ప్రశ్నలను రేకెత్తించాలి. విలువలను మేల్కొలిపి మనిషిని మరింత మానవీయుడిగా మార్చాలి. ఈ సాహిత్య దృక్పథమే ఆమెను సమకాలీన సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక వ్యక్తిత్వంగా నిలబెడుతుంది, సాహిత్యం ఒక దీపమైతే ఆ దీపానికి నూనె పోసే సేవిక అక్షరాలకు ఆత్మను భాషకు భవిష్యత్తును సమాజానికి దిశను భావితరాలకు అందించేటందుకు నిరంతర అక్షర యజ్ఞంలో పాల్గొనే మహాన్నత సాహిత్య తపస్వి వ్యక్తిత్వంలో కనిపించే నిరాడంబరత, సహృదయత, అందరిని ఆప్యాయంగా పలకరించే స్వభావం విద్యార్థులను ప్రోత్సహించే విశాల హృదయం ఆమెను అందరికి చేరువ చేస్తాయి. ఆమె అడుగులు సాహిత్యానికి దిక్సూచి కావాలి, ఆమె ఆలోచనలు యువతరానికి స్ఫూర్తికావాలి, ఆమె అక్షరసేవ యుగయుగాల పాటు వెలుగులు నింపాలి. తెలుగు భాష ఉన్నంత కాలం తెలంగాణ సాహిత్య వైభవం విరాజిల్లినంత కాలం అక్షరాన్ని జీవన ధర్మంగా భావించిన మహనీయుల జాబితాల్లో గౌరవంగా ఉచ్చరించె ఆమె పేరు.
ఆదర్శమైన తల్లిగా, గృహిణిగా, ఉపాధ్యాయురాలుగా నిలబడడం గొప్ప విషయం తాను ఉన్నత విద్యను గరిపి govt Dr. Pvt. మెకానికల్ ఇంజనీయర్ Pvt staff Nurse గావిద్యావంతులుగా తీర్చి దిద్ది భర్త సహాయ సహకారాలు లేకున్న ఎన్నో కష్టనష్టాలను అనుభవించి అధిగమించిన నన్నపురాజు విజయశ్రీ నాటి ,నేటి, భావితరానికి ఆదర్శనీయురాలు.
రేడియోలో సాహిత్య ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, వ్యాసరచనలు, సమీక్షలు, కవితా రచనలు, కథలు, గల్ఫి కలు, లేఖా సాహిత్యం, బాలల కథలు, సంపాదకత్వం, కవితలు, గేయాలు, చరిత్రలు, సంకలనాలు 400 పైన, మయూఖ, తరుణి, నవ చిత్రమాలిక, సినియర్ సిటిజన్, అనేక పత్రికలకు వ్యాసాలు, సాహిత్యం. సమీక్షలు, కవితలు వ్రాయడం తన లోని ఆలోచనలకు, అనుభవాలకు పదును పెడుతున్న విజయశ్రీ నాటి మహిళలు కత్తిపట్టి యుద్ధం చేస్తే నేటి మహిళ పరిమళించే సాహితీ కుసుమాలు కలం పట్టి మనోనేత్రాన్ని తెరిచి తన భావజాలంతో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు అక్షర శాసనాలు అందిస్తూ ఎంతో మంది నవసాహితీపరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. విజయ శ్రీ తను వ్రాసిన తెలంగాణ చరిత్ర పెద్ద పుస్తకం రిసెర్చ్ స్కాలర్స్ ఉస్మానియా, కాకతీయ, విద్యార్థులకు పరిశోధనా గ్రంథానికి ఉపయోగకరంగా మరియు పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు సమాచార దర్శినిగా ఉపయోగకరంగా వుందన్నారు తాను సంపాదకత్వం వహించిన స్త్రీశక్తి, బహుజన మహిళలు, మా మాట మీ నోట బహుళ ప్రజాధరణ పొందినాయి. గవర్నర్ తమిళ సై గారికి ఇవ్వడం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, విజయతారలు, నాదాలు, అంతరంగాలు అనేక పుస్తకాలు ముద్రించి ప్రముఖ రచయితగా కథలు, కవితలు, వ్యాసాలు, రేడియోలో అనేక అంశాలపై ప్రసంగాలు స్ఫూర్తిదాయకం ఉదయం దిన పత్రికలో సృష్టిలో మహిళకు ఇంతటి శిక్షా! అనే అంశంతో వ్యాసం అచ్చు కావడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అని అంటారు. ఆంధ్ర ప్రభ, ఆంధ్రజ్యోతి, సూర్య, పత్రికల్లో కవితలు, మానవత్వం, దేశభక్తి, ఎన్నో కవితలు అచ్చు కావడం స్ఫూర్తిదాయకం.
అక్షర సేద్యం చేస్తున్న వీరిని మండలంలో MEO రఘు కుమార్ గారు 2008లో జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి గారు, 1996 లో చంద్రబాబు నాయుడు, 2009లో ముఖ్యమంత్రి రోషయ్య గారు 2014 లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2013లో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ గారి నుండి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయురాలుగా పురస్కారం పొందడం జరిగింది.


ప్రభుత్వేతర అవార్డులు 300 పైగా రావడం పురస్కారాలు సత్కారాలు పొందడం పుట్టిన ఓరుగల్లు బిడ్డగా మెట్టిన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయురాలుగా గర్వించదగ్గ విషయం.
రసప్లావితమైన హృదయ వీణ ఉద్వేగంతో నినదించినపుడు పలికే కవితా నిక్వాణం ఎప్పుడు చైతన్య భరితంగా ఉంటుంది. మానవ శ్రేయో చింతనను వ్యక్తం చేస్తుంది. వసంత కోకిలయై రాగాలు పలికిస్తుంది. ఆ ప్యాయత జల్లే అనురాగాన్ని కురిపిస్తూనే పరుగెత్తే గోదారి యై మనసులను ఆనందంతో తడిపేస్తుంది. సాంఘీక దురాచారాలు, మూడనమ్మకాలు, మత్తుపదార్ధాలు, తనదైన శైలిలో పిల్లలతో ప్రదర్శింపచేసి సమాజాన్ని మేల్కోలిపిన సాహిత్య శిఖరం తన మనసులో కలకలం రేపుతున్న ఎన్నో భావాలకు అక్షర రూపం నన్నపురాజు విజయశ్రీ రచనలు వీరి కవిత్వం అవధుల్ని చెరిపేసిన స్వచ్భమైన కవిత్వం, కథలు, రాసిన వ్యాసం వెలువరించిన నిజ జీవితపు దర్పణంగానే కనిపిస్తుంది. ఎదలోతుల్లోని అలజడుల నుండి ఎదుటి వారి భావాలను చదువగలిగే సున్నితమైన హృదయస్పందనలకే ఆమె కలం అక్షరాలతో జతకట్టిఅక్షర సేద్యం చేస్తున్నారు రచయితగా సమాజాన్ని మేలుకొల్పడమే ఆమెధ్యేయం భవిష్యత్తులో ఇంకా అనేక పుస్తకాలు ముద్రించి సమాజంలోకి తేవడం ఆమె ఆశయం అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు 6 ప్రభుత్వేతర పురస్కారాలు 300 పైగా అనేక సంస్థల చేత పురస్కారం పొందడం జరిగిందన్నారు. విశ్వసాహితి, జన్మభూమి, విశ్వ రచన, తొలిపొద్దు, జల కవితోత్సవం,పూల సింగిడి. హితైషి, సహచరి, అక్షరయాన్ కరోన పెద్ద గ్రంధం, విత్తన సదస్సు, అక్షరయాన్ డైరీలో స్థానం సంపాదించడం దొరవేటి, మేక రవీంద్ర, వైరాగ్య౦ ప్రభాకర్ , రఘు వీర్ ప్రవాప్ గార్లపై, డా. బండాసరోజన గారి పై అభినందన పత్రాలు జీవిత విశేశాలు వ్రాయడం జరిగింది. ప్రపంచ సభలలో పాల్గొని కవితాగానం చేయడం జరిగింది అన్నారు. సమాజం పై సాహిత్య ప్రభావం చాల వుంటుందని యువతను తొందరగా చైతన్యవంతులుగా తీర్చి దిద్దే అవకాశం వుంటుందని వారి స్వీయ అనుభవం వెల్లి బుచ్చారు.
ఉద్యోగం, కుటుంభం, సాహిత్యం, ఈ మూడింటిని సమన్వయం చేసుకోనే సందర్భంలో కర్తవ్య నిర్వాహణలో జాప్యం జరుగుతుందని సాహిత్యంతో ప్రయాణం చేసినపుడు ఉద్యోగ నిర్వాహణలో చాలా చాల ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించాలంటే కాలంతో కుస్తీ పడి కొంతకాలం సాహిత్యం కొంత ఉద్యోగం, కుటుంబం అయితే సులభంగా చేరే మార్గం సుగమవుతుందని అన్నారు. కుటుంబ సహకారం వుండదు. ఎవరో కొంత మంది అర్ధం చేసుకొన్న వారికే కుటుంబ సహాయ సహకారాలు వుంటాయి.
ఆదర్శ మహిళగా, కవయిత్రిగా, సామాజిక వేత్తగా మానవ హక్కులు, అవయవ దాన కార్యక్రమాలు, సావిత్రీబాయి పూలే కార్యక్రమాలలో E. C. మెంబర్ గా కొనసాగుతు సేవలు అందిస్తున్నారని తెలిపారు సామాజిక వేత్తగా మున్ముందు మరెన్నో అవార్డులు, రివార్డులతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్ధాం ! మనం గొప్పగా బ్రతకడమే గాకుండా మన చుట్టూ వున్న విద్యార్థుల జీవితం గొప్పగా తీర్చిదిద్ది వారిని సమాజానికి జ్యోతులుగా చేయడమే ధ్యేయంగా అనాధలకు అభాగ్యులకు, వృద్ధులకు, వికలాంగులకు తన వంతు ఆర్థిక చేయూతను సహాయ సహకారాలను అందిస్తూ తనలోని సేవా తృష్ణను గమనించిన ప్రభుత్వం 2013లో రాష్ట్రపతి చేత నేషనల్ అవార్డుతో సత్కరించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అస్త్రం …శస్త్రం… శాస్త్రం….

మన మహిళామణులు- తాడికొండ రాజేశ్వరి