హరిత హారం

పోయిన నెలలో మా అక్క మిమ్మల్ని అందరినీ కలిసిందట కదా!పసుపు రంగులో  కనిపించిందట !మరి నేనూ  మిమ్మల్ని కలవాలి కదా!అందుకని  నేనే స్వయంగా వచ్చాను అర్థం కాలేదా ?నేనండీ హరితవర్ణాన్ని. అదే ఆకుపచ్చ రంగుని.

అసలు పసుపుపచ్చ ఆకుపచ్చ కవలల వంటివి . జంట కవుల లాం టివి  .ఒకరిని వదిలి మరొకరం ఉండలేము  . నా గురించి నేనైతే బాగా చెప్పుకోగలనని పరుగు పరుగున వచ్చేసాను  .నాకు గొప్పలు  చెప్పుకోవడం ఇష్టం ఉండదు . కానీ అలా నక్కిన క్కి ఉండడం వల్ల నేను ఏంటో ఎవరికీ తెలియట్లేదు .అందుకనే  ఇలా మీ ముందుకు వచ్చాను .

మీకు తెలుసా ఆకుపచ్చ రంగు అంటే నేను . ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాను . చేతనా సుషుప్తి  అవస్థలకు  వారధిని  .

ఇవ్వాళ  చాలా విషయాలు మీతో ముచ్చటించాలి

ప్రకృతికి  ,సమృద్ధికి , శ్రేయస్సుకు నేను చిరునామాను . ప్రశాంతతను ఇస్తూనే  ,మానసిక ఉల్లాసాన్ని పెంచుతాను . అందుకే డాక్టర్ల రోజు కాసేపు పచ్చని  పొలాల వైపు చూడమంటారు .

ఎందుకంటే

పచ్చని ప్రకృతి మనకు సృష్టికర్త ఇచ్చిన అపురూప వరం . ప్రకృతిలోని చెట్లు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయ నిశ్శబ్దంగా . మన ప్రపంచాన్ని నయనా నందకరం చేస్తాయి  .ఫలభరితం , సుగంధ భరితం  ,రస రంజితం చేస్తాయి  .చెట్ల వల్ల  ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసు.

మనం చిన్న సమస్యలు ఎదురైన ఎదుటివారిదే తప్పు అని తప్పులెంచు తాం తమ తప్పులను చూసుకోకుండా . మరి చెట్లు   , ఎండకు ఎండి  ,వానకు తడిసి  ,చలికి ఆకులు రా ల్చినా  నాలుగు చినుకులు పడితే చాలు లేత చిగుళ్ళతో  నవ్వుతూ మనల్ని పలకరిస్తాయి .

ప్రకృతి  మానవజాతి ఆవిర్భావం నుండి మనకు నిశ్శబ్ద సహచరి  . మనకోసం అది  ఒక పర్యావరణ వ్యవస్థనే సృష్టించింది . తొలుత మనది వ్యవసాయక సమాజం  .ఋతువుల మారినప్పుడల్లా  పండుగలు , వేడుకలు చేసుకున్నాం.

నమ్మిన దేవునికి తులసి దళాలతో , బిల్వపత్రాలతో  ,పత్రి పూజతో ప్రార్ధనలు చేసుకున్నాం  .తామరాకులు , అరటి ఆకులు , మర్రి ఆకులు , బాదం ఆకులలో అడ్డా కు లలో భోజనాలు  చేశాము .

యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథం అరటి  ,బాదం ఆకులో భోజనం శ్రేష్టం అని చెప్పింది . ఇక శుభకార్యాలు , విందులైతే తమలపాకులు తప్పనిసరి  .

లేత చిగుళ్ల నుండి పండుటాకుల వరకు చెట్ల ఎదుగుదలలో ఎన్ని దశలు ఉన్నాయో పుట్టినప్పటినుంచి గిట్టే వరకు మన జీవితాల్లోనూ అన్నీ  దశలు  .

అయితే సరైన సమయం కోసం మళ్లీ చిగురు వేయడానికి ప్రకృతి సహనంతో ఎదురుచూస్తుంది మనం బుద్ధి జీవులం కదా! అందుకని అడ్డదారులు తొక్కుతాము  . ఈ విశ్వంలో ప్రతిదీ నాకు ఉపయోగం కోసమే అనే దురహంకారంతో  ,అత్యాశతో ప్రకృతిని ప్రేమించడం మాని  ,విచ్చలవిడిగా వాడుకోవడం మొదలుపెట్టి కాంక్రీట్ అరణ్యాలు సృష్టించేసాం . పైపెచ్చు మాయదారి కాలం అని కనిపించని కాలాన్ని ఆడిపోసుకోవడం అలవాటు చేసుకున్నాం .

హిందూ సంప్రదాయంలోఐతే  లక్ష్మీదేవికి  ,సౌభాగ్యానికి  ,పంటల సమృద్ధికి నేను గుర్తు . కొత్త జీవితానికి , ప్రకృతితో సామరస్యానికి ప్రతీకను .

అనాహత చక్రాన్ని ఆకుపచ్చ రంగుతో సూచిస్తారు  .

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేను బుధ గ్రహానికి చెందిన దాన్ని . నా రంగును వివిధ కార్యకలాపాల్లో వాడడం వల్ల వ్యాపారంలో లాభాలు పెరుగుతాయని నమ్ముతారు .

వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లల్లో మొక్కలు పెంచడం మంచిది.  సానుకూల శక్తిని పెంచుతానని ఆ శాస్త్రం చెప్తోంది .

ఇస్లాం మత విధానంలో నేను మహమ్మద్ ప్రవక్తకు ఇష్టమైన రంగును  . ఆయన ఆకుపచ్చని అంగీ  ,తలపాగా ధరించేవారట  .ఖురాన్ ప్రకారం స్వర్గంలో ఉండేవారు పచ్చని వస్త్రాలను ధరిస్తారు .

క్రైస్తవ మతంలో నేను ఆశకు విజయానికి గుర్తును  .చర్చి క్యాలెండర్లో ఆర్డినరీ టైంలో ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఉపయోగిస్తారు .

బౌద్ధధర్మం  ప్రకారం  నేను సమతుల్యతకు క్రియాశీలతకు చిహ్నం .

సిక్కు  సంప్రదాయం లో లో సంతానోత్పత్తి  ,దైవిక దయకు గుర్తును .

సంస్కృతంలో నన్ను  హరితః  ,పలాసః  శ్యామః అంటారు .నాలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి నీలా హరి  ,గాఢమైన ఆకుపచ్చ  ,మరకత పచ్చ , సీమంత పచ్చ  , చిలకకు పచ్చ  ఇలా ఎన్నో  .ఇంగ్లీషులో అయితే ఫారెస్ట్ గ్రీన్ , మింట్ గ్రీన్ , సి గ్రీన్ లాంటివి  . ఆకుపచ్చలో మానవ నేత్రం గుర్తించగలిగిన షేడ్స్ దాదాపు 350 అని పెద్దలంటారు .

అందరికీ ఆకుపచ్చ అనగానే గుర్తుకొచ్చేవి పచ్చలు  . అదేనండి ఎమరాల్డ్ అంటారు ఇంగ్లీషులో  .ఇది  విలువైన రత్నమ్  . మే నెలలో పుట్టిన వారికి  అదృష్టాన్ని ఇస్తుందని  నమ్ముతారు . అందాన్ని ఇస్తుంది  ఎవరికైనా అని నేను నమ్ముతాను  .ఇది  వజ్రం కంటే అరుదుగా దొరుకుతుంది  . అందుకే ఖరీదు ఎక్కువ .ఇది  మూడు బిలియన్ సంవత్సరాల క్రితం దట శాస్త్రజ్ఞులు చెప్పారు  .

.ఇం తవరకు నాకు తెలియదు .

పచ్చను  ధరిస్తే ప్రేమ కరుణా సానుభూతి పెరుగుతాయట  .

మరి ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా?

ఈజిప్ట్ రాణి క్లియోపాత్రకు పచ్చలంటే చాలా ఇష్టం .అవి  సంతాన ఉత్పత్తిని పెంచుతాయ ని పునర్జన్మను సూచిస్తాయ ని ఆమె నమ్మేది  .

ప్రపంచంలో  నాణ్యమైన పచ్చలు కొలంబియా నుండి వస్తాయి  .  పచ్చలను 20, 35, 55వ వివాహ వార్షికోత్సవాలలో బహుకరించడం ఒక సంప్రదాయం

అతి పెద్ద పచ్చ ఎక్కడుందో తెలుసా?

దాని పేరు మొగల్ ఎమ రాల్డ్  .20017.80 క్యారెట్ల బరువు ఉంటుంది . 17వ శతాబ్దికి చెందింది

ఇం  కొన్నింటిని చెప్తా !

స్పటిక వైద్య విధానంలో ఇవి ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తాయని  ,శారీరకత రుగ్మతలను తగ్గిస్తాయని అంటారు  .

యూరప్ లో రాజుల తలపాగాలపై సగర్వంగా చేరింది పచ్చ .

ఇక్కడ పచ్చల నుంచి ఆకుపచ్చలోకి వచ్చేస్తున్నాను మళ్ళీ .

వాస్తు ప్రకారం ప్రతి వారానికి ఓ రంగు ఉంటుంది అలా బుధవారానికి ఆకుపచ్చ గుర్తు  .

మరి శాస్త్రజ్ఞులు నా గురించి ఏం చెప్పారో తెలుసా?

నేను చాతుర్యానికి అభ్యాసానికి ప్రతీకనట  .పిల్లల గది గోడలకు నా రంగు వేస్తే వారు నేర్చుకునే వేగం జ్ఞాపకశక్తి మెరుగుతాయట

నా గురించి ఇన్ని విషయాలు చెప్పాక నన్ను ఇష్టపడే వారి గురించి నాలుగు మాటలు చెప్పకుంటే ఈ వ్యాసం అసంపూర్ణమైపోతుంది కదా !

అందుకనే  ఆకుపచ్చ రంగును ఇష్టపడే వారి లక్షణాలు ఎలా ఉంటాయో  తెలుసుకుందాం  .

.వీరు  నేల విడిచి సాము చేయరు . గొప్పలకు పోరు  .తమ  గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఇష్టం వారికి  .తమ కష్టానికి తగిన గుర్తింపు రావాలనుకుంటారు .ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు  .

నేను మనసును చల్లబరుస్తాను. కుదుట పరుస్తాను  .జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు.   . నేను ఆరోగ్యానికి చిహ్నం  .నన్ను ఇష్టపడేవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తారు  .ఆశావాదంతో స్నేహశీలిగా ఉంటారు  .ముక్కుసూటిగా ఉంటారు కూడా .

మొదటిసారిగా మిమ్మల్ని కలుస్తున్నాను కదా అందుకనే ఎన్నో చెప్పాలనిపిస్తుంది . నా  విషయాలు నేను కాక మరి ఎవరు చెప్తారు

అందుకే మరిన్నిసంగతులు  ఇప్పుడు .

*నన్ను ట్రాఫిక్ సిగ్నల్ లో రైల్వే ఓడల సూచికల్లో వాడతారు .

*  ప్రపంచవ్యాప్తంగా నేను సేఫ్ కలర్ గా గుర్తింపబడ్డాను  .అందుకే ఫస్ట్ ఎయిడ్ సామాగ్రి నా రంగులో ఉంటుంది .

* చాలా దేశాల్లో అగ్ని ప్రమాద సమయాల్లో వాడే సూచికలు నా రంగులోనే ఉంటాయి.

* రాత్రిపూట పెట్టుకునే చలువ కళ్లద్దాలు నా రంగే  .

*కార్టూన్లలో అనారోగ్యంగా ఉన్న ముఖానికి నా రంగే వేస్తారు .

* ఉత్తర అమెరికాలో షేర్ల ధరల పెరుగుదలను సూచించడానికి గ్రీన్ కలర్ వాడతారు  .

* అదే తూర్పు ఆ సియా దేశాల్లో షేర్ల పతనానికి నన్ను వాడుకుంటారు .

*క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఫర్టిలిటీకి గుర్తుగా వెడ్డింగ్ గౌన్  నా రంగులోనే ఉండేది  .

* ఐర్లాండ్ దేశానికి జాతీయ రంగును నేను .

* ఆనందానికి వసంతాగమనానికి గుర్తు ను  .

*రక్తం మరకలను నల్లగా చూపి భయాన్ని తగ్గిస్తానని ఆసుపత్రుల్లో వాడుతారు  .

* నా రంగుతో ఉన్న ఆకుకూరలు కూరగాయలు రక్తపోటు నియంత్రణకు మేలు చేస్తాయి

నన్ను మీ నిత్యజీవితంలో వాడడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

నేను ప్రాణ శక్తిని క్రమబద్ధం చేస్తాను  .

మనసుకు శరీరానికి స్వస్థతను ఇస్తాను  .

నరాలను కండరాలను చురుకుగా ఉంచుతాను  .

రక్తాన్ని శుద్ధి చేస్తాను  .

ఒక్క మాటలో చెప్పాలంటే

నేను ప్రకృతికి ప్రతీకను  .

సృష్టికి ప్రతిరూపాన్ని

మీ ప్రియమైన నేస్తాన్ని

Written by Vijaya Kandala

నా పేరు విజయ కందాళ.
35సంవత్సరాల బోధనానుభవం.ఫోటోగ్రఫీ,యాత్రా సక్తి నా హాబీలు.నీహారిణి గారి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి ప్రవేశించాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హృదయ వీక్షణ

ఒడిపిళ్ళు 28వ భాగం