ఆమె ఓరచయిత్రి గాయని సకల కళాప్రపూర్ణ అన్నపూర్ణ గారు.సొంతంగా తనచేత్తో రకరకాల బొమ్మలకు ప్రాణం పోసి కళాస్రష్ట గా కీర్తి ప్రతిష్టలు పురస్కారాలు పొందారు.ఆమె మాటల్లో తెలుసుకుందాం.

“నేను పుట్టినది పశ్చిమ గోదావరి జిల్లాలోని గొల్లలు కోడూరు లో! అమ్మ నాన్నలు సూరంపూడి సుబ్బలక్ష్మి రామమూర్తి గార్లు.అమ్మ నాకు స్ఫూర్తి దాత!ఇంటర్ హిందీ పరీక్షలు పాసై 15ఏళ్లు టీచర్ గా చేశాను.రచయిత్రి కవయిత్రి గాయని సోషల్ వర్కర్ గా రాణించడానికి కారణం నాభర్త పిల్లల ప్రోత్సాహం.నాచేతిలో నా భావాలతో తయారు ఐనా బొమ్మలు ఈ టివి వనితా టీవీ లో నాపరిచయం తో గుర్తింపు పొందాను.భక్తి టివి వారు నిర్వహించిన బొమ్మలకొలువు పోటీల్లోవరుసగా 2సం. జంటనగరాల్లో ఉత్తమ బహుమతులు అందుకున్నాను.ఇక ఆధ్యాత్మిక సామాజిక అంశాలపై నారచనలు వివిధ పత్రికల్లో వచ్చాయి.2018లోమిసెస్ ఇండియా తెలంగాణ బ్యూటీ కాంటెస్ట్ లో రన్నరప్ క్రౌన్ తానా వారి కల్చరల్ ఫెస్టివల్ లో రన్నరప్ క్రౌన్ పొందాను.భారతమహిళాశిరోమణి అవార్డు మనతెలుగుతేజం సాహిత్య రత్న జాతీయ మహిళా రత్న ఉగాది పురస్కారాలు పొందాను.కవిసమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం దక్కింది.యుట్యూబ్ ఛానల్ “వెలుగు వైపు కి ప్రయాణం లో”నా ప్రవచనాలు ప్రజా దరణపొందాయి.సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తాను.లయన్స్ క్లబ్ లో 2ఏళ్లు ప్రెసిడెంట్ గా ఉన్నాను.ధనుర్మాసంలో ఇంట్లో గోదాకల్యాణం నిర్వహించి అందరినీ పిలుస్తాను.ఇక నా బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బు ని దివ్యంగులకి వృద్ధులకి పేదపిల్లలచదువుకి సద్వినియోగం చేస్తాను.పెయింటింగ్ పెన్సిల్ డ్రాయింగ్ వచ్చు.

స్కూల్ కాలేజీ లకి వెళ్లి విద్య నడవడి క్రమశిక్షణ మొదలైన విషయాలు పై ఉపన్యాసాలు ఇస్తాను.50ఏళ్లు దాటాకే అసలైన జీవితం ప్రారంభం అని నా ఉద్దేశం.యు.ఎస్.లో బెంగళూరు లో ఉన్న మా అబ్బాయిల దగ్గర కొంత కాలం గడిపివస్తాను ” . నిజంగా ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అన్నపూర్ణ గారు అతివ లందరికీ ఆదర్శం అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.చదువు మాత్రమే జీవితం కాదు.కళలుసంఘసేవకూడా తరుణి లో ఒక భాగమే! ఆమె కి శుభాభివందనాలు తెలుపుతోంది తరుణి
ఇన్ని ప్రత్యేకతలకు తోడు బొమ్మలు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని దివ్యాంగులు, వృద్ధులు, పేద పిల్లల సంక్షేమానికి ఉపయోగించడం బంగారం వంటి మీ వ్యక్తిత్వానికి పరిమళం అలదినట్లుగా ఉన్నది?