స్వగతం – నా మనోగతం

కవిత

 వై.అరుంధతి

కవిత రాయాలన్న నా ఆశ
ఎపుడో చిననాట తొంగి చూసెనో దశ
కాల గర్భంలో కలిసి పోయెనే ఏదిశ
అణిచి వేయబడిన ఆవేశం
మళ్ళీ ఇన్నాళ్ళకు అంది వచ్చెనా అవకాశం.
పొందుపరచనా కవితాకోశం
పరితపించే నాహృదయం
ఎలా అణచుకోను ఈ అంతర్మధనం.
ఉరకలు వేసే నా ఉత్సాహం
అంతలోనే ఓ నిరుత్సాహం
దేనికోసం ఈ ఆరాటం
ఏమిటో ఈ పరితాపం
చేరుకుందునా నా కలల తీరం
అంతా అగమ్య గోచరం
అపుడే లేచెను ఓఆలోచనా కెరటం
అందించెను ఓ సందేశం
దిగులు చెందకు నేస్తమా
కదలి సాగుము సంద్రంలా
మునిగి పోకుమా మిత్రమా
ఆందోళనలా సుడి గుండంలో,
మబ్బులు వీడిన సూర్యునిలా
విజృంభించుము వెలుగు కాంతులై
కరుగనీయకు నీ కలా
జాలువారనీ జావలులై .
అగుపించేనా ఆశల దరి
ఎదురు చూద్దామ్ ఏమోమరి

Written by Y. Arundhati

Y.ARUNDHATI.
NIZAMABAD.
8639617444

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మేలుకున్న మానవత

దొరసాని