సంక్రాంతి రాక

కవిత

రాధిక మంగిపూడి

గొబ్బిళ్లు ముగ్గులు పందిళ్ళు పూవులు
మామిడాకుల నడుమ ధాన్యంపురాశులు
గంగిరెద్దుల ఆట హరిదాసు పాటతో
పసుపుకుంకుమల వలె కలిమినుండవలె.
దినకరుడు దిశమార్చ, శశిధరుడు కృపజూప,
మంచి తలపులు నేడు ఉదయించుగాక.
సద్భావమే నడుపు సన్మార్గములయందు
సద్భాగ్యముల కూర్చు సంక్రాంతి రాక

హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు

Written by Radhika Mangipudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇప్పటి అవసరం

సంక్రాంతి సంబరం