ఇద్దరు మనుషులను కలిపే మూడుముళ్ల బంధం
రెండు మనసులను కలిపే మానసిక అనుబంధం
సగాలు రెండు ఒకటై సాగే ఏడ డుగుల సంబంధం
ఇరుకుటుంబాలను ఏకం చేసే సామాజిక జీవనం
సవ్యంగా గడిచినంత కాలం సంబరాల సంకురాతిరే
సజావుగా సాగినంతకాలం సరస సల్లాపమే
అడుగులు తడబడితే
తలపులు పొరబడితే
అంతరంగ తిరుగుబాటే
వ్యవహారం గడప దాటితే
కథ కంచికే
పసుపు దారాల మాటున బుస కొట్టే విషనాగులెన్నో
పందిరి నల్లుకున్న లతల వెన్నంటే కాలనాగులెన్నో
క్షణక్షణానికీ బిగుసుకునే పసుపు తాడు
ఊపిరాడనివ్వదు
ఉసురు తీయనివ్వదు
కలహాలు విరహాలు కలగలిసిన అనురాగ సంగమం
కరి మింగిన వెలగపండే
అందని మానిపండే
సంప్రదాయ సంకెళ్లల్లో వ్యక్తిత్వ ఖ ననం
సామాజిక కట్టుబాట్లల్లో స్వేచ్ఛాహననం