నువ్వు కొన్న ప్రతి వస్తువుకి
ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది
నీవు కొన్న ఒక ఇంటికి
ఎక్స్పైరీ డేట్ వస్తుంది
నీవు కొన్న కారుకి
ఎక్స్పైరీ డేట్ ఉంటుంది
నీవు కొన్న కూరలకి
ఎక్స్పైరీ డేట్ ఉంటుంది
నువ్వు కొన్న మందులకి
ఎక్స్పైరీ డేట్ ఉంటుంది
నువ్వు ఎంచుకున్న ప్రతిదానికి
ఎక్స్పైరీ డేట్ ఉంటుంది
అది మరిచిపోయి
జీవిస్తున్న నీకు
నీ శరీరమే చెబుతుంది
నీ ఎక్స్పైరీ డేట్ ని
అయినా మార్పు రాకపోతే
ప్రకృతి ఎక్స్పైరీ డేట్ ప్రకటిస్తుంది