ప్రేమికుల రోజు

కవిత

సృష్టి అంతా నిండిన అద్భుత మకరందం ప్రేమ..
భాషలు వేరైనా భావం ఒక్కటై నట్లు
దేశాలు దూరం అయినా శ్వాస ఒక్కటై నట్లు….
హృదయాల సవ్వడికి సరిహద్దులు లేనట్లు…
కానీ మానవుడు గమనించడు.. స్వార్థంతో…
ప్రకృతి అంతా ప్రేమమయమే..
నిస్వార్ధ ప్రేమే నిమిడియున్నది అంతా ..
దానికి పరిధిలు లేవు… భాష లేదు…కుల మతాలు చూడదు….
సూది దారం లా అందరినీ కలుపుతుంది…..
కురిసే ప్రతి వాన చినుకులోను ప్రేమ ఉంది..
ప్రేమకు ఆకారం లేదు…. రంగు లేదు….
కానీ అంతటా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది
చావు పుట్టుకలలేని శాశ్వత నిధి……
. పూసే పువ్వులోను… కురిసే వెన్నెలలోనూ..
ప్రేమే స్నేహంగా మారుతుంది.. బంధువుని కూడా చేస్తుంది
ఆకాశమంత విశాలమైనది ఈ ప్రేమ…
పంచడానికి నీకు మనసుండాలిగాని…..
. ఒకరినొకరు అర్థం చేసుకునే చోట… ప్రతిరోజు (ప్రేమికుల రోజే ) ప్రేమ నిండిన రోజే…
విశ్వజనీనమైన గుణం.. .ప్రేమ
ప్రేమ ఉన్నచోట ఇలలోన శాంతి…..
పరములోన సుఖం..

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శ్రీకళాంజలి _ అంజలి

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)