ప్రవాస వంగీయబ్రాహ్మణ వంశానపుట్టి
అఘోరనాథ వరదసుందరులకు
మొదటి పట్టి
జాతీయ చిహ్నమనగా సరోజిని యను పేరుపెట్టి
ఆంగ్లభాషా భ్యసనంపై మనసుపెట్టి
చదువుసంధ్యల ఆరితేరినట్టి
ద్వాదశవర్షప్రాయాన ప్రతిభచూపినట్టి
ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనట్టి
త్రయోదశవర్షాన అన్నివందల పంక్తుల కవిత కట్టి
అమోఘశక్తితో అబ్బురపర్చినట్టి
నౌకపై విదేశంలో అడుగుపెట్టి
ఆంగ్లగురువుల మనసుకొల్లగొట్టి
ప్రాచ్య సంస్కృతికి పీఠం పెట్టి
భరతఖండ స్వాతంత్య్రంకై బల్లకొట్టి, స్వదేశీ ఉద్యమానికై నడుం కట్టి
గాంధీజీ శిష్యురాలై అడుగు పెట్టి
గోవిందరాజులనాయుడు చేయిపట్టి
ముత్యాలవారింట మెట్టెల కుడికాలు పెట్టి
కాపురానికై చక్కని ఇల్లు కట్టి
బంగారువాకిలి అని పేరుబెట్టి
ముగ్గురు సంతానానికి ఊయల కట్టి
భారత దేశ తొలి మహిళా గవర్నర్ పదవి చేపట్టి
పలురంగాల్లో తొలిమహిళ
అనిపించు కున్నట్టి
నీజన్మదినం మహిళాదినంగా
గుర్తింపు కల్గినట్టి సుదినాన మా మహిళా కళాంజలి
అంజలి పట్టె