మహిళా దినోత్సవ ఆనందం

నీలా నిర్మలం కాలమ్

నా మొదటి post
తరుణి లో
Women’s day తో ఆరంభించడం బాగుంది నాకుఁ!

Happy Women’s Day.

నిజం చెప్పాలంటే అన్ని రోజులు స్త్రీవే కదా!
ఇంటిలో ఆఫీస్ లో
వివిధరంగాల్లో చక్రం తిప్పేది మనమే కదా
గుర్తింపుకోసం
ఎదురుచూడకుండా
బాధ్యతగా ప్రేమగా
కుటుంబంకోసం అలుపు లెక్కచేయక
ఆరోగ్యం పణం పెట్టి
అవిశ్రాంతంగా పనిచేసేది స్త్రీ నే కదా!
తన శక్తీ తో పాటు దైవం ఆశీస్సులు కూడా కోరుకుంటూ
పూజలు చేసేది స్త్రీనే కదా!
గుడికి ద్వజస్థంభంలా
ఇంటికి కూడ స్త్రీ నే కదా!
తల్లిగా ,చెల్లిగా, అక్కగా, కూతురుగా, కోడలిగా ప్రతి ఇంటా
స్త్రీస్థానం ముఖ్యమైనదే !
ఎన్నో పాత్రలు జీవితంలో అవలీలగా
పోషించే స్త్రీకి కూడ ఒక గుర్తింపు ఒక ఆటవిడుపు అప్పుడప్పుడు అవసరం!
అందుకోసమే ఈ స్త్రీ దినోత్సవ పండుగ!
ఇంటి స్త్రీలకు కుటుంబం ప్రేమతో సత్కారం చేయటం బాగుంటుంధి చాలా!

కుదరకపోతే మిత్రులతో కలిసి మనకోసం మనమే ఒక పండుగ జరుపుకోవటం కూడ బాగుంటుంది!
ఒక టానిక్ లా, ఒక స్ట్రెస్ బస్టర్ లా ఉపయోగపడుతుంది!
నిత్య జీవిత గమనంలో మార్పులేని, మోయలేని బాధ్యత లతో విసుగు చెందిన మనసుకి మంచి విరామం ఈ రోజు సందడి!
నెలకి ఒక రోజు కిట్టీ పార్టీ, సంవత్సరానికోసారి ఉమెన్స్ డే వేడుక జరుపుకుని ఆనందించిన గతపు ముచ్చట్లు ఇప్పటికీ నాకుఁ ఉత్సాహం పెంచే మంచి జ్ఞాపకాలే!

స్త్రీ ఓర్పు, నేర్పుతో తనని తాను మెరు గుపరుచుకుంటూ, కుటుంబానికి చుక్క్తానిలా , కష్టకాలంలో హెర్కులస్ లా ఉంటుంది!
ఒక దేశ సరిహద్ధుల్లో సైన్యం పహారా కాసి రక్షించినట్లే స్త్రీలు కూడ కుటుంబానికి రక్షణ కవచాలు!
పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్త్రీ అబలలా ఆధారపడటం ఆనందిస్తుంది!
అదే స్త్రీ ప్రతికూల పరిస్థితుల్లో తానే ఒక సైన్యం గా మారి కష్టాలతో యుద్ధం చేసి కుటుంబాన్ని కాపాడుతుంది!
సబలగా శక్తిగా మారుతుంది!
అక్కడక్కడా పిరికితనంతో నిష్క్రమించే అబలలు ఉన్నా దైర్యంగా, ప్రతిభతో జీవితాన్ని ముందుకు సాగించే పరిపూర్ణ మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు!

ప్రతిరోజూ పనులు, బాధ్యతలు అంటూ పరుగులు తీసే మహిళల జీవితానికి
అప్పుడప్పుడూ మార్పు, వినోదం, మనకోసం ఏమన్నా చేసుకుందాం అనే ఉత్సాహంతో ఇతర మహిళా మిత్రులతో or కుటుంబంతో కలిసి చేసుకునే ఈ women’s day వేడుక ఒక స్ట్రెస్ బస్టర్, ఒక టానిక్ లాటిది!
ఒక రోజు మనని మనం ఇలా గారాం చేసుకోవటం, ఇష్టంగా గడపడం బాగుంటుంది కదా !
ఉత్సాహపు బాటరీ ఛార్జింగ్ చేసుకుంటే మళ్ళీ మన విధులు మనం చురుగ్గా నిర్వర్తించుకోవచ్చు!
పెద్దలు కుటుంబాల కలయిక, సంతోషం కోసం పండుగలు పెడితే ఆధునిక యుగంలో మనం కిట్టీలు, ఉమెన్స్ day లు, మదర్స్ డే లు సెలెబ్రేట్ చేసుకుని ఆనందించడం అలవాటుగా మారింది!

Written by Nila Madala

హాయ్ అండీ
నాన్న పెట్టిన పేరు నిర్మల!
చిన్ని గ్రామం నుండి విజయవాడ నగరం కి చదువుకోసం వచ్చి సైన్స్ పట్టభధ్రురాలినయ్యా!
బాధ్యతల బంధాలలో ఏడు పదుల జీవితం అనుభవం!
అమ్మ వియోగం మర్చిపోటానికి రెండు దశాబ్దాలుగా నా అంతరంగ బావోద్వేగాలను అక్షరాల్లోకి అనువదించడం అలవాటుగా మారింది!
జ్ఞాపకాలను, వర్తమాన వాస్తవాలను స్వగతంలా , సరళంగా రాయటంలో నాకుఁ సాంత్వన దొరికింది!
జీవితం పట్ల అవగాహన, ఉత్సాహం పెరిగింది!
13 ఇయర్స్ నుండీ FB లో Nila Madala Id తో లలితాంజలి శీర్షిక లో నిత్యం నా వివిధ భావనలు సంక్షిప్తంగా స్నేహితులతో పంచుకోవటం ఒక మంచి వ్యసనంగా మారింది!
మిత్రులకు నచ్చి నన్నో ఇన్స్పిరేషనల్ వుమన్ స్థానంలో నిలబెట్టారు!
ఎన్నో ప్రతిభల సముద్రంలో నేనో నీటి బొట్టు!
మంచి బుక్స్ చదవటం, మంచి
సినిమాలు చూడటం, గుడికి వెళ్ళి దేవునికి నమస్కార కృతజ్ఞతలు తెలుపుకోవటం ఇప్పటి ప్రాజెక్ట్!
ఫ్యాషన్స్, రాజకీయాల నుండీ ఫిలాసఫీ వరకు అన్నీ ఇష్టమైన సబ్జక్ట్స్ నాకు!
ఎప్పుడూ నిజాయితీగ, నిగర్వంగా ఉండటమే ఇష్టం!
అదే నా సంపద!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆమె నా దేవత- అమ్మ

మహిళా జోహార్