విశ్వ నియమాలు – మహిళలు

కవిత

మహిళల్లారా,
వెలుగుల వాకిలి మీరే… జీవన దీప్తి మీరే!
పంచభూతాలకు చేరువగా బ్రతకండి మహిళలారా,
భూమిలా సహనం,
నీటిలా కరుణ,
అగ్నిలా ధైర్యం,
గాలిలా స్వేచ్ఛ,
ఆకాశమంత విశాల హృదయం కలిగినవారై నిలవండి
మీ నవ్వు ఒక శక్తి,
మీ మాట ఒక మంత్రం,
మీ సంకల్పం ఒక సృష్టి –
విశ్వ రహస్యాలు మీలోనే నిక్షిప్తమై ఉన్నాయి
అమ్మగా అక్షరాలు నేర్పే ఆదిశక్తి మీరు,
అక్కగా ఆత్మవిశ్వాసం నింపే ఆరాధ్యరూపం మీరు,
భార్యగా బలం,
కూతురుగా కాంతి,
సమాజానికి సంస్కారాన్నిచ్చే సంస్కృతి మీరు
విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు తెలుసుకొని,
సంకల్పంతో ముందడుగు వేయండి,
కర్మతో కీర్తి పొందండి,
ప్రేమతో ప్రపంచాన్ని ఆలింగనం చేయండి
పంచభూతాలతో అనుబంధం పెంచి
మనసు శుద్ధి చేసుకోండి,
చక్రాలు సమతుల్యం చేసుకుని
చైతన్య జ్యోతి వెలిగించండి
మీరు నడిస్తే మార్గం వెలుగుతుంది,
మీరు నిలిస్తే సమాజం నిలుస్తుంది,
మీరు మెరవగానే ప్రపంచం మెరుస్తుంది.
విశ్వ నియమాలు పాటించండి మహిళల్లారా
మీ జీవితం ఒక మహోత్సవం కావాలి
మీ ఆత్మశక్తి ప్రపంచానికి ఆదర్శం కావాలి!
మహిళా శక్తి లోకానికే శక్తి!

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా జోహార్

వ్రజేంద్రా నందన