నాన్నతోనే నా గమనం

కవిత

నాన్న నువ్వు గుర్తుకు రావడమేంటి నా ప్రతి అడుగులో దాగున్న గురుతువే నీవైతె…

నీవు కళ్ళముందు లేవని తలిచినప్పుడల్లా
నాశ్వాస ఎంత బరువౌతుందో….

నిన్ను అక్షరంగా మలచడమంటె ఆకాశాన్ని కాగితంగా చేయాలేమో నాన్న….

నా ప్రతి గమనంలో నీ ప్రేమ.. త్యాగం ..బాధ ..సంతోషం అన్నీ నిండుకుని నాకు ఊపిరినిచ్చాయి….

నిన్ను కవితగా ఎలా మలచాలి నాన్న
నా భావాలలో నిండి నా ఊహలకు ఉప్పెనవై
నా కవనతీరానివే నీవై నన్ను ఉవ్వెత్తున ఎగిసే కెరటంగా మార్చిందే నీవైతె …

నా కలం ఈ ఒక్కరోజు నీకై అక్షరాలను తడిపి నీపాదాలను కడిగి తన తపన తీర్చుకున్నా…

నా ప్రతి కవితాసుమంలోని పరిమళానివే నీవు నాన్న

Written by vakula vasu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన-14

 సింధూరపు వన్నెలు