మన మహిళామణులు- తాడికొండ రాజేశ్వరి

ఈశ్వర్ కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకురాలు

రాజేశ్వరి తాడేపల్లి గూడెంకి చెందిన నృత్య కళాకారిణి. ఎం.బి.ఎ.చదువుని సగంలోనే మానేశారు.తండ్రి సైంటిఫిక్ కంపెనీలో పనిచేశారు.అమ్మ నాన్నలకి ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు.రాజేశ్వరి పెద్ద కుమార్తె.మచిలీపట్నం అనిబిసెంట్ శిశువిద్యామందిర్ లో 10వక్లాస్ దాకా చదివారు.తెలుగు అంటే చాల ఇష్టం.ఆటపాట డాన్స్ లో ఈమెకే బహుమతులు.తల్లి వైపు వారు సంగీత కళాకారులు.కీ.శే.విజయశ్రీ భాగవతారిణి హరికథలు చెప్పడంలో దిట్ట. రాజేశ్వరికి ఆమె పెదతల్లి.బి.కాం.పాసైన రాజేశ్వరి ఆరోజుల్లో ఫ్రీగా డాన్స్ నేర్పిన వేదాంతం సత్యనారాయణ గారివద్ద నృత్యం నేర్చుకోటం, ఆపై వెంపటి చినసత్యం గారివద్ద 10ఏళ్లు నేర్చుకున్నారు.తాడేపల్లి గూడెంలో ఆయన దగ్గర బాగా నృత్యంలో మెలుకువలు నేర్చుకున్న ఆమె పెళ్లి కావటంతోహైదరాబాద్ లో స్థిరపడ్డారు.ఇద్దరు కూతుళ్ల పెళ్లి కావటంతో ఆమె భర్తతో కల్సి న్యూమార్క్ కిడ్స్ స్కూల్ కూడా నడుపుతున్నారు.3వక్లాసుదాకా ఆబడి నడుపుతున్న ఆదంపతులు బేబీ కేర్ సెంటర్ కూడా నడపటంవిశేషం.

రాజేశ్వరి పగలు బడి పిల్లలకి పాటలు పద్యాలు శ్లోకాలు నేర్పుతారు.సాయంత్రం 6_8 దాకా బైక్ పై 3 బ్రాంచీల్లో డాన్స్ నేర్పిస్తారు.ఈమె తన డాన్స్ పిల్లల తో దేశంలో ప్రదర్శన లిస్తున్నారు. కాశీ,అయోధ్య, షిర్డీ బాసర శ్రీశైలంలో 30మంది పిల్లలతో ఆమె ప్రదర్శనలు జనాల మెప్పు పొందాయి.ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
బి.జె.పి.కల్చరల్ సెల్ కన్వీనర్ గా
మేడ్చల్ జిల్లాలో తన సేవ అందిస్తున్నారు.హిందూ ధర్మంకి సంప్రదాయాలకి దేశానికి సంబంధించిన థీమ్ ఇస్తారు.దాని ప్రకారం రాజేశ్వరి డాన్స్ కంపోజ్ చేస్తారు.పాటలు కూడ వారే ఇస్తారు కాబట్టి కొరియోగ్రఫీ ని ఈమె నిర్వహిస్తారు.ఈమె హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇక ఈమెకువచ్చిన అవార్డులలో ముఖ్య మైనవి కీ.శే.రోశయ్య గారిద్వారా బంగారు కంకణం నాట్యమయూరి బిరుదు పొందారు.

తండ్రి శ్రీ సుబ్బారావు గారు
తల్లి శ్రీమతి జయమ్మ గారు.
న్యూమార్క్ కిడ్స్ ప్రీ స్కూల్ ని హస్బెండ్ శ్రీ సుబ్బరాయ శాస్త్రి గారితో కలిసి. గత 15 సంవత్సరాల నుంచి విజయ వంతంగా నడుపుతున్నారు
9 నెలల పిల్లల నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన నైతిక విలువలతో చక్కని విద్యను అందిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు-నన్నపురాజు విజయశ్రీ

పరస్పరం