మావయ్య బంగారం!-2

ధారావాహిక నవల

మూఢ నమ్మకాలూ -2

జరిగిన కథ: చిన్న పిల్ల కళ అమ్మొమ్మ తాతయ్యలదగ్గర గుడ్లేరు లోనే పెరుగుతుంది. ఆమెకి వల్లే ప్రపంచం, మావయ్య సురేష్ బాబు అంటే మరింత ఇష్టం. అనుకోకుండా కళఒకసంఘటన కి బెదిరిపోతుంది. అదే ఆమెకి ఒక శాపంగా మారుతుందని అమ్మొమ్మకి కూడా తెలియదు.అవే పల్లెలో ముదిరిపోయినా ఆ సంఘటన తరువాత అమ్మమ్మ కళను బయటికి పంపడం మానేసింది. కొద్దిరోజులు పోతే దానికివేవీ గుర్తుండవు అనుకుంటూ.ఆ రోజు తెల్లారితేమంగళవారం అమావాస్య అంత మంచి రోజు కాదని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకని ఏ కొత్త పనులు కూడా మొదలుపెట్టరు అలాంటి రోజున. ఈసారి అమావాస్యగడియలు రాత్రి రెండు గంటలకే వచ్చేసాయి. పక్కనే నులక మంచంలో పడుకోనున్నకళ నుండి గురక శబ్దంరావడంతో, ఆరు బయట పడుకున్నది కదా తెల్లవారుజామున చల్లదనం కాస్త ఎక్కువే, ఈపిల్ల దుప్పటి కప్పుకోదు, అనుకుంటూ, “లేవే కళ దుప్పటి కప్పుకో,” అంటూకళ మీదచెయ్యి వేసింది అమ్మమ్మ. ఒళ్లంతా కాలిపోతున్నది. కళ స్పృహలో లేదు.అమ్మమ్మ కు అనిపించింది ఏదోముల్లు గుచ్చుకున్నదిఅన్నది, దాని సంగతే మర్చిపోయాను,అనుకుంటూకిరసనాయిలుదీపం తీసుకొచ్చి కళ కాళ్ళ వైపుగా పెట్టి చూసింది.కుడి అరికాల్లో ఒకచోట నల్లగా మాడి రక్తం ముద్ద కట్టినట్లుగా కనిపించింది.వెంటనే అమ్మమ్మ పసుపు సున్నం కలిపి తన ఉతికిన పాత చీర నుండి ఒక పొడవాటి ముక్కని చింపిఎరుపు వేసి కట్టు కట్టింది నొప్పితో కళ మూలి గింది.

మరునాడు ఉదయాన్నే కళ లేవలేకపోయిందిసుభద్రమ్మ,” ఒసేయ్ కళ! లే, లే! లేచి మొహం కడుక్కో. కొంచెం వేడిగా కాఫీ తాగుదువు గానివి,” అంటూ లేపింది.లేచింది కానీ కాళ్లు కింద పెట్టలేకపోయింది. ఆమెనెమ్మదిగా రెక్క పుచ్చుకొనిదాన్ని తడికలస్థానాలు గది దాకా తీసుకెళ్ళింది. అక్కడే నుంచోనీ కళ తనకాలకృత్యాలు తీర్చుకున్నాక కాఫీ తాగించి పడుకోబెట్టింది.

సురేష్ బాబుస్కూలుకు పోవటానికి సిద్ధమయ్యాడు.ఆయనకేమీ పట్టలేదు . “అమ్మ ఎంతసేపు దాని సేవేనా.నేను బడికి పోవాలి,వచ్చినాకు సద్దన్నం పెట్టు. ఈరిగాడు బండి తెచ్చాడో లేదో? నేను ఈరోజు సైకిల్ మీద పోను. సైకిల్ టైర్ పంచరయింది,” అంటూ సుభద్రమ్మని హడావిడి చేశాడు.

“వస్తున్నారా ఏటా హడావుడి రాత్రి నుండి ఆపిల్ల కళ్ళు తెరవలేదు.అయ్యో పాపం అని కూడా అనుకోవు.నీపనేనీది,” అనుకుంటూ మావయ్యని సిద్ధం చేసింది. కుంటుకుంటూ కళ ఆయన పుస్తకాల సంచిని తెచ్చి బండిలో పెట్టింది. అది చూసి సుభద్రమ్మ “ఇది ఒక పిచ్చి మా లోకం వాడి పిలుపు వింటే చాలు, అన్నీ మర్చిపోతుంది. పొద్దున మంచం దిగికింద కాలు పెట్టలేకపోయింది. చూడు ఇప్పుడేమో కుంటుకుంటూ పోయి వాడి సంచిని బండిలో పెట్టింది,”అని నవ్వుకుంది.

దుర్గయ్యఏటికెళ్లి స్నానం చేసి రామాలయం లో తులసి తీర్థం తీసుకొని ఇల్లు చేరుకున్నాడు. “అమ్మి ఏమైంది? మన చిన్న తల్లిలేవనేలేదా !” అంటూ కళ పడుకున్న మంచం దగ్గరికి పోయాడు.

“తాతయ్య కూర్చో,”అంటూ మంచంలో ఒక పక్కకు జరిగింది. తన కాలు చూపెడుతూ, “చూడు తాతయ్య ఆ ముల్లంత లోతుగా గుచ్చుకుందో,”అంది. ఆయన అరికాలు గాయాన్ని బాగా పరిశీలించాడు. అయ్యో చీము పోసినట్లుంది అనుకుంటూ, “అమ్మి నేను ఆచారి గారిని పిలుచు కొస్తాను,” అంటూ పైన ఒక కండువా కప్పుకొని వడివడిగా ఆచారి గారి ఇంటి వైపు వెళ్ళాడు.

ఆయన్ని చూస్తూనే,”రండి కరణం గారు,కబురు పెట్టలేకపోయారా? నేనే వచ్చేవాడిని,” అని అన్నాడు.

“మా కళమ్మకి ముల్లు గుచ్చుకొనిచీము పోసింది. మీరు ఒకసారి వచ్చి చూడాలి,” అన్నాడు.

“అయ్యో అలాగా ! పదండి,” అంటూ తన మందుల పెట్టి తీసుకోని అయన వెంటే చకచకా నడిచాడు.

“వదినమ్మ కొచం నీళ్లు మరిగించి తీసుకురా,” అన్నాడు. సుభద్రమ్మ ఒక ఇత్తడి గిన్నెనిం డా వేడి నీళ్లు కాచి తెచ్చి పెట్టింది. మందుల పెట్టే తెరిచి అందులో ఉన్న గాజు గుడ్డను తీసుకొని వేడి నీళ్లల్లో ముంచిదాని మీద కొంచెం టించరుచల్లి, దానితోకాలు తుడిచాడు. ఆ గాయం చుట్టూ తుడుస్తూ నెమ్మది నెమ్మదిగా వత్తడం చేశాడు. అప్పుడుకదుము కట్టిన దగ్గర నుండి నల్లగా ముద్దలాగా గడ్డ కట్టిన రక్తం బయటకు వచ్చింది. ఆయన దాన్ని చాలా చాకచక్యంగా మరొక గుడ్డతో లాగాడు. కళ “అమ్మా,” అంటూ అరిచింది. దుర్గయ్య గారు కళను ఒళ్ళో కూర్చోబెట్టుకొనికదలకుండా పట్టుకున్నాడు.బాధతో విలవిల్లాడిపోయిందిఆ పసిప్రాణం. ఒక పావు గంటలోపల ఇరుక్కుని ఉన్న సన్నటి ముల్లుతలకొననిబయటకి తీశాడు ఆయన .

వెంటనే వేడి నీళ్లలో ఒక మంచి పొడి బట్టను తడిపి పాదమంతా కాపడం పెట్టి సబ్జా బిళ్ళల పొడి వేసి కట్టు కట్టాడు. ఆ కట్టు కట్టిన తర్వాత ఒక చిన్నబిళ్ళ ఒకటి ఇచ్చి “ఇది వేయండి నొప్పి తగ్గిపోతుంది. ఇంక చీము పట్టదు రేపు మళ్లీ వచ్చి చూస్తాను,” అని ఆయన మందులు పెట్టి తీసుకొని వెళ్ళిపోయాడ.

అలానే తాతయ్య ఒళ్లో నెప్పిన భరించలేకసొమ్మసిల్లినట్టుగా ఆయన గుండెలకు తలనా నించిఎక్కిళ్ళు పెడుతూ చిన్నగా నిద్రలోకి జారిపోయింది కళ. దుర్గయ్య గారి మనసంతా ఎదోలాఅయిపోయింది,” అమ్మి, నీకు ఎన్ని సార్లు చెప్పానుదాన్ని అలా ఆ పనికి ఈ పనికి తిప్పొద్దని. చిన్న పిల్ల! చూడు ఎంత నెత్తి మీద కు తెచ్చుకుందో,” అంటూ అమ్మమ్మ మీద కూడా విసుక్కున్నాడు ఆయన.

అలా నాలుగు రోజులు పైనే పట్టింది కళ్ళ కోలుకోవడానికి. కానీ రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడుతున్నది. కృష్ణపక్షం నడుస్తున్నది సరిగ్గా అమావాస్య రోజుకికళలో చాలా మార్పు కనిపించింది. పిచ్చి చూపులు చూడటం, సరిగ్గా తలదవ్వు కోకపోవడం, పాత పాత బట్టలు వెతికిమరి వేసుకోవటం చేస్తున్నది. సుభద్రమ్మకు దానివాలకం చూస్తుంటే అర్థం కాలేదు. మళ్లీ ఆచారి గారి ఇంటికి వెళ్లి ఆయన్ని అడిగింది, “ఆచారి గారు, ఈ పిల్లకి ఏమైందో ఊరికే పిచ్చి చూపులు చూస్తూ ఒక మూలన వరండాలో కూర్చుంటుంది. చల్లగా చీకటిగా ఉండేమూలే చాప వేసుకొని కూర్చుంటుంది. అక్కడే పడుకుంటుంది అలాగే రాత్రిపూట ఏవేవో కలవరింతలు ‘నన్ను పట్టుకోవద్దు దూరంగా పో,’ అంటూ అరుస్తున్నది. నాకు దాని వాలకం చూస్తుంటే ఆ పిల్లకి ఏదైనా గాలి సోకిందేమోఅన్న భయం నాకు రోజు రోజుకి పెరిగిపోతున్నది. కళ తాతగారేమో ‘దానికి ఏం కాలేదులే, నువ్వేం కంగారు పడకు,’ అంటూ సర్ది చెబుతున్నాడు. నా కొడుక్కి ఇవేమీ పట్టవు. వాడి కళ్ళ ముందే పెరుగుతున్న దీన్ని చూస్తే వాడికి అభిమానం ఉన్నట్టే ఉన్న దాన్ని ఏమీ పట్టించుకోడు. బడికి పోవడం రావడం వాడికి అసలు ఇంటి ధ్యాసే ఉండదు,” అని వాపోయింది.

“వదినమ్మ నువ్వేమీ భయపడకు. కళకు నయమవుతుంది లే. సాయంత్రం సంధ్య వేళ మన రామాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి ముందు కూర్చోబెట్టి దిష్టి తిప్పేస్తాను,” అని చెప్పాడు. “అలాగే వస్తాను,” అని సుభద్రమ్మ ఇంటికి వెళ్ళిపోయింది.

సాయంత్రం 6:00గంటలకల్లా కళను తీసుకొని సుభద్రమ్మరామాలయం చేరుకుంది. అక్కడకు చేరిన ఇద్దరు ముగ్గురు గ్రామస్తులకు హారతిశెఠగోపం ఇచ్చి వాళ్ళని పంపించేశాడు.

ఆచారి గారు. “వదినమ్మ ఇటురా పిల్లని తీసుకొని,” అని పిలిచాడు. అమ్మమ్మ కళను తీసుకొని ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా ఉన్న రాయి మీద కూర్చోబెట్టి, ఆచారి గారిని ఆలోచనగా చూసింది. ఆయన ముందుగానే కొన్ని సామాన్లు సిద్ధం చేసుకుని ఉన్నాడు.

“అమ్మాయి ఇక్కడ స్వామికి దగ్గరగా వచ్చి కూర్చో తల్లి,” అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు.

కళ శిలలాగా బిగుసుకుపోయి కూర్చుని ఉంది. ఆయన మాటలు వినిపించుకోలేదు. ఇదే దీనివాలకం ఆచారి గారు,” అంటూకళను రాయి మీద నుంచి లేపి ఆంజనేయ స్వామి విగ్రహం ముందుకు తీసుకురావాలనికళ చెయ్యి పట్టుకుని న నడిపించ సాగింది సుభద్రమ్మ . చెయ్యి నీ విడిపించుకోవాలని గుంజుకుంటున్నది కళ “అమ్మమ్మ నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు వెళ్లి పూజ చేయించు కురా, త్వరగా వెళ్ళిపోదాం. నాకు భయంగా ఉన్నది,”అని చెప్పసాగింది.

బలవంతంగా సుభద్రమ్మ కళను స్వామి వారి విగ్రహం దగ్గరకు లాక్కుపోయింది. ఆంజనేయస్వామి విగ్రహం చేరగానేకళ మొహం మారిపోయింది. గుడ్లు తేలేస్తున్నది.చూపు స్థిరంగా లేదు. ఒళ్లంతా చెమటలు పట్టి చెమటలతో తడిసిపోతున్నది. ఆ మార్పుని ఆచారి గారు గమనించారు. “కళ, కళ!” అని అనునయంగా పిలిచాడు. “ఊ !”అంటూ గురక పెట్టడం. పదేపదే నాలుకబయటకు తీస్తూ దవడలు బిగిస్తూ వెనక్కి ముందుకుఊగటం మొదలుపెట్టింది.

“వదినమ్మ కళని పట్టుకో,” అంటూ ముందుగా ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న నెమలీకలు కట్టి ఉన్న కర్రను తీసుకొని కళ తలకుఆనించిఏవో మంత్రాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ కర్రనుకళ తల నుండి కాళ్ల వరకు తిప్పుతూ కొద్దిసేపు ఉంచాడు. ఆ తర్వాత మండుతున్న బొగ్గులు ఉన్న కుండను అడుగున గడ్డి వేసి పట్టుకొని స్వామి పాదాల దగ్గర నుండి సాంబ్రాణిపొడి తీసి కుండలో వేసికళ ముందు పెట్టి నెమలి ఈకలు ఉన్న కట్టను పట్టుకొని ఆ పొగ కళకికమ్ముకునే లా చేశాడు.ఆపొగను తట్టుకోలేక కళకి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఆపుకోలేనంతగా బొంగురు గొంతుతో దగ్గడం

మొదలుపెట్టింది. దాన్ని చూస్తూ ‘పసిపిల్ల పొగఘాటుని తట్టుకోలేకపోతున్నది,’ అనుకుంటూ సుభద్రమ్మకళ దగ్గరికివెళ్ళబోయింది.

‘వదినమ్మ నువ్వు అక్కడే కూర్చో, పిల్ల దగ్గరికి రాకు. ఇది మామూలు పొగ కాదు,” అంటూ పెద్దగా అరిచాడు ఆచారి. అమ్మమ్మకు భయం కలిగింది ఆయన అరుపుకి.

అరగంటసేపు అలాగే చేస్తూ ఉన్నాడాయన. పొగ తట్టుకోలేక కళ్ళు తేలేసి అక్కడే స్వామి పాదాల దగ్గర ఒరిగిపోయింది కళ మైకం కమ్మినట్టు.కళ పక్కకు ఒరిగిన వెంటనే పొగ వస్తున్న కుండను దూరంగా పెట్టేసి వచ్చి మరొక కుండలో కర్పూరం వేసి కళ చుట్టూ తిప్పి పక్కనే ఉన్న ఎర్ర నీళ్ళుఉంచినపళ్లెంలో వెలుగుతున్నకర్పూరంతో సహాకుండను బోర్లా పెట్టాడు.నిమిషాల్లో ఆ నీరంతాకుండ లోకి చేరింది. వెంటనే పళ్ళెం అక్కడ నుంచి తీసుకెళ్లి దూరంగా ఉన్న వేప చెట్టు దగ్గర పెట్టి వచ్చాడు. ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉన్న సింధూరంనుకళ నుదుటి మీదపెద్ద బొట్టు లాగా పెట్టి, “ఇంటికి తీసుకెళ్ళు వదినమ్మ,” అన్నాడు.

సుభద్రమ్మఎంతో ప్రేమగా కళను ఎత్తుకొని తల భుజం మీద ఉండేటట్టు చూసుకు కుంటూ ఇంటికిచక చక వెళ్ళింది.

ఆరోజు రాత్రంతా స్పృహ లేకుండా పడి ఉంది కళ.దాన్నిలా చూస్తున్న దుర్గయ్య కు మనసు వికలమైంది. సురేష్మాత్రం ఒక్కసారి దానిమంచం దగ్గరికి వెళ్లి పక్కకు పోయిన దుప్పటి పై దాకా కప్పి, కొంచెం టేబుల్ ఫ్యాన్ దగ్గరగా జరిపి, ఫ్యాన్ ఆన్ చేసితను వెళ్లి నాన్నపక్కన మంచం మీద పడుకున్నాడు.

దుర్గయ్య గారు గమనిస్తూనే ఉన్నాడు,” వీడికి కళంటే అభిమానమే,”అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు.

సూర్యుడుపొడచూపాడు. గుడ్లేరు జనం కూడా లేచారు. సుభద్రమ్మ పొద్దుగానే లేచి, కళ మంచం దగ్గరికి వెళ్లి చూసింది. నిశ్చింతగా నిర్మలంగా అమాయకంగా నిద్రపోతున్న కళను చూస్తూ ‘పిచ్చిదిపడుకోనిలే కాసేపు,’ అనుకుంటూ ఆమె వెళ్లి కల్లాపి చల్లిముగ్గు పిండిని నాలుగువేళ్ళ మధ్యలో పట్టుకొని నెమ్మది నెమ్మదిగా ఒకేసారి నాలుగుగీతలు వచ్చేటట్టుగా ముగ్గును జారవిడుస్తూచాలా వేగంగా ‘పద్మవ్యూహంముగ్గు’ గీసి లోపలికి వచ్చేసింది. పద్మవ్యూహం ముగ్గుగీయటానికి చాలా నైపుణ్యం కావాలి. ఎంత పెద్దగా నైనాగీయవచ్చు. అది ఒక పజిల్. గుడ్లేరులో పిల్లల కు ఒక ఆట,ఆ ముగ్గులోని గీతల మీద నడుస్తూ ముగ్గుమధ్యలోకి చేరాలి.

కానీ వచ్చినదారివెంటే తిరిగి రాకూడదు. సంక్రాంతి సమయంలో అయితే గుడ్లేరు లో ఏదో ఒక వాకిలి ముందు ఆ ముగ్గుని వేస్తుంటారు. ఆ రోజు ఆ వాకిలి ముందు చిన్నపిల్లలు చేరుకుని ఆడుకుంటూ ఉంటారు.

కళకి మెలకువ వచ్చింది. “లేచా ఉటే!వెళ్లి మొహం కడుక్కో.అమ్మమ్మ కు చెప్పి నీకు కూడా కాఫీ ఇప్పి స్తా,” అంటూసురేష్”అమ్మ, అది కూడా లేచిందే. దానికి కూడా కాఫీ ఇవ్వు,” అంటూ పెద్దగా చెప్పాడు.

“కలిపాను రా నీ కోసం. దానికి కాసేపాగిస్తాలే. నువ్వెళ్లి తాగు,” అంటూపెరటి దొడ్డి లో నుంచి పెద్దగా అరిచి చెప్పింది.మావయ్య వంటగదిలోకి వెళ్లి తన కోసం పెద్ద ఇతడి గ్లాసులో ఉన్న కాఫీని మరొక చిన్న స్టీలుగ్లాసులోకి కొంచెం పోసి, పక్కనే గిన్నెలో ఉన్న వేడి పాలు పోసి పంచదార కాస్త ఎక్కువే కలిపి కలిపి కళకి కూడా తెచ్చి ఇచ్చాడు. కళ కాఫీ తాగుతూ ‘మావయ్య ఎంత మంచోడు. నా మావయ్య బంగారం,’ అనుకుంటూ చాలా సంతోష పడింది.

నిదానంగా 10 రోజులకికళ మాములుగా అయింది. అమ్మమ్మకు తాతయ్యకు మనసుకుదుటపడింది. కోలుకున్నకళ మళ్లీ బడికి వెళ్లడం మొదలుపెట్టింది.సురేష్కూడా తన ఆటలు, స్కూలుతోటి రోజులు దోర్లించేస్తున్నాడు. పదవ తరగతి ఫలితాలు వచ్చేసాయి. మామయ్యప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు. ఆ ఏడాది తాతయ్యఆయన్ని పి యు సిలో చేర్పించాడు. అలాకళ నలత పడి మూడేళ్లు గడిచినాయి. మావయ్యపి యు సి పూర్తి చేసి బిఎస్సికోసం డిగ్రీ కాలేజీ ఒంగోలులోచేరాడు.

అప్పటినుండి సురేష్ ఇంక ఇంటి గురించి పట్టించుకోవడం తగ్గిపోయింది.దుర్గయ్య కూడా కొడుకు గురించి అంతగాపట్టించుకోవడం లేదు.

**************

కళ 11 ఏళ్లకే పెద్దమనిషి అయింది. లంగా వోణీల్లోకి మారిపోయింది బొద్దుగా చూడముచ్చటగా తయారైంది.అలా నల్లతపడి మూడేళ్లు జరిగి పోయాయి.ఊళ్ళోవాళ్ళందరూ ‘ఏమన్నా చెప్పు మీ అబ్బాయికి మీ మనవరాలకు మనువుచేయమని, మంచి జోడి’ అని చెప్పేవారు.అమ్మమ్మకు మాత్రం అనుమానమే ‘వీడు బాగా చదువుకొంటున్నాడు.ఏ చదువు లేకుండా ఉన్న దీన్ని ఇష్టపడతాడా, ఏమో?’ అని తనలో తానే అనుకోనేది.

మామయ్య పియుసి పూర్తి చేసి బిఎస్సి చేరాడు డిగ్రీ కాలేజ్ ఒంగోలులో. వినాయక చవితి తర్వాత పితృపక్షాలు మొదలయ్యాయి.ఆరోజు మహాలయ అమావాస్య.దుర్గయ్య గారు ఇంట్లో తర్పణాలువిడిచాడు.పగలంతా అమ్మమ్మకు పనుల్లో సాయం చేయడంతోనే రోజు వెళ్ళిపోయింది.సాయంత్రం శిరీష వచ్చింది.

“అమ్మమ్మ, నేను శిరీ కలిసి గుడి దాక వెళ్ళొస్తాం,” అంటూ వెళ్ళింది.కళ శిరీష కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు.శిరీష కళకంటే కొంచెం పెద్దది. శిరీష తండ్రి కోమటి వెంకటేశం. మేనత్త దగ్గర మద్దిరాల లోఉండేది.అలా ఉంటూ ఎనిమిదో క్లాస్ వరకు చదువుకుంది.అందుకని చందమామ బాలమిత్రుల లాంటి పుస్తకాలతో పాటు అప్పుడప్పుడు ఆంధ్ర జ్యోతి, స్వాతి వారపత్రికలను కూడా తిరగేస్తూ ఉంటుంది. గుడ్లేరు వచ్చినప్పుడల్లా శిరీష ఆ పుస్తకాల్లోని మంచి మంచి కథలు కళ కి చెబుతూ ఉంటుంది. అందుకే శిరీషతో గడపడం అంటే కళకు చాలా ఇష్టం.శిరీష మేనత్త కూడా మద్దిరాల నుండి గుడ్లేరు కుచేరుకుంది శాశ్వతంగ అన్న వెంకటేశం దగ్గర ఉండడానికి.వాళ్ళ ఇల్లు కోమటి బజార్లో ఉంటుంది.

చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక శిరీష కళ ఇంటికి బయలుదేరారు దారిలో కళకు మళ్ళీ ముల్లు గుచ్చుకుంది.

శిరీష కళచెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చింది. అది చూస్తూనే, “ ఏమైందే దానికి?” అని సుభద్రమ్మగాబరాగా అడిగింది.“ఏం లేదు సుభద్రమ్మత్త దానికి కాల్లోముల్లు గుచ్చుకుంది.”

“చెప్పులేసుకోలేదా ఈ పిచ్చి మాలోకం? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తుంది,” అని విసుక్కుంటూ కిరసనాయిలతో గుడ్డ తడిపి ముల్లుగుచ్చుకున్న దగ్గర శుభ్రం చేసింది.“పర్లేదులే అమ్మమ్మ ముల్లుఅంత పెద్దదేమి కాదు, కొంచమే గుచ్చుకుంది, గుడి దారిలో చీకటిగా ఉండడంతో కనిపించలేదు,”అంటూ చెప్పింది.

ఆరోజు అమ్మమ్మ తాతయ్య ఉపవాసం అవటంతో వాళ్ళు మజ్జిగ తాగి పడుకున్నారు.మధ్యాహ్నంచేసిన పెరుగు వడలు మావయ్యకు పెట్టి తాను తిని అమ్మమ్మ పక్కనే మంచం వేసుకొని పెరట్లోపడుకుంది.బాగా అలసిపోవటంతో అమ్మమ్మ కూడా తొందరగానే నిద్రపోయింది.తాతయ్య అంతే .మామయ్య లోపల ఫ్యాన్ పెట్టుకుని పడుకున్నాడు.కళకిముల్లు గుచ్చుకున్న పాదం ఒకటే నెప్పిచేస్తూ ఉండటంతో చాలాసేపు నిద్ర పోలేకపోయింది.అలా రుద్దుకుంటు నిద్దర లోకి జారిపోయింది.

పొద్దు పొడవడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది. చుక్కలన్నీ నడి నెత్తిన ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆకాశమంతనల్లటి గుడ్డ పరిచినట్లుగా ఉన్నది.కళనిద్రలోనే ఓణీ తోటి విసురుకుంటుంది.చెమటలు దిగజారిపోతున్నాయి.కలవరిస్తున్నది, “రాకు, రాకు, దగ్గరికి రాకు! నా మీద వాలకు, పోపో!” అంటూ గాల్లో చేతులు ఊపుతూఅరవటం మొదలుపెట్టింది.ఆ అరుపులు గురకలాగా మారిపోయాయి. కళ్ళు తెరిచింది కళ. అంతానల్లటి శూన్యం , ఏదో అస్పష్టమైనఆకారం తన మంచం దగ్గర నుంచున్నట్లుగా ఉన్నది.కళ లేవలేకపోతున్నది.ఆ ఆకారం మంచం మీద కూర్చుని కళమీదకు ఒరిగింది.కళ కళ్లుఅలజడితోరెప్పలు కొట్టుకుంటున్నాయి.గొంతులోంచి గుర, గురమని శబ్దం వస్తున్నది.నోట్లో నుండి చొంగకారడం మొదలు పెట్టింది.కానీ కొద్ది క్షణాల్లోనే కాళ్లు చేతులు కట్టుకోవడం మొదలుపెట్టాయి.

సుభద్రమ్మ కు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కళ మంచం వైపు చూసింది.కళకు ఫిట్స్ వస్తున్నాయి.కాళ్ళు చేతులు కొట్టుకుంటు, తల ఒక పక్కకు ఒరిగిపోయి ఉంది.నోట్లోంచి నురగ నురగ చొంగ కారడం చూసి గబరాటయింది. వెంటనే “ఏమయ్యో! లేలే! మన కళకి ఏదో అయిపోతున్నది,” అంటూ పొలికేక పెట్టింది.

కళ కాళ్ళు చేతుల్ని పట్టుకోవడం ఆమె వల్ల కావడం లేదు.దుర్గయ్యపంచని లాగి క ట్టుకుంటూవచ్చిగబగబా మరచెంబునీళ్లను కళ మొహం మీద జల్లాడు.మిగిలిననీళ్లను దాని కాళ్ళ మీద చేతుల మీద పోశాడు.చల్లటి నీళ్ళు మీద పడటంతో చేతులు కాళ్లు కొట్టుకోవడం ఆగి పోయింది.ఆ స్థితిలో ఉన్న కళను చూస్తే తాతయ్యకు అర్థం కాలేదు.సుభద్రమ్మకు అయోమయంగా అనిపించింది.దీనికి ఫిట్స్ రావడం ఏంటి అని ఇద్దరు అనుకున్నారు మనసులో. సురేష్ లోపల పడుకోవటంతో ఇదేమి తెలియలేదు. ఉదయాన్నే కళమంచం మీద నుంచి లేవలేకపోయింది.అతి కష్టం మీద లేచెల్లి మొహం కడుక్కొని వచ్చింది. ఈసారి అమ్మమ్మ స్వయంగా కాఫీగ్లాసు తీసుకొచ్చికళ పక్కన కూర్చునితాగించింది.

“కళ ఎలా ఉందమ్మా ఇప్పుడు?” అడిగింది.

“కాస్త భారంగా ఉంది అమ్మమ్మ, అంతే ఇంకేంలేదు, “అంది.

సుభద్రమ్మ కళను అలానే చూస్తున్నది. “ఏంటమ్మా అలా చూస్తున్నావ్ కొత్తగా నాకేమైంది,” అని అన్నది.

“నిన్న నీకేమైందో నీకుతెలుసా?” అనుమానం గా అడిగింది.

“కాల్లోముల్లు గుచ్చుకుంది. నేను ఆ విషయం నీకు

చెప్పానుగా,” ‘అదేంటి అమ్మమ్మఅలా అడుగుతుంది,’అని వింతగా చూసింది.

“అంటే రాత్రి నిద్రలో నీకేమైనా పిడకల వచ్చిందా?” ఆరా తీసింది.

“ ఏమో గుర్తులేదు,” అంటూ తలగోక్కుంది.

అమ్మమ్మకి ఒక విషయం అర్థమైంది ఇంకేం మాట్లాడకుండా పని ఉందంటూ లేచి, “స్నానం చేసి రా. గుడికి వెళ్దాము,”అన్నది.

“మరి మనం వాగుకి వెళ్ళొద్దా అమ్మమ్మ, నీళ్లు తేవడానికి. నిన్న తెచ్చిన నీళ్లన్నీ అయిపోయాయి గా!” అంది.

“ఈరిగాడికి చెప్తాలే.వాడే తెచ్చి పోస్తాడు.మడినీళ్ళ బింద ఒకటి ఉందిగా, వంటకు సరిపోతుంది.” అంటూ వెళ్లిపోయింది.

మావయ్య కూడా బయట నుండి వస్తూనే “ఏటే కళ! ఏమైంది, మమ్మల్ని అందరినీ హడలు కొట్టేస్తున్నావ్.కాస్త చూసుకుని నడవొచ్చు కదా తిక్కల దాన!” అంటూ తల మీద మొట్టి వెళ్ళిపోయాడు.మావయ్యగట్టిగా కొట్టడంతో తల్ల రుద్దుకుంటూ “అలాగే మావయ్య నువ్వు చెప్పావు కదా ఇకనుండి చూసుకుంటూ నడుస్తాలే,” అందిఅమాయకంగా.

(ముందేం జరుగుతుంది?)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు 35వ భాగం

జంతర్ మంతర్ – కొత్త అక్షరాల పాఠశాల