‘ప్రళయాక్షరాలు’

సుంక ధరణి

ప్రపంచం నా మాట వినట్లేదని
తాళలేని గొంతుక
దారితప్పిన వలయకాలువలా
ఘీంకరిస్తూ బాష్పీభవిస్తుంది
ఆ ఆవిరి సెగలు
ఉరుముల్లా
కాగితంపై నర్తిస్తుంటే
ఎండుటాకు శబ్దాల క్రోధనినాదాలు
చిగురుటాకు లబ్దాల కరతాళాలు
యుద్ధం.. శత్రువు.. గెలుపు..
అనే అభిప్రాయ వేదికపై
సహనములు
సరిగమలు మూటగట్టి
నీకో రహస్యం దాచిపెట్టా!
నిండు కలల వంతెనపై
కదపలేని వేళ్లతో ఈ ఉదాంతాన్ని రాసింది నేనే
నిన్ను చుట్టు ముట్టి
కదిపే కళ్లతో ఈ వేదాంతాన్ని చదువుతున్నది నేనే..

Written by Sunka Dharani

పేరు: సుంక ధరణి
D/O: సుంక నర్సయ్య
రాసిన పుస్తకాలు:
అరుణిమలు (కవిత్వం),
భూమిని నేను ( దీర్ఘ కవిత్వం)
విద్యార్హతలు: Msc Botany, MA Telugu

"ఇంచుమించుగా నా పద్దెనిమిదవ ఏట సాహిత్యావలోకనం జరిగింది. తెలుగు భాష మీదున్న మక్కువే వివిధ సమాజ స్థితులపై స్పందించేందుకు దోహదపడుతుంది. అలా సమకాలీన విషయాలను అధ్యయనం చేస్తూ కథలు, కవిత్వాలు రాస్తున్నాను. నిలువెత్తు మనిషి ఆకారంలో ఒదిగిన మనసు సంచిలో కాసింత మానవీయతను మూటగట్టుకోవాలని తెలిపేదే నా కలం."

మెయిల్‌: dharanisunka19@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్పృహ 

తరుణి చిత్రం