The Cruise ఓ దృశ్య ప్రయాణం – 3  భాగం

స్కాగ్ వే

రోజు లాగానే తెల్లవారి 6:30 కు లేచి  16 డెక్ కు  వెళ్లి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మసాలా దోశ, మిల్లెట్స్ ఉప్మా తిని ‘స్కాగ్ వే సిటీ’ ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్ళాం. చికెన్ లో ఉన్నట్టే క్రూజ్ వాళ్ళు క్రూజ్ పోర్టు నుండి డౌన్ టౌన్ కు వెళ్లే ఒక పాయింట్ వరకు ఫ్రీ బస్సు షటిల్ ను  నడుపుతారు. మేమంతా డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం .

Broadway , State streets ఉన్నాయి. ఇక్కడ ఈ historic downtown  చాలా బాగుంది .ఇక్కడ షాప్స్, ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి. అక్కడున్న ఓ  షాపులో సావనీర్ కొన్నాం. సావనీర్ అంటే స్కాగ్వే కల్చర్ కు  ప్రతీక. అక్కడి నుండి హార్ట్ గ్యాలరీకి వెళ్ళాం.  స్థానికులు వేసిన ఆర్ట్స్ చాలా ఆకట్టుకున్నాయి.

Broadway లో నడుస్తుండగా సడన్గా “Bald eagle ” కనిపించింది అందరం pictures  తీసుకున్నాం.

2024 లో bald eagle ను “National Bird” గా ప్రకటించారు. నీ రెక్కలు దాదాపు 6 నుండి 7 ఫీట్ ల వరకు పొడవు ఉంటాయి. ఇది సముద్రంలో చేపలను చాలా దూరం నుండే గుర్తించి వేటాడుతుంది. 99% విజయం బాల్డ్  ఈగల్ దే  ఉంటుంది.

మేము అవుట్డోర్ ఆక్టివిటీస్ లో వైట్ పాస్ ( Train) బుక్ చేసుకున్నాం. ఇంకా దానికి కొంత టైం ఉండడంతో ఇంకొంచెం సేపు డౌన్ టౌన్ లో గడుపుదామని Glacial coffee House  వెళ్ళాం.  ఇక్కడ హోం మేడ్ కుకీస్, ఇంకా చాలా తాజాగా సిద్ధం చేసిన హోం మేడ్ కాఫీ ప్రత్యేకం. అవి ఊరికే ప్రత్యేకం కాలేదండీ! ఆ షాప్ లోకి వెళ్తుంటేనే ఘుమఘుమలాడే కాఫీ టెంప్టింగ్ గా ఉంటుంది ఇంకేంటి ? ఆ ఫ్రెష్ నెస్ ను ఆస్వాదించాం.

నడుస్తూ నడుస్తూ ” Pullen Creek”  చూడడానికి వెళ్ళాం క్రీక్ అంటే ఇది చాలా చిన్న నదిగా ఉంటుంది ఉపనదిగా కూడా చెప్పవచ్చు ఇరుకుగా కొంచెం చిన్నదిగా ఉంటుంది ఇక్కడ Solmon  చేపలు పైకి ఎగరడం చాలా బాగుంటుంది. సాల్మన్ చేపలను తినడానికి Bears వస్తుంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు సాల్మన్ చేప తినడము గుండెకు చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ” Bears rules on the floor, Bald Eagle rules on the sky” అంటారిక్కడ. సాల్మన్ చేపను తిన్న తర్వాత మిగిలిన సాల్మన్ శరీరాన్ని వదిలి వెళ్తాయి ఇవి తర్వాత అక్కడ పెరిగే చెట్లకు మరింత శక్తిని ఇస్తాయి బేర్స్ ఈ రకంగా ప్రకృతికి సహాయం చేస్తాయి బేర్స్ ఒక్కొక్కటి దాదాపుగా 80 నుండి 90 Lbs వరకు ఉంటాయి ఇవి సాల్మన్ చేపను వేటాడి తిని వాటి ద్వారా వచ్చిన fat ను చలికాలం దాదాపు 6 నెలలు వేటాడే అవసరం లేకుండా తమ శరీరంలో నిలువ చేసుకుంటాయి. ప్రకృతి ఎంత విచిత్రంగా ఉంటుంది కదా!

Pullen Creek చూడటానికి ఎంతసేపు నడిచామో అంతసేపు కూడా అక్కడ ఉండలేదు మేము. ఎందుకంటే మేం వెళ్ళినప్పుడు ఎక్కడినుండి బేర్లు వస్తాయోనని భయంగా ఉండింది మాకు మేము బేర్స్ నుండి రక్షించుకోవడానికి మామూలుగా ఉపయోగించాల్సిన స్ప్రే తీసుకువెళ్లలేదు. మాకు ఆ ఐడియా లేదు. అందుకే అక్కడిదాకా వెళ్లి త్వర త్వరగా తిరిగి వచ్చాం.

మళ్లీ డౌన్ టౌన్ వైపు వచ్చాం ఇంకా “Jewell Gardens “చూడ్డానికి వెళ్ళాం. ఇది ఒక ఆర్గానిక్ గార్డెన్. Jewell garden  కొంచెం చిన్నది కానీ చాలా రకాల పూలు కనువిందు చేశాయి. కొన్ని పూల చెట్లను greenhouses హలో పెంచారు . చాలావరకు ఓపెన్ గార్డెన్ అనే చెప్పొచ్చు. పూల లో ఉన్న కలర్స్ ను ఊదా రంగుకు ప్రక్కన తెలుపు రంగు పింక్ కలర్ ఉన్న పూలను ఎరుపు రంగు పూల ప్రక్కన పెట్టి ఆ కలర్స్ highlight చేశారు.

నేలను  ‘ నక్షత్రం’ లాగా …star shape లో  అమర్చి మధ్యలో పచ్చ గడ్డి చుట్టూ రకరకాల పూలను అమర్చారు ఒక దగ్గర  గుండ్రంగా ఏర్పడేలా సిద్ధం చేసి చుట్టూ రకరకాల పూలను అమర్చారు.

అక్కడి నుండి కొంచెం ముందుకు నడిస్తే ఒక మైక్రో రైల్వే స్టేషన్ చిన్న నారో గేజ్  రైలు పట్టాలు . చిన్న ట్రైన్ కొన్ని భోగిలతో ఉన్నాయి అక్కడ రైల్వే స్టేషన్ ను ఆనుకొని కొన్ని నిజమైన బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో ” White Pass” దగ్గర అలాగే మైక్రో బిల్డింగ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి.

ఇంకోవైపు ” glass garden” ఉన్నది. లోపల గ్లాస్ తో తయారు చేసిన రకరకాల జగ్స్ పెద్దపెద్ద పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కు వెళ్లే దారిలో ఒక చిన్న గార్డెన్ ఉన్నది. దానికి చుట్టుపక్కల ఉన్న ఫెన్సింగ్ కు  సన్నని iron rod  ఒక చిన్న మొక్కకి బ్రాంచ్ లాగా అమర్చారు. Birds , Flowers రకరకాల కలర్స్ తో గ్లాస్ తో తయారు చేసినవి ఉంచారు. గ్లాస్ తో డ్రాగన్ ఫ్లైస్ చేశారు. ఇవన్నీ చాలా క్రియేటివ్ గా అనిపించాయి.

తర్వాత ఓ 20 నిమిషాలు నడిస్తే ఒక మ్యూజియం చేరుకున్నాం మ్యూజియాలు చూడడం మాకు చాలా ఇష్టం పురాతన వస్తువుల ద్వారా వాళ్ల వాళ్ల సంస్కృతిని కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాం.

ఈ మ్యూజియం చాలా పెద్దది. Enter కాగానే తల ఎత్తి పైకి చూసేసరికి  Sleigh కనిపించింది దీన్ని means of transport గా చెప్పవచ్చు .

 

Ice  లో దీనికి రెయిన్ డీర్లను కట్టి దానిలో మనుషులను కానీ వస్తువులను కానీ తీసుకువెళ్లడానికి ఉపయోగించేవాళ్ళట . ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నది. ఒక మూలకు బేర్ బొమ్మ నిలువెత్తుది ఉన్నది. అప్పుడు వాళ్లు వాడిన చిన్న పడవలు, ఈటలు ఉన్నాయి. ఒక పెద్ద పిక్చర్ ఫ్రేమ్ కట్టి ఉంది దాన్లో..

” Old Prospectors Trail ” అని వ్రాసి ఉంది. ” White Pass & Yukon Rout ” గురించి ఆ పిక్చర్ లో ఉన్నది చాలా ఎత్తైన Totems ఉన్నాయి. Bare skin తో తయారుచేసిన జాకెట్స్ ఉన్నాయి కొన్ని ” Vintage car”

పిక్చర్స్ కూడా చూడవచ్చు.

ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గుర్రపు బగ్గిల ఫోటోలు కూడా కనిపిస్తాయి ఇంకొంచెం ముందుకు నడిస్తే ఆనాటి ప్రజలు వాడిన చెక్కతో చేసిన చిన్న చిన్న అల్మారి లూ ఉన్నాయి. ఒక కుట్టు మిషన్ కూడా కనిపించింది.

ఇక అక్కడి నుండి ప్రఖ్యాతి పొందిన “వైట్ పాస్” ను చూడ్డానికి బయలుదేరాం.

ఆ White hite Pass station దగ్గరలోనే ఉన్నది. మేము నడిచే వెళ్ళాము లో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం చాలా తక్కువ.అవసరమైతే సి ఏరోప్లేన్స్ ప్రయాణానికి వాడుతారు .ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది . ఇక సమ్మర్ లో చిన్న చిన్న రివర్ బోట్స్  ను వాడుతుంటారు చిన్న ప్లేస్ అనే చెప్పవచ్చు.

Train narrow gauge ఓకే కాబట్టి కొన్ని  బోగీలే ఉంటాయి. ఒక్కొక్క భోగీ కి ఒక్కొక్క పేరు ఉంటుంది. Lake Squanga, Lake Tingup, Yukon  and White Pass లాంటి పేర్లు బోగి లకు ఉన్నాయి ప్రతి భోగిలో ఒక వాష్ రూమ్ డస్ట్ బిన్ లు ఉన్నాయి ట్రైన్ వెళుతూ ఉంటే ట్రైన్లో నుండి పిక్చర్స్ తీసుకోవడానికి ఒక చిన్న బాల్కనీ లాంటిది ఉంటుంది ట్రైన్ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లేప్పుడు సీడ్స్ అటు ప్రక్కకు తిప్పి కూర్చోవాలి. ఇలా మన దగ్గర ఊటీ ట్రైన్ లోను ఉంటుంది ఈ ట్రైన్ రౌండ్ ట్రిప్ వన్ వే గా కూడా ఉంటాయి. ఈ ట్రైన్ బ్రిటిష్ కొలంబియా వరకు వెళుతుంది అయితే పాస్పోర్ట్ తప్పనిసరిగా  మనతో తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గోల్డ్ రష్ సౌకర్యార్థం ఈ ట్రైన్ ను తయారు చేశారు. ” Yukan River ” చుట్టూ అల్లుకున్నట్టుగా ఉంటుంది దీనిలో చేసే ప్రయాణం ఇది ఒక అత్యద్భుతమైన ప్రయాణం యుగాన్ డెల్టా మీదుగా వెళుతూ చుట్టూ ఉన్న కొండలు యూకాన్ రివర్ చిన్న వాటర్ ఫాల్స్ ను చూడవచ్చు. రకరకాల పువ్వులను ఎన్నో రంగుల్లో అట్లాగే రకరకాల ఆకులను ఆకారాల్లో చూడొచ్చు.

ప్రయాణంలో మనకు వాటర్ఫాల్ కూడా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ పేరు

” Bridal Veil  ” నిజంగా క్రిస్టియన్ పెళ్ళికూతురు ధరించిన డ్రెస్ లాగే ఉంటుంది. తెల్లగా నురగ నురగగా కొండలపై నుండి వాటర్ఫాల్ జాలు వారుతూ ఉంటే చాలా మనోహరంగా ఉంటుంది.

ఈ టూర్ క్రూజ్ టికెట్ ఖర్చులో  ఈ వైట్ పాస్ టూర్ ఉండదు. దీనికి మనమే ఎక్స్ట్రా టికెట్ ఖర్చు పెట్టుకోవాలి. అంతే కాదు ముందే వీటికి బుక్ చేసుకోవాలి.

ఈ ట్రైన్ లో చాలా చల్లగా ఉన్నప్పుడు మనకు హీటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి టూ సైడ్స్ పెద్దపెద్ద కిటికీలు ఉండడం వలన చూడడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది దివ్యాంగులు ట్రైన్ ఎక్కడానికి వీలుగా వీల్ చైర్ కు ట్రైన్ కు కనెక్షన్ కూడా ఉంటుంది. దివ్యాంగులు వాళ్ల వీల్ చైర్ లో కూర్చుంటే అమాంతం ట్రైన్లోకి ఎక్కిచ్చేస్తుంది .ఈ సౌకర్యం భలే అనిపించింది.

ఈ railway  bridge  ను కట్టడానికి దాదాపు 35,000 మంది పాల్గొన్నారు. ఒక పెద్ద ఇల్లు సైజు లో ఉండే బుల్లోజర్ ని వాడారట. దారి మధ్యలో ఉన్న గుట్టలను బ్లాస్ట్ చేసి tunnel  నిర్మించారు. వాళ్ళ శ్రమ వృధా కాలేదు. ఇప్పటికీ వేల మంది ఈ  ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దారి అంతా కొండలు చిన్న చిన్న గుట్టలు నది చిన్న చిన్న వాటర్ ఫాల్స్ తో అద్భుతం పచ్చని చెట్ల మధ్య తెల్లని జలపాతాలు కనువిందు చేస్తాయి.

దారిలో ఒక అప్పటి పురాతనమైన బ్రిడ్జి కూడా కనిపిస్తుంది అయితే ఆ పాత బ్రిడ్జి పైన  మేము ఎక్కిన ట్రైన్ వెళ్లదు. ఇది వేరే రూట్ లో ఉంటుంది.

ప్రయాణం ఆద్యంతం సుందరంగా ఆహ్లాదంగా ఉంటుంది దాదాపు నాలుగు వేల ఫీట్  పైకి వెళ్తాం. చాలా ఎత్తుపైన ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అంత ఎత్తు పై నుండి పడే వాటర్ ఫాల్ ఒక ప్రదేశం నుండి మొత్తం క్రిందికి జాలువారే దృశ్యం కూడా కనిపిస్తుంది . దారిలో ఒక దగ్గర ఒక మలుపు వస్తుంది అక్కడ ట్రైన్ కొంచెం మెల్లగా వెళుతుంది. సడన్ గా ఒక జింకల గుంపు కనిపించింది . నాకైతే అడవిలో తిరుగుతున్న జంతువులలో జింకలు చాలా ఇష్టం. వాటి పెద్ద పెద్ద కళ్ళు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయనిపిస్తుంది . గడ్డి తింటూనే ఓరకంట చూడడం చాలా అందంగా ఉంటుంది.

ఈ మనోహరమైన మూడు గంటల ప్రయాణంలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విశేషాలు ఎంతవరకు వ్రాయగలను అన్న సంశయంతో ఉన్నాను సాధ్యమైనంత వ్రాద్దామనే ప్రయత్నం నాది ప్రయాణంలో ప్రకటనలు కూడా చేస్తారు రెండు కొండల మధ్య నుండి పసిఫిక్ మహాసముద్రం కనిపిస్తుంది. అక్కడ మన క్రూజ్ కూడా చూడవచ్చు దూరం నుండి చూస్తాం. కాబట్టి చిన్నగా కనిపిస్తుంది క్రూజ్. కానీ నిజానికి క్రూజ్  ఎంత పెద్దగా అంత దూరం నుండి కూడా కనిపిస్తుంది కదా ! ఇంకొంచెం ముందుకు వెళితే కెనడా ఇంకా అమెరికా బోర్డర్ కూడా కనిపిస్తుంది. అక్కడ రెండు దేశాల జెండాలు 2 888 ఫీట్ ఎత్తులో ఉంటాయి.

Flags ఉన్న ప్రాంతంలో ట్రైన్ కొంచెం సేపు ఆపుతారు అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ క్రూజ్ దగ్గరలో ఉన్న స్టేషన్కు వస్తుంది అక్కడ ట్రైన్ ఆపేస్తారు కానీ ట్రైన్ లోని సిబ్బంది క్రిందికి దిగనివ్వరు ఫొటోస్ కూడా తీసుకొనివరు. ఎందుకంటే అక్కడ బేర్స్ వస్తాయట!  బేర్స్ ఉన్న అడవిలో మనం వెళ్లి కన్స్ట్రక్షన్స్. చేస్తే పాపం అవి ఎక్కడికి వెళ్తాయి కొంచెం ఇటువంటి పనుల వల్ల పర్యావరణానికి, చుట్టూ ఉన్న జంతువులకు డిస్టర్బెన్స్  అవుతుంది. కానీ మనుషుల అవసరాలు అన్నింటిని అధిగమించాయని చెప్పవచ్చు . ఇవన్నీ ఎలా ఉంటాయంటే ట్రైన్ పట్టాల్లాగా ఉంటాయి. ప్రభుత్వానికి రెవెన్యూ రావాలంటే క్రూజ్ లు, ట్రైన్ లు, ప్లేన్సు తప్పవు. రెవెన్యూ వస్తేనే వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా పర్యావరణానికి ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . అందుకే ఇవి నాకు సమాంతర రేఖలు అనిపిస్తాయి.

Train station దగ్గరకి వస్తుంటే ప్రకృతిలో మమేకమైనట్టుగా చెక్కలతో ఇల్లు చెట్ల మధ్యన ఇండ్లు చిన్న చిన్న ఇళ్లకు కూడా ఫెన్సింగ్ లు అందమైన పూల మొక్కలు ఇరువైపులా..! మీకు తెలియందేముందండీ..?? ఇక్కడ పరిశుభ్రం గురించి. తడి చెత్త పొడి చెత్త లకు విడివిడిగా డస్ట్ బిన్స్ పెడతారు అందుకే ఎంత మారుమూల ప్రాంతానికి చూసిన ఎంతో శుభ్రంగా ఉంటాయి. శుభ్రత లేకుంటే ఫైన్ వేస్తారు.

ఈరోజుకు మా టూర్ పూర్తయింది. క్రూజ్ లోకి వెళ్లగానే సిబ్బంది వెల్కమ్ డ్రింక్స్ తో మళ్ళీ స్వాగతించారు . రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యేసరికి డిన్నర్ టైం అయింది. డిన్నర్ లో పరోటాలు కర్రీ తినేసి కాసేపు స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్లి కూర్చున్నాం. రేపు ఫిఫ్త్ డే “జునూ” కు వెళ్తున్నాం.

Glacier చూడాలి. గ్లేషియర్స్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం వాం బట్టలు వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం.

ఇది జూలై నెల కాబట్టి తొందరగా చీకటి అవదు. ఏమైనా ప్రోగ్రాం చూద్దామని ఎయిత్  డేక్ కు  వెళ్ళాం. అక్కడ డీల్ ఆర్ నో డీల్ షో  జరుగుతున్నది. అది కొంచెం సేపు చూసాం . క్రూజ్ లో  ఒక తెలుగు జంట పరిచయమయ్యారు. వాళ్లు కూడా దాదాపు మా వయసు వాళ్లే ! టెక్సస్ లో ఉంటారట. దాదాపు 30 సంవత్సరాల అయిందంట వాళ్లు అమెరికాకు వచ్చి. ఆ జంట కూడా డీల్ ఆర్ నో డీల్ కార్యక్రమం చూడ్డానికి వచ్చారు. ఈ షోలో పాల్గొనడానికి ముందుగా మన పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. మాకు టైం లేకుండే. అందుకే మేము అందులో పాల్గొనలేదు. మా ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యారు. మేము వాళ్లను ఎంకరేజ్ చేసాము, సపోర్ట్ చేశాము .ఈ సెలక్షన్ కోసం లక్కీ డిప్ తీస్తారు. మా ఫ్రెండ్స్ కు 200 డాలర్ల గిఫ్ట్  కూపన్ వచ్చింది. ఈ కూపన్ NCL లోనే వాడాలి.  ఏ రూట్ లో వెళ్లినా వాడుకోవచ్చు. లోపల షాప్స్  ఉంటాయి కదా!  ఆ షాపుల్లో బట్టలు, హ్యాండ్ బ్యాగులు కొనుక్కోవడానికి వాడుకోవచ్చు.  మా ఫ్రెండ్స్ కు వచ్చాయి కదా! వాళ్ళకు  కంగ్రాజులేషన్స్ చెప్పి పడుకోవడానికి రూంకు వెళ్ళాం.

( ఇంకా వుంది)

 

Written by Nellutla Indrani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“శుభ ముహూర్తం”- 9వ భాగం

ఎదురుచూపు