The Cruise – ఓ దృశ్య ప్రయాణం Part 2

(Travelag – యాత్రా చరిత్ర)

సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు Pier 66 కు వెళ్లాం . చెకింగ్ కావడానికి క్రూజ్ బయలుదేరడానికి మూడు గంటల ముందు చెకిన్ ప్రారంభిస్తారు. ముందు కెనడా వీసా చెక్ చేసి … ఎందుకంటే క్రూజ్ టూర్ లో భాగంగా విక్టోరియా ఐలాండ్ వస్తుంది. విక్టోరియా ఐలాండ్ కెనడాలో ఉంది. అందుకని కెనడా వీసా తప్పనిసరి కావాలి. చెక్ చేసిన తర్వాత మనకు రూమ్ కీ ని ఇస్తారు. మన లగేజ్ సిబ్బంది తీసుకుంటారు. టాగ్ వేసి మన రూమ్ కు రాత్రి వరకు తీసుకువస్తారు .
సరిగ్గా నాలుగు గంటలకు క్రూజ్ ఆరంభం కాగానే “ఒక ప్రకటన” చేస్తారు.

అందరిని ఒక హాల్ దగ్గరికి పిలిచి లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలో అత్యవసర పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఒక డెమో ఇస్తారు. తర్వాత మాకు ఇచ్చిన రూమ్ లో కాసేపు కూర్చుని ఇక క్రుజంతా కలిగే తిరగడం ప్రారంభించాం.
15 డెక్ లో అబ్జర్వేషన్ లాంజ్ ఉంటుంది. చాలా పెద్ద విండోస్ ఉంటాయి. కొన్ని సోఫాలు చిన్న చిన్న రౌండ్ టేబుల్సు వాటి చుట్టూ కుర్చీలు ఉంటాయి. అక్కడ కూడా టీ కాఫీ లే కాకుండా రకరకాల డ్రింక్స్, చిన్న చిన్న కేక్స్, పేస్ట్రీలు పిజ్జాలు రకరకాల చిప్స్, వాల్నట్స్ , పిస్తా లాంటి నట్స్ కూడా ఉంటాయి. డిన్నర్ కు సరిపోను ఉండవు. అవి జస్ట్ స్నాక్స్ ఇంకా, డ్రింక్స్ అంతే .
ఇక వాష్ రూమ్లల గురించి యు.ఎస్.ఎ. లో ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనే లేదు కదా అట్లాగే 15వ డెక్ లో కనీసం 8 నుండి 10 వరకు వాష్రూమ్స్ ఉన్నాయి. డెక్ మొత్తం చక్కగా, అందంగా అలంకరించారు.
కొన్ని నిజమైన పూలతో ఉన్న అలంకరణలు ఉంటే కొన్ని కాగితపు పూలతో ప్లాస్టిక్ పూలతో అలంకరించి ఉన్నాయి.
ఐటనరీ ప్రకారం డే వన్ సియాటిల్ వాషింగ్టన్ Embark నాలుగు గంటలకు Day at Sea స్టార్ట్ అయ్యి, Day 2 on Sea , Day 3 Ketchikan , ఉదయం 7 నుండి సాయంత్రం ఐదు వరకు.
జూలై మాసం కాబట్టి సూర్యుడు రాత్రి 10 గంటలకు అస్తమిస్తాడు. అన్ని గంటలు అంటే మా ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎంతో హడావిడి. పిల్లలు పరిగెత్తడాలు, పెద్దవాళ్లు కొత్తగా పలకరించుకోడాలు పరిచయాలు , పలకరించుకోవడాలు , తోటి ప్రయాణికులతో కబుర్లాడడం, Stewards అంటే క్రూజ్ లో ఫుడ్ సర్వ్ చేసేవాళ్లు, క్లీనింగ్ చేసే వాళ్ళతో హంగామా ఉండింది.
ఎలాగూ సాయంత్రం 16 వ డెక్ లో అన్ని రకాల రెస్టారెంట్లలో ఎన్నో రకాల స్నాక్స్ అండ్ టీ ఉంటాయి . కాబట్టి , అక్కడే గోల్డెన్ కఫే లో మేమిద్దరం కొన్ని బనానా చిప్స్ కొన్ని ఆలూ చిప్స్ తీసుకొని కాఫీ తాగాము. రెస్టారెంట్లో ఎటువైపు కూర్చున్నా సముద్రం కనిపించేటట్టు పెద్ద పెద్ద అద్దాల కిటికీలు ఉన్నాయి. అక్కడ కూర్చుని సముద్రాన్ని చూస్తూ చాలాసేపు గడిపాం.

మా పసిఫిక్ కడలి ప్రయాణం లో “పదనిసలు” చాలా కనిపించాయండి. అంటే … పదనిసలంటే ఏమనుకున్నారు ? నా ఉద్దేశంలో ఎన్నో రకాల జలచరాలు అండి.
అయితే, అలా చూసామా…. నీలి నీలి ఆకాశంలో తెల్లని పక్షుల గుంపు ఒకటి ఎగురుతూ వెళ్ళింది. నీళ్లలోకి చూసామా… చేపలు దుముకుతూ కనిపించాయి . అంతేనండి ఇంకేం జలచరాలు కనిపించలేదు ఆ రోజు. నిరీక్షణలో తెలియని ఆనందం ఉంటుంది కదా!
కాసేపు కూర్చున్నాము ఇక డెక్ అంతా తిరుగుదామని అలా చూసాం. ఇక్కడి వీళ్లు మామూలుగా ఇక్కడ వీళ్లు early dinner చేస్తారు కాబట్టి ఒక్కొక్క రెస్టారెంట్ లో బఫే లు సర్దడం ప్రారంభించారు ఆరోజు రాత్రికి డిన్నర్ లోకి “The Taste of India ” లో ఆలు పరాటా గోబీ పరాటా పన్నీర్ కూర్మా టమాటా పప్పు వైట్ రైస్ రసం ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. Mexican ,Italian, Mediterranean Chinese ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి రకరకాల పండ్లు కూడా ఉన్నాయి ఇవన్నీ చక్కగా కట్ చేసి పెట్టారు కొన్ని కట్ చేయనివి కూడా ఉన్నాయి ఇక deserts విషయమైతే చెప్పనక్కర్లేదు. Ice creams చూడాలి . చాలా రకాల ఫ్లేవర్స్ తో కేక్స్, పేస్ట్రీలు, కూడా ,రకరకాల జ్యూసులు కూడా ఉన్నాయి.
మేము త్వర త్వరగా వెళ్లి , ఫుడ్ అయిపోతుందని బాధ కాదు .. సముద్ర ప్రయాణం ప్రారంభమైందని! జలచరాల్ని ఎక్కడ చూడకుండా అవుతామేమోనని తొందరగా వెళ్లి ఒక ఆలూ పరాటా, రైతా, అన్నం, రసం అన్నం తీసుకొని వచ్చి సముద్ర దృశ్యాన్ని ఆస్వాదిస్తూ డిన్నర్ తిన్నాం. తర్వాత వేడివేడి బ్లాక్ కాఫీ తాగాం. రాత్రి పడుకునే ముందు కాఫీ తాగొద్దు అంటారు మా పిల్లలు . కానీ మాకు ఆ టైంలో ఏమీ గుర్తుకు రాలేదంటే నమ్మండి. సంతోషంలో ఏమి తాగాం ఏమి తిన్నాం అని కూడా చూసుకోలేదు.
క్రూజ్ ప్రయాణం పసిఫిక్ మహాసముద్ర హాయిగా సాగుతున్నది. కడలిని ఆనుకున్నట్టే చుట్టూ కొండలు. మొత్తం పచ్చదనమే. ఎందుకంటే సియాటిల్ చుట్టుపక్కల అలాస్కా వరకు కూడా వర్షాలు చాలా ఎక్కువ . అందుకే ఎటు చూసినా కొండలపైన పచ్చదనమే పచ్చదనం. మహాసముద్రం కూడా ప్రశాంతంగా ఉంది. పైన ఆకాశం నీలం రంగు సముద్రం కూడా నీలం రంగుతో చాలా ఆహ్లాదంగా ఉంది.
ఆరోజు జలచరాలు ఏమీ కనిపించలేదు . ఆ మహా సాగరంలో ఎక్కడ దాక్కున్నాయో తెలియదు . మాకే కాదు, ఎవరికీ కనిపించలేదు. మామూలుగా అయితే ఏదైనా కనిపిస్తే, ఏదైనా జంతువు కనిపించగానే ప్రయాణికుల హడావిడి తెలిసిపోతుంది. అదే కాకుండా అక్కడ అటు ఇటు తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న స్టాఫ్ కూడా అనౌన్స్మెంట్ చేస్తుంది. అనౌన్స్మెంట్ అంటే ప్రకటన చేస్తుంటారు. కుడివైపు చూడండి, ఎడమవైపు చూడండి .వేల్స్ ఉన్నాయ్… అక్కడ ..అంటూ ఏదో చెబుతూ ఉంటారు . ఆరోజు మాకు లక్ లేదు కావచ్చు ఏవి కనిపించలేదు.

చూస్తుండగానే సూర్యాస్తమం అయింది. కొండలలో సూర్యుడు కనుమరువైపోయాడు. ఆ ఎర్రటి సూర్యుడు పచ్చని కొండలలో అస్తమయ దృశ్యం …ఇక ఆ వైపున.. పడమట ఆకాశమంతా నారింజ రంగుతో అక్కడక్కడ గులాబీ రంగుతో అత్యద్భుతం. వర్ణింప లేనిది అనుభవించాలి అంతే!!
ఇక నెమ్మదిగా లేచి పడుకోవడానికి మా రూమ్ కు వెళ్లాం . రూమ్ లో టీవీ ఉంది . ఆ టీవీలో సేమ్ ఫ్లైట్ లో రూట్ చూపించినట్టు సీ రూట్ కూడా చూపిస్తారు. రాత్రి కాబట్టి క్లియర్ గా ఉండదు.
రెండో రోజు.. సముద్రం మీదనే మా ప్రయాణం. ఉదయం 6 గంటల నుండే మేము కాఫీ పట్టుకుని అబ్జర్వేషన్ లాంచ్ లో కూర్చున్నాం.

Observation deck

ఇక్కడ మన ప్రయాణ పదనిసలు ఉన్నాయిగా! అదేనండి …జలచరాలను చూడడానికి 15 వ డెక్ లోకి కూడా కేకు కాఫీ పట్టుకొని వెళ్లి
అబ్జర్వేషన్ లాంచ్ లో కూర్చున్నం. ఈడెక్ పై కూడా కాఫీలు , టీలు, కేకులు, స్నాక్స్ ఉంటాయి.
‘సూర్యోదయం’ ఒక అద్భుతం ! సూర్యుని లేత కిరణాలు కొండలపైన పడడం నిజంగా చూడవలసిన దృశ్యమే! కొండలపైన, చెట్ల పై భాగంలో ఆ లేత కిరణాలకు చెట్ల ఆకులు వెండి కళను సంతరించుకుని ఉన్నాయి. “రవికాంచనివి కవి కాంచును” అన్న నానుడి నిజం చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. కొంతవరకు చూసాననే అనుకుంటున్నాను మరి.
మాకు బ్రేక్ ఫాస్ట్ కు టైం అవుతున్నది కానీ జలచరాలకు బ్రేక్ ఫాస్ట్ టైం కాలేదేమో! నీటి ఉపరితలానికి రాలేదు! నీళ్ల లోపల మరీ లో లోపల కి వెళ్లి ఏమైనా పనులు చేస్తున్నాయేమో అనుకొని నవ్వుకుంటూ బ్రేక్ ఫాస్ట్ బఫెట్ టేస్ట్ ఆఫ్ ఇండియాకు దగ్గరికి వచ్చాము. ఆరోజు పూరి , ఆలు కూర ఉన్నది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఏమీ అదృష్టం! అమెరికాలో సముద్రం పైన పూరీలు ఆలూ కూర్మా చట్నీలు అని అనుకుంటూ… అవి తెచ్చుకుని సముద్రాన్ని చూస్తూ రుచిని ఆస్వాదిస్తూ తిన్నాం. మళ్ళీ ఈసారి కాఫీ పట్టుకొని మళ్లీ 15 డేస్ పైకి వచ్చాం.
కళ్ళింత చేసుకొని ఆ జలచరాలను చూడడానికి రెడీగా ఉన్నాం. సడన్ గా ఒక Whale తోకతో “హాయ్” చెప్పింది. అందరం ఒక్కసారిగా “వావ్” అన్నాం. అందరూ “Wow Wow” అంటూనే ఉన్నారు. కెమెరాలు పట్టుకునే వాళ్ళు కెమెరాలు, మొబైల్స్ పట్టుకున్న .. అందరూ వీడియో లు తీసేవాళ్లే! మన “పదనిసలు” వస్తాయని ఎదురుచూస్తూ ఉన్నారు. మళ్ళీ కనిపిస్తాయని ఆశతో చూశాం .. కానీ అవి ఎక్కడ? మన ఆత్రానికి వాటి సిగ్గుకు పొంతనే లేదు.
మళ్లీ ఒక అరగంట తర్వాత స్టాప్ ఒకతను లెఫ్ట్ సైడ్ చూడండి అక్కడ humpback whale ఉందని చెప్పాడు అందరం అటు పరుగెత్తాం. హాం… బ్యాకా వేల్ రెండు సార్లు సముద్రం ఒడ్డుకు చక్కర్లు కొట్టింది .అది చాలా పెద్దది. ఒక్కసారిగా దాని కదలికకు సముద్రం నీళ్లు అల్లకల్లోలం అయ్యాయి. దాన్ని చూసి దాని పిల్ల కూడా ఆడుకోవడానికి వచ్చినట్టుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇక నేను ‘కనురెప్ప ‘వాల్చకుండా చూశాను.

               Humpback whale

అబ్బా కలల పండుగ కనుల నిండుగా అనుకుంటూ రూమ్ కు వచ్చాం. ఫ్రెష్ అయ్యి మా వారు రఘురామ్ ఎయిత్ డెక్ పైన జరుగుతున్న సోలో మ్యూజిక్ వినడానికి వెళ్లారు. ఆయన సింగర్. నా ఎంజాయ్మెంట్ నాదే ! సేమ్ 15 వ డెక్కులో జలచరాలు వస్తాయేమోనని ఒళ్లంతా కళ్ళు చేసుకుని కూర్చున్నాను . కొంచెంసేపటి తర్వాత నేను కూడా 8 వ డెక్ పైకి వెళ్లి మ్యూజిక్ షో ఎంజాయ్ చేశాను. అక్కడ అన్ని వెస్ట్రన్ సాంగ్స్ పాడారు.

Day 3 :- కెచికెన్ కు చేరుకున్నాం. ఉదయం ఏడు గంటలకు చేరుతాం అని ఐటనరీలో ఉంది. అలాగే చేరాం . కెచికన్ ను gate of Alaska అంటారు.

అలస్కా కాపిటల్ Juneau జును . అలాస్కా పాపులేషన్ మొత్తం700,700. వైశాల్యంలో టెక్సాస్ , కాలిఫోర్నియా, ముంటానా అనే మూడు రాష్ట్రాలను కలిపితే ఎంత ఉంటుందో దాదాపు అంత వైశాల్యం కలిగి ఉంటుంది . విసిరేసినట్టుగా పూర్తిగా ‘ఆర్కిటిక్’ వైపు ఉంటుంది .

దూరంగా ఉన్నంత మాత్రాన రిజెక్టెడ్ స్టేట్ మాత్రం కాదు..
ఆర్కిటిక్ సముద్రం వైపు ఉంటుంది కాబట్టి చల్లదనం. మంచు గడ్డలు ఎక్కువ మన భూగోళాన్ని సముద్రాలు , మహా సముద్రాలు పర్వతాలు గుట్టలు 30 శాతం భూమితో 70% నీళ్లతో ఉంటుందని వర్ణించారు. మహాసముద్రం అంటే చాలా పెద్దదిగా లోతుగా ఉప్పునీళ్ళతో ఉంటుంది . సముద్రం అంటే చిన్నదిగా కొంచెం లోతుగా చుట్టూ భూమితో కవర్ అయి ఉంటుంది . ఆర్కిటిక్ సర్కిల్ వైపు వెళ్తే Tundra, టండ్రా ప్రదేశం అంటే విశాలంగా ఫ్లాట్ గా ఉండి చెట్లు లేకుండా ఎప్పటికీ మంచుతో కప్పబడి ఉంటుంది .
ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్న అలాస్కా లోని గేట్ వే ఆఫ్ అలస్కాగా పిలువబడుతున్న కెచకన్ లో ఉదయం 7 గంటలకు ఐటనరీ లో ఇచ్చిన సమయానికే చేరుకున్నాం. 6.30 కే లేచి, ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చి “Room cleaning” కోసం ” Make Up” bord ను వుంచి, 15 వ డెక్ పైకి వెళ్ళాం .” Make Up ” అనే బోర్డ్, “Don’t Disturb bord లు తలుపు పైన వుంటాయి. క్లీనర్స్ దాన్ని చూసుకొని వచ్చి రూమ్ శుభ్రం చేస్తారు .
కాసేపు ఉండి బ్రేక్ఫాస్ట్ తినడానికి 16 డెక్ కు వచ్చాము. ” The Taste of India” buffet లో ఆరోజు వడలు, ఇడ్లీలు. బ్రేక్ ఫాస్ట్ తిని కాఫీ తాగేసి ఇంకా కెచ్ కన్ ఎక్స్ప్లోర్ చేయడానికి క్రూజ్ బయటకు వచ్చాము. మనం తప్పకుండా మన రూమ్ కీ ని మనతో తీసుకువెళ్లాలి. పాస్ పోర్టులు కూడా తీసుకువెళ్ళాలి . క్రూజ్ వాళ్ళు మనకు సాయంత్రం ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి రావాలో కూడా చెప్తారు. ఇదంతా ఐటనరీ లో కూడా ఉంటుంది.
చెక్ అవుట్ అయ్యి బయటకు వచ్చాము.
“Ketchikan ” Norwegian Cruise కు ఒక సెపరేట్ పోర్టు ఉన్నది రెండు క్రూజ్ లు తీరానికి ఒక్కసారి వచ్చాయి.ఒకటేమో నార్వేజియన్ జాయ్ అనే క్రూజ్ మేం ప్రయాణిస్తున్న క్రూజ్ . ఇదే కాకుండా ఇంకా ” Norwegian Encore ” .

ఈ రెండు క్రూజ్ లు ఒకేసారి తీరానికి చేరాయి. Encore నుండి చాలామంది భారతీయులు దిగారు. నేను కొద్ది మందిని అడిగాను ఎందుకు నార్వేజియన్ ఎన్కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారని? ఇండియన్ ఫుడ్ ఉంటుంది అని చెప్పారు . ” యెహీహై రైట్ ఛాయిస్ బేబీ..” అని ఒక వ్యాపార ప్రకటన గుర్తుకు వచ్చింది నాకు .


నార్వేజియన్ వాళ్ళు పోర్టు నుండి డౌన్ టౌన్ వరకు ఫ్రీ షటిల్ నడుపుతారు . డౌన్ టౌన్ బస్సు బే నుండి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యం నడిపే బస్సులు ఉంటాయి. ప్రభుత్వ బస్సు ఫ్రీ. అయితే, ప్రతి చోట వాటిని ఆపరు. కానీ చాలావరకు అన్ని ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేస్తారు. ప్రతి పది నిమిషాలకు ఒకసారి బస్ ఉంటుంది. బస్సు నడిపే డ్రైవర్స్ ఆ రూట్ లో వెళ్తూ ఉంటే వచ్చే ముఖ్యమైన ప్రదేశాలను వాటి ప్రాముఖ్యతలను క్లుప్తంగా వివరిస్తారు. కొన్ని జోక్స్ కూడా వేస్తారు. నేను కొన్ని జోక్స్ ను అర్థం చేసుకున్నాను . కొన్ని అర్థం కాలేదు.
కెచ్ కెన్ సిటీని ఆనుకునే ” Tongas National Forest ” ఉన్నది. అసలు పర్సిఫిక్ మహాసముద్రానికి, టోన్స్ నేషనల్ ఫారెస్ట్ కు మధ్యలో కెచికన్ సిటీని డెవలప్ చేశారనడం సబబు అనుకుంటున్నాను. Ships అన్నీ North వైపుకు వెళ్లాలంటే కెచికెన్ గుండా వెళ్ళాలి. కెచికెన్ చాలా పెద్ద పట్టణం అందుకే కెచికెన్ కు ” Gate Eay of Alaska ” అనే పేరు వచ్చింది. ఇది ” Revi Yokaheds” Island ను ఆనుకొని ఉంది.
ఐలాండ్ అంటే ద్వీపం. చుట్టూ నాలుగు వైపులా నీళ్లతో ఉండేదాన్ని ద్వీపం అంటారు కదా! ఈ ఐలాండ్ లో ఎప్పటికీ వర్షాలు పడ్తాయి. దాదాపు సంవత్సరంలో 230 రోజులు వర్షాలే ఉంటాయి. ఇక్కడి ప్రజలు Stilts, స్టిల్ట్ ఇళ్ళు నిర్మించుకుంటారు . స్టిల్స్ అంటే wooden pillers పైన కట్టే ఇళ్లు.
ఇవి చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. ఇక్కడి ప్రదేశాలనే కాదు ఈ ఇళ్ళను చూడడానికి ప్రజలు తప్పకుండా వస్తారు. అంతలా కనువిందు చేస్తాయి.
కెచికెన్ కు ఇంకో నిక్ నేమ్ మరో పేరు మారుపేరు ఏమంటారో కానీ మరో పేరు కూడా ఉందండోయ్ అదేమంటే “క్యాపిటల్ ఆఫ్ సాల్మన్” “Capital of Salman” అంటారు. ఇక్కడ దొరికే రకరకాల చేపలు Halibut, Lingcod , Rockfish, Pacific cod అనే చేపలు ఉంటాయిట. అన్నింటిలో ఎక్కువ Omega-3 లభించేది సాల్మన్ ఫిష్ లోనే ఒమేగా త్రీ వల్ల శరీరానికి కావలసిన న్యూట్రియంట్స్ మన శరీరానికి అందుతాయి. గుండె చుట్టూ ఉండి గుండెకు నష్టం చేసే బ్యాడ్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అందుకే సాల్మన్ ఫిష్ కు ఇంత ప్రత్యేకత.
బస్ లో Totem Heritage Center కి వెళ్ళాం. టోటమ్స్ ఎత్తుగా ఉండే వుడెన్ పోల్స్ కు డిజైన్స్ డిజైన్స్తో చెక్కే అందమైన చెక్క పోల్స్ నిర్మాణాలు. ఇక్కడున్న నేటివ్ అమెరికన్స్ తెగలు Tlinigt, Haida , Tsimshian తెగలు వీళ్లకు చాలా ముఖ్యమైనవి అవి మతానికి సంబంధించినవి కావు. వాళ్ళ చరిత్రకు సంబంధించినవి. కెచికెన్ కు ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది. అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ నిలబడి ఉన్న టోటెమ్స్ కెచికన్ లో ఉన్నాయి. ఈ పోల్స్ పైన కొన్ని పెద్ద పెద్ద మనుషుల ముఖాలు ( faces) , కొన్ని పక్షులు చెక్కి ఉంటాయి. టూర్ లో భాగంగా “Saxman Native Village ” చూసాము. ఇక ఇండిజినయస్ ప్రజలు ఎక్కువ అంటే నేటివ్ పీపుల్. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడే ఉన్న ప్రజలు. వాళ్లదైనా సొంత భాష సంస్కృతి కలిగి ఉన్నవాళ్లు.
ఈ సాక్స్ మాన్ నేటివ్ విలేజ్లో చాలా టోటెమ్ పోల్స్ Totem Polls ఉంటాయి. ఇవి చాలా కళాత్మకంగా ఉంటాయి.
” Tongass National Forest” దగ్గర హైకింగ్ చేయవచ్చు. ఇది అడవి కాబట్టి రకరకాల చెట్లు పక్షులు ఉంటాయి. మేము కొద్దిసేపు hiking చేశాం. కానీ, ఔత్సాహిక జనాలను ఆపేవాళ్ళెవరండీ? ? వాటర్ బాటిల్స్, ఎనర్జీ బార్స్ తీసుకొని హైక్ చేస్తూ వెళుతూనే ఉంటారు.
కొంచెం సేపు హైక్ చేసిన తర్వాత ఇంకా చేయలేమని అనిపించి మేము ఆపేసాము ఆ తర్వాత లోకల్ రెస్టారెంట్ కి వెళ్లి పాస్తా తినేసి అక్కడినుండి “whale watching ” కి వెళ్ళాం.

ఇక్కడ “wild life Tour లో వేల్ వాచింగ్ కు టికెట్ కొనుక్కున్నాం. ఇది ఫిక్స్డ్ ప్రైస్ లాగా ఉండదు. మాలాగే ఇంకో 20 మంది ఉన్నారు అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. మినిమమ్ అంటే, ఎమర్జెన్సీ పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు. ఇక whale watching బయలుదేరాం, ఒకవైపు ఉత్సాహంగా ఉన్నాం, ఇంకోవైపు భయం. భయం ఎందుకంటే మహాసముద్రం పైన చాలా పెద్ద క్రూజ్ లో ప్రయాణ అనుభవం వేరేగా ఉండింది. ఇక్కడ చాలా చిన్న బోట్ లో పసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తున్నామంటే భయంగా అనిపించింది. కానీ …ఉత్సాహమే గెలిచిందండి !! గుంపులు గుంపులుగా వేల్స్ ను దూరం నుండి కొన్ని, దగ్గర నుండి కొన్ని చూసాం. ఈ అనుభూతి సముద్రం అంత ఆనందాన్ని ఇచ్చింది. వేల్స్ అన్నీ అవి అలా…లేచి మళ్లీ నీళ్లలోకి పడుతూ ఉంటే సముద్రం అల్ల కల్లోలం అయి నీళ్ళు చిమ్మే దృశ్యం భలేభలే. కాసేపు…అంటే, ఒక రెండు గంటల్లో తిరిగి వచ్చాము. ఆ బోట్ లో కొన్ని సాఫ్ట్ డ్రింక్స్, కేక్స్ ఇచ్చారు. ఇక మళ్ళీ క్రూజ్ కి వెళ్లే సమయానికి పోర్టుకు వచ్చాము.
రాగానే క్రూజ్ సిబ్బంది వెల్కమ్ చెప్పిన తీరు బ్రహ్మాండం . ముందు వామ్ టవల్స్ ఇచ్చారు, తరువాత వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. Jetty Cruise కు వెళ్లే wooden bridge నుండి ప్రతి 2 మీటర్స్ కు ఒక ఎంప్లాయ్ వెల్కమ్ చెప్పారు. ఏదో మర్యాదలు తక్కువైనట్టు క్రూజ్ లో అడుగుపెట్టగానే మిల్క్, కొన్ని జ్యూసెస్ లు , టీ కాఫీలతో స్వాగతం లభించింది. మా రూమ్ కీ చెక్ చేసాక , రూమ్ కు వచ్చి రెస్ట్ తీసుకున్నాం. Room makeup అని పెట్టాం కదా.. మేం వచ్చేవరకు బెడ్ షీట్స్ పిల్లోస్ అన్ని సర్ది పెట్టారు. చాలా రిలాక్సింగ్ గా అనిపించింది కాసేపటి తరువాత ” వివాహ భోజనంబు…” type లో డిన్నర్ తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఇలా కెచికన్ ప్రయాణం ముగిసింది.

Written by Nellutla Indrani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“ఎవరి జీవితానికి వారే”

అచ్చంగా వినిపించే మరో స్త్రీవాద స్వరం – రేణుక అయోలా కవిత్వం